
సభావట్ మోహన్, భూక్యా అశోక్
శంషాబాద్ రంగారెడ్డి : బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన ఇద్దరు నిజామాబాద్ జిల్లావాసులు ఆదివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. 2015లో ఓ ఏజెంట్‌కు రూ. 80 వేల చొప్పున చెల్లించి నిజామాబాద్ జిల్లా పాకాల గ్రామానికి చెందిన సభావట్ మోహన్, భూక్యా అశోక్ యూఏఈ వెళ్లారు. ఏజెంట్ చెప్పిన విధంగా అక్కడ పనిలేకపోవడంతో పాటు వీరి వద్ద ఉన్న పాస్‌పోర్టులను ఓ కంపెనీ యజమాని తీసుకున్నాడు. దీంతో అక్కడే వేర్వేరు చోట్ల ఇంతకాలం పనిచేస్తూ గడిపారు.
స్వదేశానికి చేరుకునేందుకు నానాకష్టలు ఎదుర్కొన్న వీరికి అక్కడి తెలుగు సేవాసమితితో పాటు తెలంగాణలోని ఎన్‌ఆర్‌ఐ స్వచ్ఛంద సంస్థలకు చెందిన గంగిరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు సాయం చేశారు. యూఏఈ ప్రభుత్వం వీరు స్వదేశం వెళ్లేందుకు అనుమతినిచ్చింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో విమాన టికెట్లు పొందిన బాధితులు ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment