సాక్షి, చెన్నై : కరోనా వైరస్‌వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ పలువురు మాత్రం ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు. ఏం పని లేకున్నా వాహనాలతో రోడ్ల మీదకు వస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు కఠినంగానే శిక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు పోలీసులు లాక్‌డౌన్ ఉల్లంఘించిన ఆకతాయిలకు ‘కరోనా సినిమా’ చూపించారు. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను ఆపి.. కరోనా పేషెంట్ ఉన్న అంబులెన్స్‌లోకి ఎక్కించి బుద్ధి చెప్పారు. రోడ్ల మీదకు వచ్చిన వారిని కరోనా రోగి ఉన్న అంబులెన్స్, లేదా గదిలో బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం వాహనంలో ఉన్నది పోలీసు సిబ్బంది అని, బయటకు వచ్చిన వారిని బయపెట్టడం కోసం ఈ వీడియో రూపొందించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment