వ్యాపమ్‌లో స్కాంలో మరో ఆత్మహత్య | Vyapam accused Praveen Yadav commits suicide in MP | Sakshi
Sakshi News home page

వ్యాపమ్‌లో స్కాంలో మరో ఆత్మహత్య

Published Wed, Jul 26 2017 10:58 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

వ్యాపమ్‌లో స్కాంలో మరో ఆత్మహత్య - Sakshi

వ్యాపమ్‌లో స్కాంలో మరో ఆత్మహత్య

మోరినా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపమ్‌ కుంభకోణంలో మరో ఆత్మహత్య చోటు చేసుకుంది. కేసులో నిందితుల జాబితాలో ఉన్న ప్రవీన్ యాదవ్‌ మోరినాలోని తన నివాసంలో బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు(ఎమ్‌పీపీఈబీ) నిర్వహించే పరీక్షలో అక్రమాలకు పాల్పడటంతో వ్యాపమ్‌ స్కాం వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో విజయం సాధించి జాబ్‌ సంపాదించేందుకు పలువురు విద్యార్థుల నుంచి దాదాపు రూ.2 వేల కోట్ల రూపాయలు అధికారులకు చేరాయి. గడిచిన పదేళ్లుగా ఈ కేసులో ఏదో ఒక కొత్త మలుపు తిరుగుతూనే ఉంది.

కేసులో నిందితులు ఆత్మహత్య చేసుకోవడమో లేదా విద్యార్థులకు సాయం చేసిన వ్యక్తులు హత్యకు గురికావడం వంటివి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement