‘హోదా’ పోరు.. ఆగదు సత్యం | Andhra develop with special status only | Sakshi
Sakshi News home page

‘హోదా’ పోరు.. ఆగదు సత్యం

Published Wed, Sep 23 2015 2:04 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

‘హోదా’ పోరు.. ఆగదు సత్యం - Sakshi

‘హోదా’ పోరు.. ఆగదు సత్యం

రాష్ట్రం సమతుల్యతతో అభివృద్ధి చెందడం ప్రత్యేక హోదాతోనే సాధ్యం. రాజ్యాంగబద్ధమైన హక్కులుగా హోదా, ప్రత్యేక ప్యాకేజీల విధివిధానాలు నిర్దేశితం కావాలి. అవి నేరుగా జిల్లాలకే అందేటట్లు కార్యాచరణ సాగాలి. ప్రత్యేక హోదా ప్రత్యేకించి కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు గొప్ప వరం. ఈ అంశం పట్ల చంద్రబాబు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం క్షంతవ్యం కానిది. బిహార్‌కు లక్షా ఇరవై ఐదు వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి లేని అడ్డంకులు ఏపీ ప్రత్యేక హోదాపైనే ఎందుకు వస్తున్నాయి?  వెంకయ్యనాయుడు, మోదీ, చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాజకీయ కారణాలతో ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన కాం గ్రెస్, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు తత్పర్యవసానంగా తెలుగు ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సి వచ్చేసరికి పలాయన మంత్రం పఠి స్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాను, ఏడు వెనుకబడిన జిల్లాలకు (రాయల సీమలో నాలుగు, ఉత్తరాంధ్రలో మూడు) ప్రత్యేక ప్యాకేజీని, జాతీయ ప్రాజె క్టుగా పోలవరం పరిపూర్తికి పార్లమెంటు సాక్షిగా అవి హామీ ఇచ్చాయి.
 
 కాంగ్రెస్ ప్రభుత్వం, విభజన చట్టంలో ప్రత్యేక హోదాను నమోదు చేయలేదని, అదే నేడు ప్రత్యేక హోదాను ప్రకటించడానికి కేంద్రానికి ప్రధాన అడ్డంకిగా మారిందని బీజేపీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దబాయిస్తున్నారు. ఆయనే స్వయంగా నాటి బీజీపీ ప్రధాని అభ్యర్థి, నేటి ప్రధాని నరేంద్ర మోదీతో కలసి తిరుపతి తదితర ఎన్నికల సభల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి పది సంవత్సరాల ప్రత్యేక హోదాను ఇచ్చి అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేశారు. నేడు కాంగ్రెస్‌పై నెపం నెట్టేస్తూ వెంకయ్య నాయుడు తెలు గు ప్రజలను వంచించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ రెండు కేంద్ర బడ్జెట్ గడి చినా పోలవరానికి కనీసం రూ.400 కోట్లయినా కేటాయించని కేంద్రం తీరుకు అర్థం ఏమిటి? ప్రత్యేక ప్యాకేజీకి జిల్లాలు ఏడికి నామమాత్రంగా రూ.350 కోట్లు దులపరించడంలోని అంతరార్థం ఏమిటి? ఏపీ ప్రజల ఇక్కట్లపై కేం ద్రం, వెంకయ్య నాయుడు కారుస్తున్నవి మొసలికన్నీళ్లనే కదా!
 
 ‘హైదరాబాద్’ గుణపాఠం మరిచారా?
 గత ఎన్నికల్లో వీరంతా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైతుల, డ్వాక్రా మహిళల, నేతన్నల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతివంటి వాగ్దానాలను గుప్పించారు. వాగ్దానాలను అమలు పరచకపోవడం చంద్రబాబు నైజం అనుకున్నా... కేంద్రం కూడా అదే చేస్తోందెందుకు? నేడు రాష్ట్ర పరిస్థితి అత్యంత ఆందోళన కరంగా ఉంది. బడ్జెట్ లోటు భర్తీకి రూ.22,112 కోట్లు, రాజధానికి రూ.15, 175 కోట్లు, వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి రూ.7 వేల కోట్లు, విశాఖ, విజయవాడ, భోగాపురం విమానాశ్రయాలకు రూ.16,000 కోట్లు, వీటికి తోడు కడప స్టీల్ ఫ్యాక్టరీకి చేయాల్సిన సహాయాన్ని కలుపుకుంటే దాదాపు రూ.2 లక్షల కోట్లు కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌ను హఠాత్తుగా కోల్పోవడంతో నేటి ఏపీ ఆర్థిక స్వావలంబనను కోల్పోయింది. మొత్తంగా అభివృద్ధి అంతా ఒక్క హైద రాబాద్ చుట్టూనే కేంద్రీకరించడం వల్ల కలిగిన నష్టం ఎంత తీవ్రమైనదో నేడు మనకు తెలిసివస్తోంది.
 
అడ్డగోలు విభజన దుష్ఫలితాల భారాన్ని 13 జిల్లాల తెలుగు ప్రజలు మోయాల్సివస్తోంది. ఆ చేదు అనుభవం నుంచి ముఖ్య మంత్రి చంద్రబాబు గుణపాఠాలు ఏమీ నేర్చుకోలేదు. మళ్లీ అభివృద్ధినంత టినీ రాజధాని ప్రాంతంలోనే కేంద్రీకరిస్తున్నారు, అది కూడా కృష్ణా, గుం టూరు జిల్లాల్లోని బంగారం పండే లక్ష ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ, సమీకరణల పేరిట లాక్కుని మరీ రాజధానిని నిర్మించడానికి నడుం బిగిం చారు. రాజధాని అంటే పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించుకునే పట్టణం. అందుకోసం ఉత్తరాంధ్ర, రాయలసీమలను నిర్లక్ష్యం చేసి, అభివృద్ధినంతటినీ కేవలం రెండు జిల్లాలకు పరిమితం చేయాలనుకోవడం ముందు ముందు అనర్థదాయక పరిణామాలకు దారితీసేది.
 
 ‘హోదా’తోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి
 రాష్ట్రం సమతుల్యతతో అభివృద్ధి చెందడం హోదాతోనే సాధ్యం. రాజ్యాంగ బద్ధమైన హక్కులుగా ఆ హోదా, ప్రత్యేక ప్యాకేజీల విధివిధానాలు నిర్దేశితం కావాలి. అవి నేరుగా జిల్లాలకే అందేటట్లు ఆచరణ సాగాలి. ఉదాహరణకు వెనుకబడిన ఏడు జిల్లాలలో అనంతపురం జిల్లా వైశాల్యం రీత్యా పెద్దది. ఇక్క డ 25 లక్షల ఎకరాలలో వర్షాధారిత వ్యవసాయం సాగుతోంది. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా దాదాపు అదే విస్తీర్ణంలో వ్యవసాయం సాగుతోంది.
 
ఈ రెండు ప్రాంతాలకు జిల్లా ప్రాతిపదికపై నిధులను కేటాయిం చలేం. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మొత్తం సాగు భూమి అనంతపురం జిల్లా సాగు భూమికి సమానం. కాబట్టి అనంతపురం జిల్లాలో, మొత్తంగా రాయలసీమ జిల్లాల్లో సాగునీటి, తాగునీటి సౌకర్యాలు తక్కువగా ఉండి, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు నిరంతర కరువు పీడిత ప్రాంతాలు. వాటికి ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీల అమలు తీరు ఎలా ఉండాలి? ఆ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పథకాలేమిటి? వివరంగా చర్చించాలి. కొనసాగుతున్న సేద్యపు నీటి ప్రాజెక్టులకు కూడా కేంద్ర నిధులు గ్రాంట్ల రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక హోదా ప్రత్యేకించి కరువు పీడిత ప్రాంతాల ప్రజ లకు గొప్ప వరం. ఇంతటి ప్రాముఖ్యతగల అంశం పట్ల చంద్రబాబు ప్రదర్శి స్తున్న నిర్లక్ష్యం క్షంతవ్యం కానిది.
 
 ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014లోని క్లాజు 94(1) రెండు రాష్ట్రాల పరిశ్రమల స్థాపనకు, ఆర్థికాభివృద్ధికి పన్ను మినహాయింపులుసహా తగు ఆర్థిక చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని పేర్కొంది. కాగా, 94(2) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి భౌతిక, సాంఘిక మౌలిక సదుపాయాల కల్పనసహా అవసరమైన ఇతర కార్యక్రమాలను అది చేపడుతుందని స్పష్టం గా కేంద్రం బాధ్యతలను నిర్వచించాయి. కేంద్రం ఆ పనిచేయకపోవడమే కాదు, చంద్రబాబు ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తిలోదకా లిచ్చి మళ్లీ అభివృద్ధి కేంద్రీకరణకు పట్టంగడుతోంది.
 
 పట్టిసీమ ప్రచార ప్రహసనం
 చంద్రబాబు ఆలోచనలన్నీ రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. రాజధాని ఆయనకు ఒక వ్యాపార సంస్థ, తన ఆర్థిక వృద్ధికి ఒక రాజకీయ సోపానం. ఒక్క రాజధాని కోసమే పట్టిసీమ పథకం చేపట్టారు. అది ఎంత లోపభూ యిష్టంగా, ఎంత దిగజారుడుతనంతో సాగిందో కూడా చూశాం. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కేంద్ర నిధుల సాధన కోసం చంద్రబాబు చేసిన కృషి శూన్యం. పైగా పోలవరం నిర్మాణం క్లిష్టమయ్యేలా ఎగువ రాష్ట్రా లతో తగాదాలను కొనితెచ్చే పట్టిసీమను చేపట్టారు.
 
 రియల్ ఎస్టేట్ వ్యాపా రుల చవుకబారు వ్యాపార ప్రచారంలా చంద్రబాబు సింగపూర్‌లో తాను గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించానని చెప్పుకోవడాన్ని మించిన సిగ్గుచేటుతనం మరొకటి లేదు. పైగా కరువు పీడిత ప్రాంతంలోని ఎత్తిపోతల పైపులను హంద్రీ-నీవా నుంచి రాత్రిపూట దొంగతనంగా హడావుడిగా పట్టి సీమకు తరలించడాన్ని మించిన వంచన, కుటిల నీతిని మనం ఎరుగం. ఇదంతా రాయలసీమను ఉద్ధరించడానికేననడం సీమవాసులను మరింత అపహాస్యం చేస్తోంది. అసలు రాష్ట్రవ్యాప్తంగా సమతుల్యతతో కూడిన అభి వృద్ధికే ఆయన విముఖుడనడానికి ఆయన వెనుకబడిన ప్రాంతాల విద్యా ర్థులకు తీవ్ర నష్టం కలిగించేలా జారీ చేసిన 120 జీవోనే నిదర్శనం.
 
 ‘హోదా’కు అడ్డంకి బాబు, కేంద్రాలే
 13 జిల్లాల ప్రజలందరి సంతులిత సర్వతోముఖాభివృద్ధి కూడా రాజ ధాని అభివృద్ధితో పాటూ జరగడమే అత్యంత ముఖ్య అంశం. ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డి గత ఏడాదిన్నరగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న వివిధ ఆందోళనల్లో ఈ సంతులిత అభివృద్ధి, ప్రత్యేకహోదాలే కేంద్రాంశాలు. ప్రత్యే కహోదాపై కేంద్రాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి అది మరచి, పర్సెం టీజీల వేటలో మునిగితేలుతున్నారు. బిహార్‌కు లక్షా 50 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించడానికి లేని అడ్డంకులు ఏపీకి ప్రత్యేక హోదాపైనే ఎం దుకు వస్తున్నాయి? బిహార్ ప్యాకేజికి నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ అను మతులున్నాయా? వెంకయ్యనాయుడు, మోదీ, చంద్రబాబు తెలుగు ప్రజ లకు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో నేడు ప్రత్యేక హోదా కోసం జరు గుతున్న పోరును పోలీసు బలగంతో నిలువరించాలని ప్రయత్నిస్తున్న బాబు ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారు? ప్రత్యేకహోదా కోసం జరగాల్సిన తిరుపతి సభకు అనుమతిని నిరాకరించడం, విశాఖపట్టణంలో నిషేధాజ్ఞలు విధించడం, గుంటూరు సభకు ఇంకా అనుమతి ఇవ్వకపోవడం హోదా ఉద్య మాన్ని  నిరోధించాలని చేస్తున్న కుటిల ప్రయత్నం.
 
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని వెంకయ్యనాయుడు, చంద్రబాబులు నిలువరించలేరు. రాష్ట్ర విభజనలో వంచనకు గురయ్యామని గుర్తించిన తెలుగు ప్రజలు 13 జిల్లాల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు. ఏపీ హక్కు ప్రత్యేక హోదాను నిరాకరిస్తున్న బీజీపీ, తెలుగుదేశాలకు కూడా అటు వంటి గుణపాఠమే చెప్పడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
 వ్యాసకర్త కదలిక సంపాదకులు: 99899 04389
 - ఇమామ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement