
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడోసారి అవిశ్వాస తీర్మానంపై ( నోటీసులు ఇచ్చింది. సభా సమావేశాలు వాయిదా అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు ఏడోసారి నోటీసులు అందచేశారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు మాట్లాడుతూ.... అవిశ్వాసంపై ఈ నెల 27న చర్చకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రత్యేక హోదాపై చర్చ జరిగే వరకూ తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సభలో చర్చ జరిగే వరకూ నోటీసులు ఇస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇంతకు ముందు ఆరుసార్లు ఇచ్చిన నోటీసులపై సభలో చర్చ జరగని సందర్భంగా మళ్లీ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.