సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదం న్యాయస్ధానాల్లో తేలేది కాదని ఆథ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. కోర్టులో కేసును ఓడిపోయిన వారు తొలుత తీర్పును అంగీకరించినా భవిష్యత్‌లో దీనిపై గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య వ్యవహారాన్ని కోర్టు వెలుపల సామరస్యంగా పరిష్కరించుకుంటేనే మేలని సూచించారు. కాగా అయోధ్యలో మందిర్, మసీదు వివాదం కోర్టు వెలుపల పరిష్కారం కావాలన్న శ్రీశ్రీ సూచనపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయోధ్య వివాదానికి శ్రీశ్రీ దూరంగా ఉండాలని బాబ్రీ యాక్షన్ కమిటీ కోరగా, శ్రీశ్రీ మధ్యవర్తిత్వాన్ని మరికొందరు రాజకీయ నేతలు తోసిపుచ్చారు.
హిందువులు, ముస్లింలు ముందుకొచ్చి శతాబ్ధాల నాటి వివాదాన్ని పరిష్కరించుకోవాలని గతంలోనూ శ్రీశ్రీ రవిశంకర్ పిలుపు ఇచ్చారు. అయోధ్యలో మందిర నిర్మాణాన్ని పెద్దసంఖ్యలో ముస్లింలు వ్యతిరేకించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. బాబ్రీ మసీదు-రామజన్మభూమి కేసులో తుది విచారణను గతేడాది డిసెంబర్ 5న సుప్రీం కోర్టు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment