సెక్స్ వర్కర్లకూ నోట్ల కష్టాలు! | sonagachi sex workers face demonitisation problems, have to accept old notes | Sakshi
Sakshi News home page

సెక్స్ వర్కర్లకూ నోట్ల కష్టాలు!

Published Fri, Nov 11 2016 11:52 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

సెక్స్ వర్కర్లకూ నోట్ల కష్టాలు! - Sakshi

సెక్స్ వర్కర్లకూ నోట్ల కష్టాలు!

అందరి కష్టాలూ ఒక ఎత్తయితే.. వాళ్ల కష్టాలు మరో ఎత్తు. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సెక్స్ వర్కర్లు సరికొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి వద్దకు వచ్చేవాళ్లు పాత 500, 1000 రూపాయల నోట్లను మాత్రమే ఇస్తున్నారు. వద్దంటే అవి తప్ప వేరే డబ్బులు లేవంటున్నారు. కోల్‌కతాలోని అతిపెద్ద రెడ్‌లైట్ ఏరియా అయిన సోనాగచిలో ఈ పరిస్థితి ఎదురవుతోందని అక్కడి సెక్స్ వర్కర్లు వాపోతున్నారు. ఆ డబ్బు తీసుకుని తాము ఏం చేసుకోవాలని.. ఒకవేళ వద్దంటే మొదటికే మోసం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వాస్తవానికి ఆ డబ్బంతా వాళ్లు పూర్తిగా కష్టపడి సంపాదించేదే తప్ప.. ఒక్క రూపాయి కూడా బ్లాక్ మనీ అన్నది ఉండదు. కానీ, అది తాము సంపాదించినదని నిరూపించుకోడానికి వాళ్ల దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు. దానికితోడు, వాటిని మార్చుకుందామన్నా, చట్టపరమైన పత్రాలు ఏమీ లేకపోవడంతో బాగా ఇబ్బంది అవుతోంది. కోల్‌కతాలో మిగిలిన నగరం మొత్తం పాత కరెన్సీ నోట్లను మార్చుకోవడంలో బిజీబిజీగా గడిపితే.. సోనాగచిలో మాత్రం పాత నోట్లు తీసుకోవడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. పాతనోట్లు తీసుకోబోమని చెబితే తమకు కొన్ని రోజుల పాటు అసలు వ్యాపారమే ఉండదని, అయితే తరచుగా వచ్చేవాళ్లను మాత్రం తర్వాత కొత్తనోట్లు తెచ్చి ఇవ్వాలని చెబుతున్నామని అన్నారు. ఇక పెద్దమొత్తాల్లో చెల్లించే కస్టమర్ల విషయంలో అయితే పుస్తకాల్లో రాసుకుంటున్నారట. వాళ్లు తమకు బాగానే గుర్తని, అందువల్ల తర్వాత వచ్చినప్పుడు వాళ్ల దగ్గర కొత్త నోట్లు తీసుకుంటామని చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement