మైనర్ బాలికపై అత్యాచారం, హత్య; నిందితుడికి ఉరిశిక్ష | Youth gets death penalty for raping, murdering minor | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికపై అత్యాచారం, హత్య; నిందితుడికి ఉరిశిక్ష

Published Fri, Nov 22 2013 4:36 PM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM

Youth gets death penalty for raping, murdering minor

మైనర్ బాలికను కిరాతకంగా అత్యాచారం చేసి, హత్యచేసిన కేసులో భరత్ కుమార్ (23) అనే యువకుడికి ఉరిశిక్ష పడింది. ఢిల్లీ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇలాంటి వ్యక్తులు సమాజానికి హానికరమని, సంఘంలో జీవించడానికి అనర్హులని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దోషి మరణించే వరకు ఉరితీయాలని అడిషనల్ సెషన్స్ జడ్జి వీరేంద్ర భట్ ఆదేశించారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2010 సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. భరత్ తన ఇంటి పక్కన నివసించే బాలికకు (అప్పటికి 7-11 ఏళ్ల మధ్య వయసు) స్నాక్స్, చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపాడు. అనంతరం ఢిల్లీకి దగ్గరలోని పాలెం గ్రామం సమీపంలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. కర్కశంగా ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ముఖం, శరీరంపై తీవ్రంగా గాయపరిచాడు. విషయం వెలుగులోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని అక్కడే చంపేసి వెళ్లిపోయాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు భరత్ నేరం చేసినట్టు రుజువు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement