5, 8వ తరగతులకు డిటెన్షన్‌ | Two chances to pass for 5th to 8th graders | Sakshi
Sakshi News home page

5, 8వ తరగతులకు డిటెన్షన్‌

Published Sun, Jul 23 2017 2:11 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

5, 8వ తరగతులకు డిటెన్షన్‌ - Sakshi

5, 8వ తరగతులకు డిటెన్షన్‌

కోల్‌కతా: పాఠశాలల్లో 5వ, 8వ తరగతుల విద్యార్థులకు త్వరలో రాష్ట్రాల సాయంతో డిటెన్షన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ‘ప్రతిపాదిత బిల్లు ఏటా మార్చి నెలలో ఈ తరగతుల వారికి పరీక్షలు నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకు అందిస్తుంది.

విద్యార్థులు మార్చి పరీక్షల్లో ఫెయిలైతే మే నెలలో వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ యత్నంలోనూ ఉత్తీర్ణులు కాకపోతే వారిని పైతరగతులకు వెళ్లనివ్వకుండా ఆ తరగతుల్లోనే ఉంచుతారు’ అని ఆయన శనివారమిక్కడ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల విద్యామంత్రులతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నామని, 25 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement