స్కూళ్లు, జనావాసాలే 'వారి' లక్ష్యం! | Terrorists may attack schools, highways during Obama visit: Army official | Sakshi
Sakshi News home page

స్కూళ్లు, జనావాసాలే 'వారి' లక్ష్యం!

Published Thu, Jan 15 2015 12:44 PM | Last Updated on Sat, Aug 11 2018 8:07 PM

స్కూళ్లు, జనావాసాలే 'వారి' లక్ష్యం! - Sakshi

స్కూళ్లు, జనావాసాలే 'వారి' లక్ష్యం!

న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఉగ్రవాదులు..భారత్లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని లెప్ట్నెంట్ జనరల్ కెహెచ్ సింగ్ తెలిపారు. సుమారు 200మంది ఉగ్రవాదులు భారత్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించారని ఆయన అన్నారు.  అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన  దృష్ట్యా ఉగ్రవాదులు దాడులు చేయవచ్చనే సమాచారం ఉందని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు.

 పాఠశాలలు, జనావాసాలే లక్ష్యంగా ఉగ్రవాద మూకలు దాడులు చేయవచ్చని కెహెచ్ సింగ్ హెచ్చరించారు. భారత సైన్యం అప్రమత్తంగా ఉందని ఆయన తెలిపారు. దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉందని కెహెచ్ సింగ్ పేర్కొన్నారు. కాగా గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్య అతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement