ప్రతీకాత్మక చిత్రం
అబుదాబి : కరోనా లాక్‌డౌన్ కారణంగా దుబాయ్‌లో ఇరుక్కుపోయిన తెలంగాణ వాసులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. వలస కార్మికులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఒకే భవనంలో దాదాపు 80 మంది కార్మికులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావటంతో స్థానిక అధికారులు వారందరినీ ఓ రూములో నిర్బంధించారు. అయితే రోగులకు సరైన వైద్యం అందించడం లేదని వారు చెబుతున్నారు.
పాజిటివ్ వచ్చిన వారితో కలిసి మిగిలిన వారందరూ ఒకే భవనంలో ఉండడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తామందరికి కరోనా టెస్టులు చేసి వైద్య సదుపాయాలు అందించాలని కోరుతున్నారు. తాము పనిచేస్తున్న సెల్ఫ్ బెహస కంపెనీ తమ ఆరోగ్యాలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment