పన్నులు చెల్లిస్తున్న వినియోగదారులు
రికార్డుస్థాయిలో పన్నులు
Published Sat, Nov 12 2016 11:10 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
కరెంట్ బిల్లుల ద్వారా వచ్చింది రూ.72లక్షలు
ఇంటి పన్నుల ద్వారా రూ.26.81 లక్షలు
కరెంటు బిల్లుల చెల్లింపునకు మరో మూడు రోజులు అవకాశం
సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని/ కోల్‌సిటీ : పెద్దనోట్లు రద్దు ఇంకా పల్లెల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. తమవద్ద రూ.500, 1000పాతనోట్లను మార్పిడి చేసుకునేందుకు ఎంతగా ఆందోళన చెందుతున్నారో పన్నుల చెల్లింపే అద్దంపడుతోంది. పాతనోట్లుపన్నుల కట్టలు శుక్రవారం నుంచి చెల్లుబాటు కావని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కొత్త నోట్లు అందుబాటులోకి రాలేదు. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పాతనోట్లతోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీల్లో ఇంటి పన్నులు, నల్లా, కరెంటు బిల్లులు శుక్రవారం ఒక్క రోజు చెల్లించవచ్చని ప్రకటించింది. దీంతో జిల్లాలో ఒక్క రోజులోనే రికార్డుస్థాయిలో చెల్లింపులు వచ్చాయి. రూ.కోటి మేర ఒక్క రోజులోనే వసూలయ్యాయి. కరెంట్ బిల్లులు పెద్దపల్లి ఈఆర్‌వో పరిధిలో రూ.30 లక్షలు, గోదావరిఖని పరిధిలో రూ.32లక్షలు, మంథని పరిధిలో రూ.10లక్షలు ట్రాన్స్‌కో ఖజానాకు వచ్చి చేరాయి. దీంతో ట్రాన్స్‌కో మొండి బకాయిలను రాబట్టేందుకు ఇదే మంచి అవకాశమని, పాతనోట్లతో బిల్లుల చెల్లింపును మరో మూడురోజులకు పెంచింది. ఇక ఇంటి పన్నుల విషయానికి వస్తే పెద్దపల్లి నగర పంచాయతీ పరిధిలో రూ.10లక్షలు, రామగుండం కార్పొరేషన్ పరిధిలో రూ.11.50లక్షలు, జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల ద్వారా రూ.5.31లక్షలుఖజానాకు వచ్చి చేరాయి.
ట్రాన్స్‌కోకు భారీగా బకాయిల చెల్లింపు
గోదావరిఖని విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని జనగామ, రాంనగర్, ౖయెటింక్లయిన్‌కాలనీ, గౌతమినగర్, పీజీ సెంటర్, రామగుండం, ఆకెనపల్లి, బసంత్‌నగర్ సబ్‌స్టేçÙన్లలో కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లు బిల్లులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వడంతో శుక్రవారం ఒక్కరోజే బకాయిలు రూ.26లక్షలు వసూలయ్యాయి. గురువారం ఈ నోట్లు అనుమతించకపోవడంతో కేవలం రూ.1.50లక్షలు వసూలయ్యాయి. శుక్రవారం ఏకంగా రూ.26 లక్షలు వసూలయ్యాయి.
కార్పొరేషన్‌కు రూ.11 లక్షలు
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆస్తి పన్ను వసూలుకు శుక్రవారం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు కేంద్రం శుక్రవారం అర్ధరాత్రి వరకు అనుమతి ఇవ్వడంతో నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, కమిషనర్ డి.జాన్‌శ్యాంసన్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్‌రావు నగరంలో ప్రచారం చేపట్టారు. మూడు ఆటోరిక్షాలకు మైక్‌ల ద్వారా నగరంలో ప్రచారాన్ని నిర్వహించారు. 17 మంది బిల్ కలెక్టర్లతోపాటు మున్సిపల్ కార్యాలయంలో రెండు ప్రత్యేక కౌంటర్లను శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రజలు బిల్లులు చెల్లించేలా అందుబాటులో ఉంచారు. రాత్రి 7.30గంటల వరకు రూ.11.50 లక్షల వరకు రికార్డుస్థాయిలో పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు. అయితే నగరంలోని 50డివిజన్లలో పన్నుల వసూళ్ల కోసం వెళ్లిన బిల్‌కలెక్టర్లు తిరిగి కార్యాలయానికి వస్తే పూర్తి కలెక్షన్ వివరాలు తెలిసే వీలుంటుందని ఆర్‌ఐ శంకర్‌రావు తెలిపారు.
Advertisement
Advertisement