సోదరి వారసత్వ ఆస్తిపై హక్కులేదు | The Supreme Court judgment on heritage property | Sakshi
Sakshi News home page

సోదరి వారసత్వ ఆస్తిపై హక్కులేదు

Published Mon, Feb 13 2017 12:54 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

సోదరి వారసత్వ ఆస్తిపై హక్కులేదు - Sakshi

సోదరి వారసత్వ ఆస్తిపై హక్కులేదు

సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ: వివాహిత సోదరికి భర్త నుంచి వచ్చిన వారసత్వ ఆస్తిపై ఆమె సోదరుడికి ఎటువంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ మత వారసత్వ చట్టంలోని  ఓ నిబంధనను సుప్రీం కోర్టు పరిగణనలోనికి తీసుకుని ఈ తీర్పును వెలువరించింది.

మామ, లేదా భర్త నుంచి సదరు మహిళకు సంక్రమించిన వారసత్వ ఆస్తిపై ఆ మహిళ మరణానంతరం ఆమె సోదరుడికి ఎటువంటి హక్కులు ఉండవని సెక్షన్  15లో చాలా స్పష్టంగా పేర్కొన్నట్లు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌. భానుమతిలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిం చింది. ఉత్తరాఖండ్‌ డెహ్రడూన్ కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్ ను విచారించిన ఆ రాష్ట్ర హైకోర్టు... సోదరి వారసత్వ ఆస్తిపై ఎటువంటి హక్కు ఉండదని తీర్పు నిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement