అజయ్‌ ప్రవర్తనపై మండిపడిన నెటిజన్లు | Twitter Users Slam Hum Hindu Founder Ajay Gautam For Closing Eyes On Seeing Muslim Anchor On TV | Sakshi
Sakshi News home page

అజయ్‌ ప్రవర్తనపై మండిపడిన నెటిజన్లు

Published Sat, Aug 3 2019 2:18 PM | Last Updated on Sat, Aug 3 2019 2:34 PM

Twitter Users Slam Hum Hindu Founder Ajay Gautam For Closing Eyes On Seeing Muslim Anchor On TV - Sakshi

న్యూఢిల్లీ : 'హమ్‌ హిందూ' వ్యవస్థాపకుడు అజయ్‌గౌతమ్‌ ముస్లిం యాంకర్‌ను చూడలేనంటూ ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ట్విటర్‌ వేదికగా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇటీవల జొమాటో ఫుడ్‌ డెలివరీ విషయమై తలెత్తిన వివాదంపై చర్చించేందుకు అజయ్‌ గౌతమ్‌ను ఒక న్యూస్‌ చానెల్‌ ఆహ్వానించింది. చర్చల సందర్భంగా న్యూస్‌ యాంకర్‌ ఖలీద్‌ను చూడగానే కావాలనే తన చేతులను ముఖానికి అడ్డుపెట్టుకోవడం టీవీలో స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న న్యూస్‌ ఎడిటర్‌ అనురాధప్రసాద్‌ అతని చర్యలతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంకెప్పుడు అజయ్‌ను ఏ చర్చలకు తమ చానెల్‌కు పిలవదని స్పష్టంచేశారు. కాగా, ముస్లిం రాజకీయాలకు వ్యతిరేకంగా సంపూర్ణ హిందూ రాష్ట్రాన్ని సాధించే లక్ష్యంతో  అజయ్‌ గౌతమ్‌ 2015లో 'హమ్‌ హిందూ' ఆర్గనైజేషన్‌ను స్థాపించాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement