Kashmiri Pandit
-
J&K: 30 ఏళ్లలో తొలిసారి.. అసెంబ్లీ బరిలో మహిళా కాశ్మీరీ పండిట్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో దాదాపు పదేళ్ల తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మరో పది రోజుల్లో మొదటి దశ పోలింగ్ జరగనున్న నేపత్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి మహిళా కాశ్మీరీ పండిట్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.జమ్మూకశ్మీర్‌లో సర్పంచ్‌గా పనిచేసిన డైసీ రైనా అనే మహిళా కాశ్మీరీ పండింట్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీయూ కూటమిలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే) తరుపున పుల్వామాలోని రాజ్‌పోరా అసెంబ్లీ నియోజకవర్గం ఆమె బరిలోకి దిగుతున్నారు.అయితే జమ్మూకశ్మీర్‌లో మొత్తం తొమ్మిది మంది మహిళలు పోటీ చేస్తుండగా అందులో రైనా ఒకరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక యువత తమ గొంతుకగా నిలవాలని కోరుకున్నందున తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.‘ఇక్కడి యువకులు నన్ను పోటీ చేయమని బలవంతం చేశారు. వారి వాయిస్ జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి చేరేలా చూడాలని నన్ను అడిగారు. నేను ఇక్కడ సర్పంచ్‌గా పని చేస్తున్నాను. ఇక్కడి యువకులను తరుచుగా కలుస్తుంటాను. వారి సమస్యలను విని అర్థం చేసుకున్నాను. ఇక్కడి యువత ఏం తప్పు చేయనప్పటికీ బాధ పడుతున్నారు. 1990వ కాలంలో జమ్మూ కాశ్మీర్లో జన్మించిన యువకులు కేవలం బుల్లెట్లను మాత్రమే చూశారు’ అని పేర్కొన్నారు.కాగా రైనా న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసి, 2020లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారని రైనాను ప్రశ్నించగా.. తాను అసలు ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా అనుకోలేదని చెప్పారు. అయితే పుల్వామాను చక్కదిద్దగలనని చెప్పి ఒక్కరోజు ముఖ్యమంత్రి కావాలని యువకులు తనను కోరినట్లు ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శ్రీనగర్‌లోని హబ్బా కడల్ అసెంబ్లీ నియోజకవర్గం కాశ్మీరీ పండింట్ల విషయంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. రెండో దశలో భాగంగా సెప్టెంబర్ 25న మరో 26 నియోజకవర్గాలతో పాటు హబ్బా కడల్‌కు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మొత్తం 14 మంది నామినేషన్ దాఖలు చేయగా.. వారిలో ఆరుగురు కాశ్మీరీ పండింట్లు ఉన్నారు.మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టనున్నాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
JK: మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కశ్మీరీ పండిట్‌పై కాల్పులు..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్ లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. పుల్వామా అచాన్ ప్రాంతంలో ఆదివారం ఉదయం మార్కెట్‌కు వెళ్తున్న సంజయ్ శర్మపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సంజయ్ శర్మ ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి ఆదివారం ఉదయం 10:30 గంటలకు మార్కెట్‌కు వెళ్తుండగా ముష్కరులు అతనిపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. సంజయ్ శర్మ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈమేరకు ట్వీట్ చేశారు. Deeply saddened to hear of the demise of Sanjay Pandith of Achan in Pulwama district of South Kashmir. Sanjay was working as a bank security guard & was killed in a militant attack earlier today. I unequivocally condemn this attack & send my condolences to his loved ones. — Omar Abdullah (@OmarAbdullah) February 26, 2023 కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. గతేడాది మైనారిటీ వర్గాలకు చెందిన 14 మంది కాల్చి చంపారు. వీరిలో ముగ్గురు కశ్మీరీ పండిట్లు ఉన్నారు. చదవండి: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి.. అద్దాలు ధ్వంసం.. -
కశ్మీరీ పండిట్ కాల్చివేత
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రముఖ వ్యాపారి, కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రో హత్యకు గురయ్యారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి దుండగులు ఆయన్ను కాల్చి చంపారని పోలీసులు వెల్లడించారు. శ్రీనగర్‌లో ఆయనకు బింద్రో మెడికేట్ ఫార్మసీ వ్యాపారం ఉంది. ఇక్బాల్ పార్క్ వద్ద ఉన్న తన ఫార్మసీలో ఉన్న సమయంలో ఉగ్రవాదులు ఆయన వద్దకు వచ్చి కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనానంతరం ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రికి చేరే సమయానికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనానంతరం మరో ఇద్దరు వ్యక్తులను కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారు. భేల్పురి అమ్మే వీరేందర్‌ను పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. వీరేందర్‌ను చంపిన కొన్ని నిమిషాల్లోనే మొహమ్మద్ షఫి లోనె ను కూడా చంపారు. స్థానిక టాక్సీ స్టాండ్‌కు మొహమ్మద్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ హత్యలను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఖండించారు. చదవండి: (13 మంది హజారాలను తాలిబన్లు అన్యాయంగా చంపేశారు) -
‘నువ్వు తీవ్రవాదాన్ని చూపించలేదు’
శుక్రవారం బాలీవుడ్ చిత్రం ‘షికారా’ విడుదలైంది. రివ్యూలలో ఐదు స్టార్లకు రెండున్నర స్టార్లు వచ్చాయి. సినిమా పేలిపొద్ది అనుకున్నారు. తేలిపోయింది. ‘‘రిలీజ్‌కు ముందు ఎవరో కోర్టులో కేసు వెయ్యబోయీ ఆగిపోయారని తెలిసింది’’ అని విధు వినోద్ చోప్రా ట్వీట్ కూడా పెట్టారు. ‘షికారా’ సినిమా దర్శకుడు ఆయన. ఇస్లాం తీవ్రవాదుల అమానుష కాండ నుంచి తప్పించుకునేందుకు 1990లలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కోల్పోగా, కశ్మీర్‌లోయను వదిలిపోయిన లక్షల మంది కశ్మీరీ పండిత్‌ల కథ ఇది. సినిమా కాబట్టి కొంచెం ప్రేమను చొప్పించారు. అదే దెబ్బ కొట్టేసినట్లుంది! ఎక్కడైనా ప్రేమ కానీ, ఒక జాతి జాతి ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని జన్మభూమిని వదిలి పరుగులు తియ్యడం ఎంత దయనీయమైన కథాంశం! ఆ దైన్యాన్ని చూపించలేక చేతులు ఎత్తేసినట్లున్నారు చోప్రా. ‘‘నువ్వు తీవ్రవాదాన్ని చూపించలేదు. నువ్వు మారణహోమాన్ని చూపించలేదు. మా కుటుంబాలు మొత్తం ఇస్లాం తీవ్రవాదానికి తుడిచిపెట్టుకుని పోయాయి. ఒక కశ్మీరీ పండిత్‌గా నేను నీ సినిమాను గుర్తించడం లేదు’’ అంటూ ఓ ప్రేక్షకురాలు థియేటర్లో లేచి నిలబడి పెద్దగా అరుస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. థీమ్ ఏదైనా ఓ చుక్క ప్రేమ కలిపి సేల్ చేసుకోవాలని చూస్తే ఇలాగే అరకొర రివ్యూ స్టార్లు, ప్రేక్షకుల ఆగ్రహాలు మిగులుతాయని చోప్రా లాంటివాళ్లు ఎప్పటికైనా గ్రహిస్తారా?! -
పండిట్లకు ‘ప్రణవ’నాదం
సొంతగడ్డ లేని జాతుల ఇక్కట్లు ప్రపంచ చరిత్రలో అత్యంత దయనీయంగా కనిపిస్తాయి. అలాంటి జీవన్మరణ సమస్యే కాశ్మీరీ పండిట్లది కూడా. పాండిత్యాన్నీ, శాంతినీ ప్రేమించే పండిట్ల చరిత్రలో ఏడు బలవంతపు వలసలు కనిపిస్తాయి. అందులో చివరిది-1990 నాటిదే. పదహారో లోక్‌సభ ఏర్పడిన తరువాత పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. అది కేంద్రంలో తొలిసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి విని పించిన ప్రసంగమే. అందులో కాశ్మీరీ పండిట్ల కోసం కొన్ని నిమిషాలు కేటాయించారు. పూర్తి మెజారిటీ సాధించిన బీజేపీ కాశ్మీర్, పండిట్ల అంశాలను కదపకుండా ఉండడం సాధ్యం కాదు. నరేంద్ర మోడీ మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 370 ఆర్టికల్ మీద దుమారం చెల రేగింది. రాష్ట్రపతి ప్రసంగంలో 5,000 ఏళ్ల నాటి వారి సొంతగడ్డకు వెళ్లి ‘తలెత్తుకుని జీవించేటట్టుగా, రక్షణతో, జీవనోపాధి’తో కాశ్మీరీ పండిట్లు నివసించడానికి కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 370 ఆర్టికల్‌పై ఉన్న వివాదం అందరికీ తెలుసు. కానీ పండిట్ల అంశం వివాదాస్పదమని ఎవరూ వ్యాఖ్యానించరు. అయినా భారత ప్రభుత్వాలు సహా, అంతర్జాతీయ హక్కుల సంఘాలు కూడా ఈ సమస్య మీద మౌనం వహిస్తున్నాయి. పండిట్లు కాశ్మీర్ లోయకు తిరిగి వెళ్లడానికి బీజేపీ ప్రభు త్వం తన ఐదేళ్ల కాలపరిమితిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రకటించారు. స్వదే శంలో పండిట్లు శరణార్థులుగా బతకడం విషాదమే. కానీ ఈ ఆరు దశాబ్దాల రాజకీయాలు పండిట్లు తమ హక్కులను గుర్తు చేసుకోవడం కూడా సాధ్యం కానంతగా పరిస్థితులను విషతుల్యం చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు సహా కేంద్ర ప్రభుత్వాలూ బాధ్యత వహించాలి. సొంతగడ్డ లేని జాతుల ఇక్కట్లు ప్రపంచ చరిత్రలో దయనీయంగా కనిపిస్తాయి. అలాంటి జీవన్మరణ సమస్యే కాశ్మీరీ పండిట్లది కూడా. పాండిత్యాన్నీ, శాంతినీ ప్రేమించే పండిట్ల చరిత్రలో ఏడు భారీ వలసలు కనిపిస్తాయి. అందు లో చివరిది-1990 నాటిదే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం తార స్థాయికి చేరిన కాలం అదే. భారత ప్రభుత్వం ఏజెంట్లు అని పేరు పెట్టి, ఒక వర్గాన్ని ముఖ్యంగా పండిట్లను కాశ్మీర్‌లోయ నుంచి ఖాళీ చేయించే పని మొదలుపెట్టారు. అప్పుడే 24, 202 కుటుంబాలు జమ్మూ, ఢిల్లీలలో ఏర్పాటు చేసిన శిబిరా లకు చేరాయి. తరువాత ఈ సంఖ్య 38,119కి చేరింది. ఆరు నుంచి ఏడు లక్షల మంది పండిట్లు నిరాశ్రయులయ్యారని అ ఖిల భారత కాశ్మీరీ సమాజ్ వంటి సంస్థలు చెబుతున్నాయి. 1947లో కాశ్మీర్లో డోగ్రా పాలన ముగిసే నాటికి పండి ట్ల జనాభా 14 నుంచి 15 శాతం ఉంది. 1948 అల్లర్లు, 1950 నాటి భూసంస్కరణలతో చాలా జనాభా ఖాళీ అయింది. 1981 నాటి పండిట్ల జనాభా ఐదు శాతమని తేలింది. గృహ దహనాలు, ఊచకోత, మానభంగాల ఫలితమిది. 2010లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 808 పండిట్ల కుటుంబాలు మాత్రమే లోయలో మిగిలాయి. అక్బర్ కాలంలో పండిట్ హోదా పొందిన వీరంతా, 1948 నుంచి ఇక్కట్లు పడుతున్నా ఏ ప్రభుత్వమూ పట్టించు కోలేదు. ఇది సొంతగడ్డను వీడి రావడం కంటె ఎక్కువగా వారిని బాధిస్తున్నది. ఎప్పుడు కాశ్మీర్ అంశం మీద చర్చలు జరిగినా ఉగ్రవాదుల ప్రతినిధులకు, వేర్పాటువాదులకే ఆ హ్వానాలు వెళుతున్నాయి తప్ప, పండిట్ల వాణికి అవకాశమే ఉండడం లేదు. వలస వచ్చిన పండిట్ల కుటుంబాల కోసం 2008లో యూపీఏ ప్రభుత్వం రూ.7.5 లక్షలతో పథకం ప్ర వేశపెట్టింది. లోయకు తిరిగి వెళ్లే వారి కోసం మోడీ రూ. 20 లక్షల ప్యాకేజీ ప్రకటించారు. వారిని తిరిగి లోయకు వెళ్లేలా ప్రోత్సహించడానికి ఉద్దేశించినదే ఈ పథకం. దీనికి సీఎం ఒమర్ అబ్దుల్లా అంగీకారం కూడా ఉందని చెబుతున్నారు. అయితే, పండిట్లు రావచ్చు గానీ, వారి పూర్వపు ఆవా సాలలోనే ఉండాలని వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు సయ్యద్ అలీ షా జిలానీ వెంటనే నినాదం అం దుకున్నారు. పండిట్లకు ప్రత్యేక రక్షణపేరుతో రాష్ట్రంలోనే మ రో రాష్ట్రం సృష్టించడానికీ, ఇజ్రాయెల్ తరహా సెటిల్మెంట్లు ఏర్పాటు చేయడానికీ బీజేపీ ప్రయత్నిస్తున్నదని వాదిస్తు న్నారు. కాశ్మీర్ సమస్య తక్షణ పరిష్కారానికి భారత్‌పై ఒత్తిడి తేవాలని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల కార్యదర్శిని వెంటనే కోరారు కూడా. పండిట్లు ఒక పక్క ‘పనూన్ కాశ్మీర్’ను కోరు తున్నారు. అంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, మువ్వన్నెల జెం డాకు వందనం చేసే పౌరుల కోసం ఒక రాష్ట్రం. మోడీ పండిట్ల అంశాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చిన మాట నిజం. కానీ పరిష్కారం అంత సులభం కాదు. చాలా అంశా లు కలసి రావాలి. నిజానికి అఫ్ఘాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగితే కాశ్మీర్ సమస్య మరింత జటిలమవుతుంది. -కల్హణ