
ఖాతాలోకి రూ. 99,99,99,394
ఘజియాబాద్: తనకు తెలియకుండానే తన జన్‌ధన్∙ఖాతాలోకి వంద కోట్ల రూపాయలు వచ్చి చేరాయంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఘజియాబాద్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసే మహిళ కొన్ని రోజుల క్రితం కొంత నగదును విత్‌డ్రా చేసేందుకు స్థానిక ఏటీఎంకు వెళ్లింది.
అక్కడ తన ఖాతాలో రూ. 99,99,99,394 ఉండటం చూసి ఆశ్చ్యర్యానికి గురై.. పక్కన నిల్చున్న వ్యక్తిని అడిగి మరోసారి రూఢీ చేసుకుంది. మరో రెండు ఏటీఎంలలోనూ బ్యాలన్స్‌ను చెక్ చేసింది. చివరకు ఈ విషయాన్ని తన భర్తకు తెలిపింది. అనంతరం ఖాతా ఉన్న బ్యాంక్ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. వారు పట్టించుకోకపోవడంతో తన భర్త సాయంతో పీఎంఓకు ఫిర్యాదు చేసింది.