సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌పాల్ నియామకంపై జాప్యం పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది. లోక్‌పాల్‌ను ఎప్పుడు నియమిస్తారో పదిరోజుల్లోగా తమకు నివేదించాలని సర్వోన్నత న్యాయస్ధానం సోమవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. లోక్‌పాల్ నియామకంపై చేపట్టిన చర్యలను వివరిస్తూ పదిరోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ రంజన్ గగోయ్, ఆర్ భానుమతితో కూడిన బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాగా లోక్‌పాల్ నియామకంపై ప్రభుత్వం నుంచి తనకు అందిన లిఖితపూర్వక సూచనలను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ బెంచ్ ముందుంచారు. ఇక ఈ అంశంపై తదుపరి విచారణను సుప్రీం బెంచ్ ఈనెల 17కు వాయిదా వేసింది. గత ఏడాది ఏప్రిల 27న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా కేంద్రం ఇప్పటివరకూ లోక్‌పాల్ నియామకం చేపట్టలేదని ఎన్జీఓ కామన్ కాజ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు చేపట్టింది.
ప్రతిపాదిత సవరణలు చేపట్టేవరకూ లోక్‌పాల్ చట్టం అమలును నిలిపివేయాలనడంలో ఔచిత్యం లేదని గత ఏడాది ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment