న్యూఢిల్లీ: సాక్షుల రక్షణ కోసం కేంద్రం రూపొందించిన ముసాయిదాను అమలు పరిచేలా అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఈ మేరకు జాతీయ న్యాయ సేవా సాధికార సంస్థ (నల్సా) సలహా తీసుకుంటామని తెలిపింది. కేంద్రం రూపొందించిన ముసాయిదా రూపకల్పన తుది దశకు చేరుకుందని, త్వరలోనే అది చట్టంగా రూపొందనుందని ఈ లోపు ముసాయిదాను అమలుపరిచేలా అన్ని రాష్ట్రాలను ఆదేశించాల్సిందిగా అటార్నీ జనరల్ కె.కె.వేణు గోపాల్ సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. ‘మేం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం. ఈ ముసాయిదాను అమలు పరిచేలా అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తాం’అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment