ఇద్దరు మావోయిస్టులు మృతి?
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కుంట బ్లాక్‌లో ఉన్న కిష్టారం పోలీస్‌స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని దండకారణ్యంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ధర్మపేట బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద మావోలు అమర్చిన ఫ్రెషర్‌బాంబు పేలి ఒక ఆర్మ్‌డ్ కానిస్టేబుల్ మూడు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. మావోల కోసం ఛత్తీస్‌గఢ్ పోలీసులు శుక్రవారం పోలీస్ బలగాలను రంగంలోకి దింపారు.
తాజాగా వారు కూంబింగ్‌లో భాగంగా దండకారణ్యం చేరుకోగా మావోయిస్టులు తారసపడినట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీస్‌వర్గాలు పేర్కొన్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రదేశంలో యూనిఫాంలో ఉన్న మావోయిస్టుల మృతదేహం లభించిందని, మరో మావోయిస్టు మృతదేహాన్ని దళ సభ్యులు తీసుకెళ్లారని తెలుస్తోంది.
కిష్టారం అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు
Published Sun, Apr 24 2016 5:00 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement