
మమ్ముల్ని చంపుతామని బెదిరిస్తున్నారు!
కొత్త సంవత్సరం ఆరంభంలోఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపిన లైంగిక వేధింపుల కేసులో మరో కోణం వెలుగుచూసింది.
మోరాబాద్(యూపీ): కొత్త సంవత్సరం ఆరంభంలోఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపిన లైంగిక వేధింపుల కేసులో మరో కోణం వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి తన కుమారుడ్ని కిడ్నాప్ చేయడమే కాకుండా, తమ కుటుంబాన్ని కూడా చంపుతామని బెదిరస్తున్నారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు.
జనవరి 1వ తేదీన సమాజ్ వాదీ పార్టీకి చెందిన కార్యకర్త కొడుకు 19 ఏళ్ల యువతిని లైంగికంగా వేధించడమే కాకుండా, యాసిడ్ తో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. 'నా 10 ఏళ్ల కొడుకును కిడ్నాప్ చేశారు. మమ్ముల్ని కూడా చంపుతామని బెదిరస్తున్నారు'అని పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశాడు.
మోరదాబాద్ లో న్యాయవాదిగా పనిచేస్తున్న మని బిషోని అతని ఇంటికి వెళ్లిన ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కేసును విత్ డ్రా చేసుకోవాలం టూ వేధిస్తున్నారని ఆ కుటుంబం మరోసారి పోలీసుల్ని ఆశ్రయించింది. ఇందులో భాగంగా వారు ఆదివారం ఓ పోలీస్ ఉన్నతాధికారిని కలిసి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.