చాలా చట్టాల్లో ఏకరూప పౌర స్మృతి ఉందని, అయితే మతంతో దానికి సంబంధం లేదని న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ బి.ఎస్.చౌహాన్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసే అంశంపై వాడివేడిగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. చాలా చట్టాల్లో ఏకరూప పౌర స్మృతి ఉందని, అయితే మతంతో దానికి సంబంధం లేదని న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ బి.ఎస్.చౌహాన్ పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతి అమలు అంశాన్ని పరిశీలించాలని మోదీ సర్కారు ఇటీవల న్యాయ కమిషన్‌కు సూచించింది.
జస్టిస్ చౌహాన్ దీనిపై స్పందిస్తూ.. ‘ఐపీసీ, సీఆర్‌పీసీ, సాక్ష్యాల చట్టం, యూపీ జమీందారీ రద్దు వంటి చాలాచట్టాలు మతంతో నిమిత్తం లేకుండా అందరికీ ఒకేలా వర్తిస్తాయి. వీటిని ఏళ్ల తరబడి అమలు చేస్తున్నా ఎవరూ అభ్యంతరం చెప్పలేద’న్నారు.