పండిట్లకు ‘ప్రణవ’నాదం
సొంతగడ్డ లేని జాతుల ఇక్కట్లు ప్రపంచ చరిత్రలో అత్యంత దయనీయంగా కనిపిస్తాయి. అలాంటి జీవన్మరణ సమస్యే కాశ్మీరీ పండిట్లది కూడా. పాండిత్యాన్నీ, శాంతినీ ప్రేమించే పండిట్ల చరిత్రలో ఏడు బలవంతపు వలసలు కనిపిస్తాయి. అందులో చివరిది-1990 నాటిదే.
పదహారో లోక్‌సభ ఏర్పడిన తరువాత పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. అది కేంద్రంలో తొలిసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి విని పించిన ప్రసంగమే. అందులో కాశ్మీరీ పండిట్ల కోసం కొన్ని నిమిషాలు కేటాయించారు. పూర్తి మెజారిటీ సాధించిన బీజేపీ కాశ్మీర్, పండిట్ల అంశాలను కదపకుండా ఉండడం సాధ్యం కాదు. నరేంద్ర మోడీ మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 370 ఆర్టికల్ మీద దుమారం చెల రేగింది. రాష్ట్రపతి ప్రసంగంలో 5,000 ఏళ్ల నాటి వారి సొంతగడ్డకు వెళ్లి ‘తలెత్తుకుని జీవించేటట్టుగా, రక్షణతో, జీవనోపాధి’తో కాశ్మీరీ పండిట్లు నివసించడానికి కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 370 ఆర్టికల్‌పై ఉన్న వివాదం అందరికీ తెలుసు. కానీ పండిట్ల అంశం వివాదాస్పదమని ఎవరూ వ్యాఖ్యానించరు. అయినా భారత ప్రభుత్వాలు సహా, అంతర్జాతీయ హక్కుల సంఘాలు కూడా ఈ సమస్య మీద మౌనం వహిస్తున్నాయి.
పండిట్లు కాశ్మీర్ లోయకు తిరిగి వెళ్లడానికి బీజేపీ ప్రభు త్వం తన ఐదేళ్ల కాలపరిమితిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రకటించారు. స్వదే శంలో పండిట్లు శరణార్థులుగా బతకడం విషాదమే. కానీ ఈ ఆరు దశాబ్దాల రాజకీయాలు పండిట్లు తమ హక్కులను గుర్తు చేసుకోవడం కూడా సాధ్యం కానంతగా పరిస్థితులను విషతుల్యం చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు సహా కేంద్ర ప్రభుత్వాలూ బాధ్యత వహించాలి.
సొంతగడ్డ లేని జాతుల ఇక్కట్లు ప్రపంచ చరిత్రలో దయనీయంగా కనిపిస్తాయి. అలాంటి జీవన్మరణ సమస్యే కాశ్మీరీ పండిట్లది కూడా. పాండిత్యాన్నీ, శాంతినీ ప్రేమించే పండిట్ల చరిత్రలో ఏడు భారీ వలసలు కనిపిస్తాయి. అందు లో చివరిది-1990 నాటిదే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం తార స్థాయికి చేరిన కాలం అదే. భారత ప్రభుత్వం ఏజెంట్లు అని పేరు పెట్టి, ఒక వర్గాన్ని ముఖ్యంగా పండిట్లను కాశ్మీర్‌లోయ నుంచి ఖాళీ చేయించే పని మొదలుపెట్టారు. అప్పుడే 24, 202 కుటుంబాలు జమ్మూ, ఢిల్లీలలో ఏర్పాటు చేసిన శిబిరా లకు చేరాయి. తరువాత ఈ సంఖ్య 38,119కి చేరింది. ఆరు నుంచి ఏడు లక్షల మంది పండిట్లు నిరాశ్రయులయ్యారని అ ఖిల భారత కాశ్మీరీ సమాజ్ వంటి సంస్థలు చెబుతున్నాయి.
1947లో కాశ్మీర్‌లో డోగ్రా పాలన ముగిసే నాటికి పండి ట్ల జనాభా 14 నుంచి 15 శాతం ఉంది. 1948 అల్లర్లు, 1950 నాటి భూసంస్కరణలతో చాలా జనాభా ఖాళీ అయింది. 1981 నాటి పండిట్ల జనాభా ఐదు శాతమని తేలింది. గృహ దహనాలు, ఊచకోత, మానభంగాల ఫలితమిది. 2010లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 808 పండిట్ల కుటుంబాలు మాత్రమే లోయలో మిగిలాయి.
అక్బర్ కాలంలో పండిట్ హోదా పొందిన వీరంతా, 1948 నుంచి ఇక్కట్లు పడుతున్నా ఏ ప్రభుత్వమూ పట్టించు కోలేదు. ఇది సొంతగడ్డను వీడి రావడం కంటె ఎక్కువగా వారిని బాధిస్తున్నది. ఎప్పుడు కాశ్మీర్ అంశం మీద చర్చలు జరిగినా ఉగ్రవాదుల ప్రతినిధులకు, వేర్పాటువాదులకే ఆ హ్వానాలు వెళుతున్నాయి తప్ప, పండిట్ల వాణికి అవకాశమే ఉండడం లేదు. వలస వచ్చిన పండిట్ల కుటుంబాల కోసం 2008లో యూపీఏ ప్రభుత్వం రూ.7.5 లక్షలతో పథకం ప్ర వేశపెట్టింది. లోయకు తిరిగి వెళ్లే వారి కోసం మోడీ రూ. 20 లక్షల ప్యాకేజీ ప్రకటించారు. వారిని తిరిగి లోయకు వెళ్లేలా ప్రోత్సహించడానికి ఉద్దేశించినదే ఈ పథకం. దీనికి సీఎం ఒమర్ అబ్దుల్లా అంగీకారం కూడా ఉందని చెబుతున్నారు.
అయితే, పండిట్లు రావచ్చు గానీ, వారి పూర్వపు ఆవా సాలలోనే ఉండాలని వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు సయ్యద్ అలీ షా జిలానీ వెంటనే నినాదం అం దుకున్నారు. పండిట్లకు ప్రత్యేక రక్షణపేరుతో రాష్ట్రంలోనే మ రో రాష్ట్రం సృష్టించడానికీ, ఇజ్రాయెల్ తరహా సెటిల్‌మెంట్లు ఏర్పాటు చేయడానికీ బీజేపీ ప్రయత్నిస్తున్నదని వాదిస్తు న్నారు. కాశ్మీర్ సమస్య తక్షణ పరిష్కారానికి భారత్‌పై ఒత్తిడి తేవాలని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల కార్యదర్శిని వెంటనే కోరారు కూడా. పండిట్లు ఒక పక్క ‘పనూన్ కాశ్మీర్’ను కోరు తున్నారు. అంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, మువ్వన్నెల జెం డాకు వందనం చేసే పౌరుల కోసం ఒక రాష్ట్రం. మోడీ పండిట్ల అంశాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చిన మాట నిజం. కానీ పరిష్కారం అంత సులభం కాదు. చాలా అంశా లు కలసి రావాలి. నిజానికి అఫ్ఘాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగితే కాశ్మీర్ సమస్య మరింత జటిలమవుతుంది.
-కల్హణ