కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సుల రూపంలో చట్టాలు తేవటంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారిగా స్పందిస్తూ.. ఆ విధానాన్ని సమర్థించుకున్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సుల రూపంలో చట్టాలు తేవటంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారిగా స్పందిస్తూ.. ఆ విధానాన్ని సమర్థించుకున్నారు. భూమిపైనా, ఈ-రిక్షాలపైనా తెచ్చిన కొత్త చట్టాలు గ్రామీణులకు, పేదలకు ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు.
మంగళవారం ఢిల్లీలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆర్డినెన్సులు తేవటం పట్ల మమ్మల్ని కొందరు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు రాత్రీ పగలూ కేకలు పెడుతున్నారు. పేద గ్రామీణులకు ఇల్లు ఉండకూడదా? చెప్పండి? ఢిల్లీ చుట్టూ చాలా గ్రామాలు ఉన్నాయి. వారికి రోడ్లు, ఆస్పత్రులు, యువతకు ఉద్యోగాలిచ్చేందుకు పరిశ్రమలు వారికి అవసరం లేదా? అందుకే మేం ఆర్డినెన్స్ తెచ్చాం’’ అని మోదీ చెప్పారు.