న్యూఢిల్లీ: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్తో ఆదివారం సమావేశమయ్యారు. విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీల విషయంలో ఏర్పడిన వివాదాన్ని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ శాఖలో విభజన చట్టం ప్రకారమే వ్యవహరించారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కేంద్ర మంత్రులకు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం 1250 మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను రిలీవ్ చేయగా, కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఏపీ సర్కార్కు ఆర్థిక ఇబ్బందులు వస్తాయనే వీరిని తీసుకోలేదని టీ విద్యుత్ ఉద్యోగులు కేంద్రమంత్రులకు తెలిపారు. ఏపీలో ఉన్న 400 మంది తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయడంలో జాప్యం చేస్తున్నారని చెప్పారు.
రాజ్నాథ్, గోయల్తో టీ విద్యుత్ ఉద్యోగుల భేటీ
Published Sun, Jul 5 2015 5:21 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM
Advertisement