త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచింది.
అగర్తలా: త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచింది. కేంద్ర 6వ పే కమిషన్ సిఫారసు ప్రకారం జీతాలను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ వెల్లడించారు. ఫలితంగా సుమారు లక్షా అరవై వేలమంది లబ్ధి పొందనున్నారని సమాచారం. రాష్ట్రం తీవ్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.