'సీక్రెట్ ఓటింగ్తో మోదీ బండారం తెలుస్తుంది'
'సీక్రెట్ ఓటింగ్తో మోదీ బండారం తెలుస్తుంది'
Published Thu, Nov 17 2016 2:28 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
ఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంతో బీజేపీ నేతలు కూడా సంతోషంగా లేరని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ విషయంలో సీక్రెట్ ఓటింగ్ పెడితే మోదీ బండారం బయటపడుతుందని అన్నారు. గురువారం ఆజాద్పూర్లో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఆమె ర్యాలీలో పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని మమతా బెనర్జీ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.
నోట్ల రద్దుతో వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయని, నిత్యావసరాల రవాణా నిలిచిపోయిందని మమతా బెనర్జి అన్నారు. ఎమర్జెన్సీ సమయంలోనూ ఇలాంటి పరిస్థితి రాలేదని.. అచ్చేదిన్ అంటే ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిందని.. నోట్ల రద్దుతో సామాన్యులే ఇబ్బంది పడుతున్నారన్నారు. 'పేదలు ఏం తినాలి.. దమ్ముంటే నల్లధనబాబులను జైల్లో పెట్టండి' అంటూ ఆమె ఆక్రోశం వెల్లగక్కారు.
Advertisement
Advertisement