
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : దీపావళి సందర్భంగా రోజంతా కాకుండా, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం రెండు గంటల మాత్రమే పటాసులు కాల్చాలని సూచిస్తూ సుప్రీం ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు భగ్గుమన్నారు. తాజాగా ఈ నిబంధన నుంచి తమిళనాడు ప్రభుత్వానికి మినహాయింపిచ్చింది. పటాసులు ఏ సమయంలో కాల్చాలనే విషయంలో తమిళనాడు ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని, కానీ అది రెండు గంటలకు మించకూడదని మెలిక పెట్టింది. (చదవండి: బాణాసంచా రాత్రంతా కాలుస్తాం ఏం చేస్తారు?)
తమిళనాడులో దీపావళి ఉదయం జరుపుకుంటారని, తమకు ఉదయం 4.30 నుంచి 6.30 మధ్యలో పటాసులు కాల్చేలా మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం సుప్రీంను కోరడంతో ఈ విధంగా వెసులుబాటు కల్పించింది. కావాలనుకుంటే ఈ రెండు గంటల సమయాన్ని ఉదయం ఒక గంట, రాత్రి ఓ గంటగా విభజించుకోవచ్చని సూచించింది. ఈ మినహాయింపు కేవలం తమిళనాడుకేనని, ఇతర రాష్ట్రాలకు వర్తించదని స్పష్టం చేసింది. (చదవండి: దీపావళి ధమాకా రెండు గంటలే)
Comments
Please login to add a commentAdd a comment