
భోపాల్: ఆ మహిళకు ఒకే కాన్పులో ఏకంగా ఆరుగురు శిశువులు జన్మించారు. మధ్యప్రదేశ్‌లోని షివోపూర్ జిల్లాకు చెందిన మూర్తి మాలే (22) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ప్రసవించారు. ఆమెకు మొత్తం ఆరుగురు శిశువులు..నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. తక్కువ బరువు కారణంగా ఇద్దరు అమ్మాయిలు పుట్టిన కాసేపటికే మరణించారు. మిగతా వారికి ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు. ఆరుగురు శిశువుల మొత్తం బరువు కేవలం 3.65 కేజీలు. (చదవండి: పౌరసత్వం ఇచ్చి తీరుతాం..)
Comments
Please login to add a commentAdd a comment