న్యూఢిల్లీ: హెచ్–4 వీసాలు కలిగిన వారికి ఉద్యోగానుమతులు రద్దు చేయకుండా అమెరికా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని సుష్మ చెప్పారు. ప్రస్తుతం హెచ్–4 వీసాలపై దాదాపు 65 వేల మంది భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. హెచ్–4 వీసాలకు ఉద్యోగానుమతులను రద్దు చేసేందుకు అమెరికా కసరత్తు చేస్తోంది. భారత్‌లో జైళ్ల పరిస్థితిని పరిశీలిస్తామని ఓ బ్రిటన్ కోర్టు వ్యాఖ్యానించడంపై ప్రధాని మోదీ తన అసంతృప్తిని బ్రిటన్ ప్రధాని థెరెసాకు నేరుగానే తెలియజేశారని సుష్మ చెప్పారు. కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌లో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై లండన్‌లో ఓ కేసు విచారణ జరిగింది. ఆ సమయంలో మాల్యా లాయరు తన వాదన వినిపిస్తూ, భారత్‌లో కిక్కిరిసిన జైళ్లలో అపరిశుభ్రత, వేధింపులు ఉంటాయని కోర్టుకు తెలిపారు. దీంతో భారత్‌లోని జైళ్లను తాము పరిశీలిస్తామని అప్పట్లో కోర్టు వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment