కేజ్రీవాల్కు అసలు ఐఐటీ సీటు ఎలా వచ్చింది? | subramanian swamy seeks how did arvind kejriwal get iit admission | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్కు అసలు ఐఐటీ సీటు ఎలా వచ్చింది?

Published Fri, Jun 24 2016 1:09 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

కేజ్రీవాల్కు అసలు ఐఐటీ సీటు ఎలా వచ్చింది?

కేజ్రీవాల్కు అసలు ఐఐటీ సీటు ఎలా వచ్చింది?

అసలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఐఐటీ ఖరగ్పూర్లో సీటు అసలు ఎలా వచ్చిందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి ఆరా తీస్తున్నారు. 1980లలో ఆయనకు బీటెక్ (ఆనర్స్) డిగ్రీ వచ్చిన తీరుపై తాను సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్న అడిగినట్లు స్వామి తెలిపారు. బీటెక్లో కేజ్రీవాల్ ఎలా చేరారు, ఆయనకు జేఈఈ లాంటి పోటీ పరీక్షలలో జాతీయ స్థాయిలో ఎంత ర్యాంకు వచ్చిందనే వివరాలను ఆయన అడిగారు. అయితే, ఆ సమాచారం తమ వద్ద లేదని ఐఐటీ ఖరగ్పూర్ తెలిపింది.

అయితే.. కేజ్రీవాల్ రోల్ నెంబరు, ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ ఏయే సంవత్సరాలలో చదివారన్న విషయాలను మాత్రం చెప్పింది. అయితే మార్కుల జాబితాకు మాత్రం ఆర్టీఐ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఉన్నందున దాన్ని ఇవ్వబోమంది. కేజ్రీవాల్ జీవితమంతా మోసాలు చేస్తూనే ఉన్నారని.. ఐఐటీ విద్యార్థిగా గాయన ప్రతిభావంతుడే గానీ, అసలు ఆయనకు అడ్మిషన్ ఎలా వచ్చిందో తనవద్ద రికార్డులు ఉన్నాయని ఇంతకుముందు స్వామి అన్నారు. త్వరలోనే ప్రెస్మీట్ పెట్టి వాటిని బయటపెడతానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement