ముంబై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా పరిపుష్టంగా(వెల్దీ) ఉన్న మహిళకు భర్తనుండి మనోవర్తిని గానీ, భరణాన్నిగానీ కోరే హక్కులేదని ముంబై హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది
ముంబై : ముంబై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో (వెల్దీ) ఉన్న మహిళకు భర్త నుండి మనోవర్తిని గానీ, భరణాన్నిగానీ కోరే హక్కు లేదని ముంబై హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. తనను తాను పోషించుకోగల ఆర్థిక స్థోమత ఉన్న మహిళలకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
నారిమన్ పాయింట్ ఏరియాకు చెందిన మహిళకు ఫ్యామిలీ కోర్టు గతంలో భరణాన్ని మంజూరు చేసింది. అయితే కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ముంబై హైకోర్టు తీర్పుపై మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.