మిలటరీ పోలీసులుగా మహిళలు
ఆమోదం తెలిపిన రక్షణశాఖ
న్యూఢిల్లీ: భారత సైన్యంలోకి మరింత మంది మహిళలు చేరేందుకు వీలుగా రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో పోలీసులుగా మహిళలను చేర్చుకోవాలన్న ప్రతిపాదనకు శుక్రవారం ఆమోదం తెలిపింది. ఏడాదికి 52 మంది చొప్పున దాదాపు 800 మంది మహిళల్ని సైన్యంలో పోలీసులుగా నియమించనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ అశ్వనీ కుమార్ మీడియాకు తెలిపారు.
సైన్యంలో లింగభేదాలు తొలగించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందన్నారు. సైన్యంలో పోలీసులుగా మహిళలు ఉండడం వల్ల లైంగిక దాడి ఆరోపణలపై విచారణను సత్వరంగా పూర్తిచేసే వీలుంది. ఆర్మీలో పోలీసులుగా చేరిన మహిళల్లో కొందరిని కశ్మీర్ లోయకు కేటాయిస్తామన్నారు. స్థానిక మహిళలను తనిఖీ చేయడం సహా పలు విధులను వీరు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.