ఈ బడ్జెట్ విప్లవాత్మకమైనది
ఈ బడ్జెట్ విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన బడ్జెట్ అని.. రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు. దేశ చరిత్రలో తొలిసారిగా రోడ్లు, హైవేల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్న రోడ్డు రంగాన్ని ప్రభుత్వం పునరుద్ధరించగలిగిందని.. రానున్న నెలల్లో ఇది చాలా వేగవంతం కానుందని చెప్పారు. బడ్జెట్ ప్రకటనల ద్వారా.. యువతకు ఉపాధి కల్పన జరుగుతుందని, బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతమున్న 7 కోట్ల నుంచి 15 కోట్లకు పెరుగుతుందన్నారు. కేవలం 10 వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణ పనుల ద్వారా నాలుగు కోట్ల పని దినాల సృష్టి జరుగుతుందని చెప్పారు.