
నూతన ఆర్థిక వ్యవస్థకు బ్లూప్రింట్
పేదలకు సమగ్ర సామాజిక భద్రతను కల్పించే దిశగా చేపట్టిన గొప్ప చర్య ఈ బడ్జెట్‌లోని అత్యంత ముఖ్యమైన అంశమని నా అభిప్రాయం. మన రాజ్యాంగంలో ఆ లక్ష్యం లిఖించి ఉంది.
పేదలకు సమగ్ర సామాజిక భద్రతను కల్పించే దిశగా చేపట్టిన గొప్ప చర్య ఈ బడ్జెట్‌లోని అత్యంత ముఖ్యమైన అంశమని నా అభిప్రాయం. మన రాజ్యాంగంలో ఆ లక్ష్యం లిఖించి ఉంది. కానీ ఆ లక్ష్య సాధనకు సాధనాలు మాత్రం ఎప్పుడూ మన ఆర్థిక వ్యవస్థ శక్తికి మించినవిగానే అనిపిస్తుండేవి. ఈ సంప్రదాయక వివేకానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తల వంచలేదు. సామాజిక రంగంలోని బలహీలమైన లంకెలను ఆయన దృఢం చేశారు. వినూత్నమైన పథకాలను ఆవిష్కరించారు.
సరిగ్గా చెప్పాలంటే ఇది అరుణ్ జైట్లీ తొలి బడ్జెట్. దీనిని చూసి దేశంలోని ఓ బృందం బాగా కలత చెందుతుంది. అది చిన్నదే అయినా అత్యంత శక్తివం తుల బృందం. వారంతా తమ సంపదను నల్లధనంగా మార్చి విదేశాల్లో లేదా స్వదేశంలోనే దాచినవారు. మోసకారులను గతానికి జవాబుదారీతనం వహించేలా చేసి వారికి కఠిన శిక్షలను విధించడం, పారదర్శకంగా నిర్ణయా లను తీసుకోవడం ద్వారా ముందు ముందు మోసాలు జరగకుండా నివారిం చడం అనే ద్విముఖ విధానంతో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీలు అవినీతిని సవాలు చేశారు.
ధనవంతులు మీకంటే, నాకంటే భిన్నమైన వారనేది బాగా తెలిసిన విషయమే. వారివద్ద చాలా డబ్బుంది. డబ్బు సహజంగానే అహంకారాన్ని పెంచి పోషిస్తుంది. కానీ కొందరు భారత కుబేరులు అరుదైన రీతిలో ఆ తలబిరుసుతనంలో ప్రత్యేకీకరణను చూపుతున్నారు. తాము చేసినవి ఎంతటి తీవ్ర నేరాలైనా డబ్బు పడేసి శిక్ష తప్పించుకోగలమని వారి విశ్వాసం. నల్లధనానికి వ్యతిరేకంగా ప్రతిపాదించిన చట్టం ఇప్పుడున్న లొసుగులను అడ్డగిస్తుంది. జైలు అంటే కఠిన కారాగారవాసం. అంతేగానీ లంచాలతో కొనుక్కోగల సుఖ జీవితం కాదు.
జైట్లీ బడ్జెట్ పట్ల అంసతుష్టితో ఉన్న మరో బృందం ఆయన విఫలం కావాలని కోరుకునే బాపతు. చాలా మంది ప్రతిపక్ష పార్టీల నేతల మొహాల్లో తొంగిచూస్తున్న విచారమే అందుకు ఆధారం. కొందరు తమలోని నిరాశా నిస్పృహలను డాంబికాల మాటున కప్పిపుచ్చుకోవాలని యత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ప్రజాస్వామిక ఆచరణ తరచూ వ్యతిరేకత కోసమే వ్యతి రేకత అనే అలవాటును ప్రోత్సహిస్తుంది. అలాంటి రాజకీయవేత్తలు అత్యంత ముఖ్యమైన ఒక అంశాన్ని విస్మరిస్తున్నారు. ఇది, ఐదేళ్లూ అధికారంలో కొనసాగగలమని ఆత్మవిశ్వాసంతో ఉన్న సుస్థిర ప్రభుత్వ బడ్జెట్. కాబట్టి అది సుస్పష్టంగా నిర్వచించుకున్న విస్తృత పరిధి దిశగా సమతూకంతో, స్థిరచిత్తం తో ఆచి తూచి అడుగులు వేయగలుగుతుంది. ఇది ఆరంభం మాత్రమే. వచ్చే ఏడాదికి ఈ ప్రభుత్వం మరింత సంతోషంగా ఉండవచ్చు.
దృష్టి పథాన్ని ఎంత సుదూరానికైనా విస్తరించనివ్వడం, అంత దూర మూ పయనించగలిగేలా కాళ్లను మాత్రం నేలపైనే నిలిపి ఉంచడం అనే దే పరిపాలనాపరమైన తాత్వికత. ఆచరణాత్మకంగా ఉండటం అవసరం. పేద రికాన్ని ఎలా నిర్మూలించగలం? దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న భారతీ యులందరికీ విద్యుత్తు, మరుగుదొడ్లున్న ఇళ్లను అందించడం, మరీ ముఖ్యం గా ఇంటింటా ఉద్యోగం ఉన్న సంపాదనాపరుడు ఉండేలా చూడటం ద్వారా నే సాధ్యం. ఆత్మగౌరవంపై నమ్మకముంచండి. పేదలకు సమగ్ర సామాజిక భద్రతను కల్పించే దిశగా చేపట్టిన గొప్ప చర్య ఈ బడ్జెట్‌లోని అత్యంత ముఖ్యమైన అంశమని నా అభిప్రాయం.ఆర్థిక మంత్రి మాటల్లోనైతే అది ‘‘న్యాయమైన, దయతోకూడిన సమాజం.’’ మన రాజ్యాంగంలో ఆ లక్ష్యం లిఖించి ఉంది. కానీ ఆ లక్ష్య సాధనకు సాధనాలు మాత్రం ఎప్పుడూ మన ఆర్థిక వ్యవస్థ శక్తికి మించినవిగానే అనిపిస్తుండేవి. ఈ సంప్రదాయక వివేకా నికి జైట్లీ తల వంచలేదు. సామాజిక రంగంలోని బలహీలమైన లంకెలను ఆయన దృఢం చేశారు. వినూత్నమైన పథకాలను ఆవిష్కరించారు.
నెలకు ఒక రూపాయికి ప్రమాద బీమా, రోజుకు ఒక రూపాయికి జీవిత బీమా పేదలకు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీలో ఇప్పుడు కనీసం డజను మంది మాజీ ఆర్థిక మంత్రులు ఉండి ఉండాలి. వారిలో కొందరు బడ్జెట్ నిపుణులుగా గుర్తింపును పొందినవారు కూడా. తమ బడ్జెట్లలో ఈ బీమా పథకాలను ఎందుకు ప్రవేశపెట్టలేదా? అని వారంతా ఇప్పుడు తమను తాము తప్పక తిట్టుకుంటూ ఉండాలి. ఉపశమన చర్యలతో పేదరికాన్ని పాక్షికంగానే నిర్మూలించగలం. పేదరిక నిర్మూలన మాత్రం ఉద్యోగాల కల్పన ద్వారానే సాధ్యం. నరేంద్ర మోదీకి భారతీయులలో విశ్వాసముంది. కాబట్టే ఆయన ప్రభుత్వ ఆర్థిక చింతనకు ‘మేక్ ఇన్ ఇండియా’ పునాదిరాయి కాగలిగింది. పెద్ద ఎత్తున ఉద్యోగా వకాశాలు విస్తరించాల్సిన అవసరం ఇప్పుడుంది.
1980ల కష్టకాలంలో రోనాల్డ్ రీగన్ అమెరికాకు అధ్యక్షునిగా ఉన్నారు. ‘‘మీ పొరుగువాడు ఉద్యోగం కోల్పోవడమంటే ఆర్థిక తిరోగమనం, మీరు ఉద్యోగం కోల్పోవడమంటే ఆర్థిక మాంద్యం’’ అని ఆయన అప్పట్లో ఒకసారి అభివర్ణించారు. 2013 నాటికి యూపీఏ ప్రభుత్వం ఆర్థిక తిరోగమనంపై, ఆర్థిక మాంద్యాన్ని పేరబెట్టింది. ఉద్యోగ కల్పనకు పెట్టుబడులు కావాలి. విశ్వసనీయతను తిరిగి నెలకొల్పలేకపోతే విదేశీ పెట్టుబడులైనా గానీ లేదా దేశీయ పెట్టుబడులైనా గానీ చేకూరవు.
క్రమక్రమంగా విశ్వసనీయతను పెంపొందింపజేయడానికి కేంద్రం.. పజలను ద్రవ్యవ్యవస్థలో భాగస్వాములను చేయడమే మార్పునకు సంబం ధించిన కీలకమైన అంశంగా పరిగణించి వరుసగా పలు చర్యలను చేపట్టింది. తొమ్మిది మాసాలుగా సాగిన ఈ కృషి తదుపరి, నేటి బడ్జెట్ మన దేశాన్ని పెట్టుబడులకు సహేతుక గమ్య స్థానంగా పునఃస్థాపించగలిగింది. పేదల ఆర్థిక సాధికారత మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, వృది చెందుతున్న మార్కెట్‌గా మారుస్తుంది. తత్పర్యవసానంగా ప్రథమ ప్రయో జనం దేశీయ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకే సమకూరుతుంది.
రోడ్లు, రైల్వేలు, నగరాలు, రేవుల వంటి మౌలిక సదుపాయాల రంగమే సమీప భవిష్యత్తులో అతి పెద్ద ఉపాధి కల్పనా వనరు కానుంది. సురేశ్ ప్రభు అద్భుతమైన రైల్వే బడ్జెట్‌ను అందించారు. రైల్వే స్టేషన్‌ను పట్టణ ఆర్థిక, వినోద కార్యక్రమాల కేంద్రంగా మార్చే అవకాశాన్ని అది అందించింది. స్టేషన్ 25 అంతస్తుల భవనం ఎందుకు కారాదని రైల్వే మంత్రి ప్రశ్నించారు. జాతీయ బడ్జెట్ ఆ దార్శనికత స్థాయిని పలురెట్లు హెచ్చించింది. దేశాన్ని పెద్ద ఎత్తున పరివర్తన చెందించడానికి అవసరమైన భారీ పెట్టుబడులకు చట్టప రమైన, పరిపాలనాపరమైన ప్రాతిపదికను సృష్టించడంలో పెద్ద ముందడు గులను వేయగలిగింది. దీని సంకేత శబ్దం (పాస్‌వర్డ్) మరో మారు కూడా జవాబుదారీతనంతో కూడిన స్పష్టతే. దివాలా చట్టం అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంస్కరణ. పెట్టుబడుల పేరిట బ్యాంకులను ప్రైవేటు ఖజానాలుగా మార్చి ఇష్టానుసారం కొల్లగొట్టిన నయవంచకులు ఇకపై కూలిన శిథిలాల మధ్య చాలా తక్కువ సౌఖ్యాన్నే అనుభవించగలుగుతారు.
వృద్ధి ఒక గణాంకం కాదు. అది బ్యాంకు ఖాతాలోని కొన్ని అదనపు అంకెలకు మించి మరేమైనా కావాలంటే దానికి రక్తమాంసాలను ఇవ్వాలి. ఉద్యోగాలు, నైపుణ్యాలకు అవకాశాలు లేకపోతే, ఆర్థిక వ్యవస్థ కాగితపు పులి మాత్రమే అవుతుంది. జైట్లీ బడ్జెట్ నిజాయితీ, వాస్తవికవాదాలతో తయారైన డాక్యుమెంటు, భవితకు సంబంధించిన శక్తివంతమైన దృష్టి. అది దేశాన్ని వ్యూహాత్మకతతో పాటూ విశ్వసనీయమైన భవన నిర్మాతగా, వర్తమానాన్ని గుర్తించి భవితను మలుచుకోగల మనిషిగా పరివర్తన చెందించే ప్రణాళిక. భారత నూతన ఆర్థిక వ్యవస్థకు మొట్టమొదటి నమూనా చిత్రం.
- ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు