నోట్ల మార్పిడి ఆపేస్తున్నారా?
నోట్ల మార్పిడి ఆపేస్తున్నారా?
Published Fri, Nov 18 2016 5:36 PM | Last Updated on Thu, Sep 27 2018 9:11 PM
కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్ల రూపాయలను రద్దుచేసిన తర్వాత బ్యాంకులలో వాటిని మార్చుకోడానికి విపరీతమైన క్యూలు ఉంటున్నాయి. చాలాచోట్ల వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. బ్యాంకులలో అసలు జరగాల్సిన పని మొత్తం ఆగిపోతోందని, అందుకోసం నోట్ల మార్పిడిని తాత్కాలికంగా ఆపేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందంటూ ఒక్కసారిగా జాతీయ మీడియా ప్రకటించడంతో శుక్రవారం సాయంత్రం కాసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. నిజంగా ఇప్పటికిప్పుడే నోట్ల మార్పిడిని ఆపేస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది.
అయితే.. కాసేపటి తర్వాత ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు నోట్ల మార్పిడి ప్రక్రియను ఆపే ఆలోచన ఏమీ లేదన్నారు. ఇప్పటికే నోట్ల మార్పిడి విషయంలో ఇన్నాళ్లుగా ఉన్న 4,500 రూపాయల పరిమితిని 2000 రూపాయలకు తగ్గించడంతో ఎక్కువ మందికి డబ్బులు అందుబాటులోకి వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Advertisement