అప్పుడు.. ఇప్పుడు.. సముద్ర మార్గమే
భారత్లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ నుంచి పోర్బందరు తీరానికి సమీపానికి వచ్చిన ఉగ్రవాదుల నౌకను కోస్ట్ గార్డు సిబ్బంది గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భారత కోస్ట్ గార్డు వెంటాడటంతో నౌకలో ఉన్న ఉగ్రవాదులు తమకు తామే పేల్చుకున్నారు. ఇప్పుడు, 2008లోనూ ఉగ్రవాదులు భారత్పై దాడి చేసేందుకు సముద్ర మార్గాన్నే ఎంచుకోవడం గమనార్హం.
2008లో భారత వాణిజ్య రాజధాని ముంబై ఉగ్రవాద దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కూడా పాకిస్థాన్ నుంచి సముద్రం మార్గంలోనే వచ్చారు. ఉగ్రవాదులు చిన్న బోట్ల ద్వారా ముంబై వచ్చారు. ఈ ఏడాది నవంబర్ 26న ముంబైలో మారణహోమం సృష్టించారు. ఉగ్రవాద దాడిలో 58 మంది మరణించగా, మరో 104 మంది గాయపడ్డారు. ఈ దాడిలో 8 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. భారత కమెండో ఆపరేషనల్లో ఉగ్రవాదులను హతమార్చారు. కాగా కసబ్ అనే ఉగ్రవాదిని మాత్రం సజీవంగా బంధించారు. తీర ప్రాంతంలో సరైన నిఘా లేకపోవడం వల్లే దాడి జరిగినట్టు అప్పట్లో విమర్శలు వచ్చాయి. తాజాగా ఉగ్రవాదులు సముద్ర మార్గాన భారత్లో చొరబడేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. కాగా కోస్ట్ గార్డు సిబ్బంది అప్రమత్తంగా ఉండటంగో పెను విపత్తు తప్పింది.