పోలీస్ సిబ్బందికి నాట్స్ భోజన సదుపాయం  | NATS Dining Facility For Irving Police Personnel Who Fight For Coronavirus | Sakshi
Sakshi News home page

పోలీస్ సిబ్బందికి నాట్స్ భోజన సదుపాయం 

Jun 4 2020 3:42 PM | Updated on Jun 4 2020 3:42 PM

NATS Dining Facility For Irving Police Personnel Who Fight For Coronavirus - Sakshi

ఇర్వింగ్ : అమెరికాలో కరోనాపై ముందుండి పోరాడుతున్న వారిని ప్రోత్సాహించేందుకు.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం ఇర్వింగ్ పోలీస్ సిబ్బందికి భోజనం ఏర్పాటు చేసింది. నాట్స్ ఉపాధ్యక్షుడు బాపు నూతి చొరవతో స్థానికంగా ఉండే 50 మంది పోలీస్ సిబ్బందికి ఈ మధ్యాహ్నభోజనానికి ఏర్పాట్లు చేసింది. నాట్స్ సభ్యులే స్వయంగా వెళ్లి.. సిద్ధం చేసిన ఆహారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అందించారు. నాట్స్ కాఫీ విత్ కాప్ మరియు నాట్స్ గాంధీ జయంతి వంటి కార్యక్రమాల అనుమతి కోసం గత పదేళ్లుగా స్థానిక పోలీస్ అధికారి జాన్ మిచేల్‌తో బాపు నూతి సంప్రదింపులు జరుపుతూ ఉండేవారు.

ఈ అనుబంధంతో నాట్స్ విందును పోలీస్ అధికారులు అనుమతించడం జరిగింది. పోలీస్ సిబ్బందిని ప్రోత్సాహించేందుకు నాట్స్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని జాన్ మిచేల్ అన్నారు. నాట్స్ టీంను ఆయన ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకులు రాజేంద్ర మాదల, జ్యోతి వనం, కవిత దొడ్డ, శ్రీనివాస్ పాటిబండ్ల, మిలింద్, యూత్ వాలంటీర్లు వరిశ్, ప్రణవి తదితరులు పాల్గొన్నారు. కరోనా  పై పోరాడే ఫ్రంట్ లైన్ వర్కర్లను ప్రోత్సాహించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement