అస్గర్ అలీ వయసు 103. ఆయన తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాడు.
కోల్‌కతా: అస్గర్ అలీ వయసు 103. ఆయన తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాడు. మే 5న జరిగే బెంగాల్ చివరి దశ ఎన్నికల్లో అస్గర్ ఓటు వేయబోతున్నాడు. ఆయన కూచ్ బెహార్ జిల్లాలోని దిన్హంత నియోజకవర్గానికి చెందిన మధ్య మశల్‌దంగ ప్రాంత నివాసి. ఇది ఇంతకు పూర్వం బంగ్లాదేశ్ అధీనంలో ఉండేది. 5 నియోజక వర్గాల్లోని 38 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 9776 మంది బంగ్లా నుంచి బదిలీ అయిన పౌరులు ఈ దశలో ఓటు వేయనున్నారు.