
పెట్రోల్ బంకుల్లోనూ నగదు విత్‌డ్రా
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూల సమస్యను అధిగమించేందుకు పెట్రోల్ బంకుల్లో కూడా నగదు విత్‌డ్రాకు కేంద్రం అనుమతిం చింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,500 పెట్రోల్ బంకుల్లో డెబిట్/క్రెడిట్ కార్డు స్వైప్ చేయడం ద్వారా రోజుకు రూ.2 వేలు విత్‌డ్రా చేయవచ్చు.
ఎస్బీఐకి చెందిన పీఓఎస్(పారుుంట్ ఆఫ్ సేల్) మెషీన్లను ఇప్పటికే ఆయా పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉంచామని, ఒక వ్యక్తి రూ. 2 వేల వరకూ నగదు పొందవచ్చని ఒక ప్రకటనలో కేంద్రం తెలిపింది. మూడ్రోజుల అనంతరం మరో 20 వేల పెట్రోల్ బంకులకు ఈ అవకాశం విస్తరించనున్నారు.