
'భూసేకరణ చట్ట సవరణకు పూర్తి మద్దతు'
భూసేకరణ సంపూర్ణ చట్ట సవరణ బిల్లుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. దాంతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న అంశంపై సభలో చర్చకు పట్టుబడతామన్నారు. పార్లమెంటు లోపల, బయట ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇంకా అనేక అంశాలు అమలు కాలేదని, ఇప్పటికి రాష్ట్రం విడిపోయి 14 నెలలు కావస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని అన్నారు. ఇలా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.