
దివ్యాంగులకు 3% రిజర్వేషన్లు
ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని సర్వీసుల్లో దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు తప్పక ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.1995లో వికలాంగ (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ, పూర్తి భాగస్వామ్యం) చట్టం చేసిన ఇన్నేళ్ల తరువాత కూడా దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు శాతం కంటే తక్కువగానే ఉద్యోగాలు కల్పించడం బాధాకరమని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఏఎం సప్రేల బెంచ్ పేర్కొంది.
ఇకపై అన్ని గ్రూప్ ఎ, గ్రూప్ బి ఉద్యోగాల భర్తీలోనూ దివ్యాంగులకు 3% కోటా అమలయ్యేలా చూడాలని ఆదేశిం చింది. ఎలాంటి భర్తీ విధానమైనా ఈ ఆదేశాలు అమలు చేయాలని ఆదేశించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ గ్రూప్ ఎ, బికి సంబంధించిన కొన్ని పోస్టుల్లో దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లను తిరస్కరిస్తూ గతంలో రెండు నోట్‌లు విడుదల చేసింది. దీనిపై ప్రసారభారతిలోని కొందరు దివ్యాంగులు కోర్టుకెక్కారు. కోర్టు ఆ నోట్‌లను నిలిపేసింది.