economic system
-
మేం ఆకలితో చస్తుంటే... మీకు మరో విమానమా?
ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి నైజీరియా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అధ్యక్షుడు బోలా టినుబు కోసం కొత్త విమానాన్ని కొనడంపై నైజీరియన్లు మండిపడుతున్నారు. ఆకలి, పెరుగుతున్న జీవన వ్యయంపై దేశవ్యాప్తంగా అసంఖ్యాకులు రోడ్లపైకెక్కి నిరసన వ్యక్తం చేసిన రెండు వారాలకే ఈ పరిణామం జరిగింది. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా. గతేడాది అధ్యక్షునిగా ఎన్నికైన టినుబు పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక వృద్ధికి ఊతమివ్వడానికి తప్పదంటూ ఇంధన సబ్సిడీలను తొలగించారు. దాంతో ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. దీంతో తన సొంత పరివారంతో సహా అధికారిక ప్రయాణాలను, ప్రతినిధులను తగ్గిస్తున్నట్లు జనవరిలో ప్రకటించారు. ఉన్నట్టుండి ఇప్పుడిలా ఎయిర్ బస్ ఎ330 విమానాన్ని కొనుగోలు చేశారు. ఆయన సొంత విమానాల శ్రేణిలో ఇది ఏడోది! కొత్త విమానంలోనే గత సోమవారం ఫ్రాన్స్ వెళ్లారు.డబ్బు ఆదా అవుతుందట!తాము ఆకలితో చస్తుంటే అధ్యక్షునికి కొత్త విమానం కావాల్సొచందా అంటూ నైజీరియన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మెరుగైన రేపటి కోసం ఈ రోజు కష్టాలు భరించక తప్పదంటూ అధ్యక్షుడు సుద్దులు చెప్పారు! ఇదేనా ఆ మెరుగైన రేపు?’’అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 150 నైజీరియన్ బిలియన్లు పెట్టి మరీ విమానం కొనుక్కోవడం సగటు నైజీరియన్ల పట్ల అధ్యక్షునికి ఏమాత్రం బాధ్యత లేదనేందుకు రుజువంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు మాత్రం విమాన కొనుగోలును సమర్థించుకుంటున్నారు. పాత విమానాలకు కాలం చెల్లడంతో వాటి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. ఆ లెక్కన కొత్త విమానం వల్ల డబ్బు ఆదాయే అవుతుంది’’అంటూ అధ్యక్షుని మీడియా సహాయకుడు సూత్రీకరించడం విశేషం! ప్రస్తుత విమానాలు సురక్షితం కాదంటూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుని కోసం రెండు కొత్త విమానాల కొనుగోలుకు చట్టసభ సభ్యులు గతంలోనే సిఫార్సు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థికాభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా తయారైంది. బ్యాంకింగ్ రంగం కీలక సూచికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో డిపాజిట్లతో పాటు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైనట్లు 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సత్పలితాలు ఇస్తున్నాయనడానికి డిపాజిట్లలో భారీ వృద్ధి నిదర్శనం. గత ఐదేళ్లలో డిపాజిట్లలో ఏకంగా 58.23 శాతం వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి డిపాజిట్లు రూ.3,12,642 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.4,94,690 కోట్లు.. అంటే రూ.1,82,048 కోట్లు పెరిగాయి. అన్ని రంగాలకు బ్యాంకు రుణాల మంజూరులో ఏకంగా 96.64 శాతం భారీ వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి రుణాల మంజూరు రూ.3,97,350 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.7,81,313 కోట్లకు పెరిగాయి. అంటే రుణాలు రూ.3,83,963 కోట్లు పెరిగాయి. డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం పెరుగుదలకు నిదర్శనం కాగా రుణాలు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నేరుగా నగదు బదిలీని అమలు చేసింది. అలాగే బ్యాంకుల ద్వారా పేదలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎంఎస్ఎంఈలు, ఇతర వర్గాలకు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా వారి ఆదాయం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టింది. అందువల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లో రుణాల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది. ఆర్బీఐ నిబంధనలకన్నా అన్ని రంగాల్లో అత్యధికంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తోంది. వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తోంది. వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు రుణాలను మంజూరు చేయించి, వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా ప్రభుత్వం అందించిన చేయూతతో సకాలంలో రుణాలు చెల్లిస్తూ వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి క్రెడిట్ రేషియో 60 శాతం ఉండాల్సి ఉండగా దానికి మించి 157.94 శాతం నమోదైనట్లు బ్యాంకర్ల కమిటీ నివేదిక పేర్కొంది. సీడీ రేషియో అధికంగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరగుతున్నాయనే అర్ధమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. -
ఏపీ స్థూల ఉత్పత్తిపై ‘ఎస్బీఐ రీసెర్చ్’ నివేదిక.. నాలుగేళ్లలో రెట్టింపు
ఏపీ జీఎస్డీపీ 2022–23లో 16 శాతం వృద్ధితో రూ.13 లక్షల కోట్లకు చేరింది. 2027 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే నాలుగేళ్లలో ఏపీ స్థూల ఉత్పత్తి దాదాపు రెట్టింపు కానుంది. సాక్షి, అమరావతి: వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రెట్టింపు కానుంది. ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ ఏకంగా రూ.20 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ‘ఎస్బీఐ రీసెర్చ్’ నివేదిక వెల్లడించింది. 2022 సంవత్సరం నుంచి ఏపీ వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. 2027 నాటికి దేశ ఆర్థిక పరిస్థితితోపాటు ఏపీ సహా 15 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల తీరు తెన్నులపై ‘ఎస్బీఐ రీసెర్చ్’ నివేదికను విడుదల చేసింది. 2027 నాటికి తెలంగాణను అధిగమించి ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి పెరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది. ‘ఎస్బీఐ రీసెర్చ్’ ముఖ్యాంశాలివీ.. ► దేశంలో 2022 నుంచి వృద్ధి వేగం పుంజుకుంది. 2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ► దేశ ప్రస్తుత వృద్ధి రేటును పరిగణలోకి తీసు కుంటే 2027 నాటికి జపాన్, జర్మనీలను అధిగమిస్తుంది. ప్రపంచ జీడీపీలో భారత్ వాటా నాలుగు శాతాన్ని దాటుతుంది. ప్రపంచ దేశాల జీడీపీలో భారత్ 2014లో పదో ర్యాంకులో ఉండగా 2015లో 7వ ర్యాంకులో నిలిచింది. 2019లో ఆరో ర్యాంకులో ఉంది. 2022లో ఐదో ర్యాంకులో ఉండగా 2027 నాటికి మూడో ర్యాంకులో నిలిచే అవకాశం ఉంది. ► 2027 నాటికి భారత్ జీడీపీ రూ.420.24 లక్షల కోట్లకు చేరుతుంది. ఇందులో 15 రాష్ట్రాల నుంచే దేశ జీడీపీకి రూ.358.40 లక్షల కోట్లు సమకూరనుండటం గమనార్హం. దీనికి సంబంధించి అత్యధికంగా 13 శాతం వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవనుంది. ఉత్తర్‌ప్రదేశ్ 10 శాతం వాటాతో రెండో స్థానంలో, ఐదు శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలవనున్నాయి. ► 2027 నాటికి భారత్‌లో కొన్ని రాష్ట్రాలు ఏకంగా కొన్ని దేశాలకు మించి వృద్ధి నమోదు చేస్తాయి. ► ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రూ.11 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నమోదు కాగా 2027 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే నాలుగేళ్లలో ఏపీ స్థూల ఉత్పత్తి దాదాపు రెట్టింపు కానుంది. -
‘అమృత’ ప్రగతికి... సప్తరుషి మంత్రం
న్యూఢిల్లీ: వేతన జీవుల కోసం వ్యక్తిగత ఆదాయ పన్ను రిబేటు పరిమితి పెంపు. మధ్య తరగతి, మహిళలు, పెన్షనర్ల కోసం పలు ప్రోత్సాహకాలు. మూలధన వ్యయంతో పాటు వృద్ధికి దోహదపడే రంగాలకు కేటాయింపుల్లో భారీ పెంపు. కీలకమైన వ్యవసాయానికి తగ్గింపు. ఆరోగ్య, విద్యా రంగాలకు అంతంతమాత్రం. రోడ్లు, మౌలిక తదితర రంగాలకు ఊపు. స్థూలంగా ఇవీ ‘అమృత్కాల్’బడ్జెట్ విశేషాలు. ద్రవ్యోల్బణం, మాంద్యం వంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన ఆవశ్యకతకు, లోక్‌సభ ఎన్నికల వేళ ఓటరును సంతృప్తి పరచాల్సిన అనివార్యతకు మధ్య సమ తూకం సాధించేందుకు విత్త మంత్రి శాయశక్తులా ప్రయత్నించారు. అదే సమయంలో వీలున్నంత వరకూ ‘వృద్ధి బాట’నే సాగారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి 45.03 లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. గత బడ్జెట్లో వేసిన పునాదులపై ముందుకు సాగుతూ ‘వందేళ్ల భారత్’బ్లూప్రింట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తోడ్పడేలా పద్దును రూపొందించినట్టు వెల్లడించారు. రానున్న పాతికేళ్ల అమృత కాలంలో ఆశించిన ప్రగతి లక్ష్యాల సాధనకు మంత్రి సప్తర్షి మంత్రం జపించారు. సమ్మిళితాభివృద్ధి, ప్రతి ఒక్కరికీ పథకాల ఫలాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సామర్థ్యాల వెలికితీత, హరిత వృద్ధి, యువ శక్తి, ఆర్థిక రంగం... ఇలా వృద్ధి ఏడు విభాగాలుగా అభివృద్ధి బ్లూ ప్రింట్‌ను ఆవిష్కరించారు. భారత్‌ను ప్రపంచ ఆర్థిక రంగంపై ‘తళుకులీనుతున్న తార’గా అభివర్ణించారు. ‘‘మన ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో ఉంది. వృద్ధి బాటన అది శరవేగంగా పరుగులు తీస్తున్న వైనాన్ని ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షిస్తోంది’’అంటూ భరోసా ఇచ్చారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని అతి త్వరలో సాధిస్తామని ధీమా వెలిబుచ్చారు. తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు తదితరాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ వచ్చారు. తలసరి ఆదాయం రెట్టింపై ప్రజలు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారని చెప్పారు. ‘అందరికీ తోడు, అందరి అభివృద్ధి’లక్ష్యంతో సాగుతున్నామన్నారు. వ చ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్. 2024లో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళ్లనుంది. డిజిటల్ బాటన వడివడిగా... సుపరిపాలనే దేశ ప్రగతికి మూలమంత్రమన్న విత్త మంత్రి, పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ద్వారా సామాన్యుడి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఉటంకించారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వ కృషి ఫలితంగా ప్రభుత్వ రంగంలో ప్రపంచ స్థాయి డిజిటల్ వ్యవస్థ సాకారమైందని చెప్పారు. ఆధార్, కొవిన్, యూపీఐ, డిజి లాకర్స్ తదితరాలన్నీ ఇందుకు నిదర్శనమేనన్నారు. కృత్రిమ మేధలో లోతైన పరిశోధనల నిమిత్తం మూడు అత్యున్నత విద్యా సంస్థల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ తేనున్నట్టు చెప్పారు. 5జీ సేవలను మరింత విస్తరిస్తామన్నారు. అదే సమయంలో పేదలు, దిగువ తరగతి సంక్షేమానికీ పెద్ద పీట వేశామని చెప్పారు. ‘‘కరోనా వేళ దేశంలో ఎవరూ ఆకలి బాధ పడకుండా చూడగలిగాం. 80 శాతం మంది పేదలకు ఆహార ధాన్యాలందించాం. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద రూ.2 లక్షల కోట్లతో పేదలకు ఉచితంగా తిండి గింజలు సరఫరా చేశాం. వంద కోట్ల పై చిలుకు మందికి వ్యాక్సిన్లిచ్చాం. వాటిని పంపి ఎన్నో ప్రపంచ దేశాలను ఆదుకున్నాం’’అన్నారు. పెద్ద దేశాల్లో మనమే టాప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును ఏకంగా 7 శాతంగా మంత్రి అంచనా వేశారు. ‘‘పెద్ద దేశాలన్నింట్లోనూ ఇదే అత్యధికం. అంతర్జాతీయంగా తీవ్ర మాంద్యం, కరోనా కల్లోలం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి గడ్డు సమస్యలను తట్టుకుంటూ ఇంతటి ఘనత సాధించనుండటం గొప్ప ఘనత’’అని చెప్పారు. ప్రస్తుతం 6.4గా ఉన్న ద్రవ్య లోటును 2023–24లో 5.9 శాతానికి పరిమితం చేయడమే లక్ష్యమన్నారు. ఐటీ పరిమితి 7 లక్షలకు... కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడం ద్వారా పన్ను చెల్లింపుదా రులు పాత విధానం నుంచి మారేలా ప్రోత్సహించేందుకు మంత్రి ప్రయతి్నంచారు. గరిష్ట ఆదాయ పన్ను రేటును 42.7 శాతం నుంచి 39 శాతానికి, సర్చార్జిని 37 నుంచి 27 శాతానికి తగ్గించారు. సీనియర్ సిటిజన్లకు కూడా గరిష్ట పొదుపు పరిమితిని రెట్టింపు చేస్తూ రూ.30 లక్షలకు పెంచారు. మొబైల్ ఫోన్ విడి భాగాలు, టీవీలు తదితరాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ద్వారా మధ్య, దిగువ తరగతికి ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. అయితే వెండి ప్రియం కానుండటం మహిళలకు దుర్వార్తే. మౌలికంపై మరింత దృష్టి... మౌలిక సదుపాయాలు తదితరాలపై ఈసారి మరింత దృష్టి పెడుతున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ఆర్థికంగా వెనకబడ్డ పట్టణ ప్రాంతాల వారికి గూడు కలి్పంచే పీఎం ఆవాస్ యోజనకు కేటాయింపులను రూ.79 వేల కోట్లకు (ఏకంగా 66 శాతం) పెంచారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం పట్టణ మౌలికాభివృద్ధి నిధిని ప్రకటించారు. ఇక దేశానికి జీవనాడి అయిన రైల్వేలకు ఇప్పటిదాకా అత్యధికంగా రూ.2.4 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. ఇక పోర్టులు, పరిశ్రమలకు అనుసంధానాన్ని మరింత మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన ఏకంగా రూ.77 వేల కోట్లతో కీలక రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రకటించారు. ఇందులో రూ.15 వేల కోట్లను ప్రైవేట్ రంగం నుంచి సేకరించనున్నారు. హరిత నినాదం కాలుష్యకారక శిలాజ ఇంధనాల నుంచి క్రమంగా పూర్తిస్థాయిలో కాలుష్యరహిత స్వచ్ఛ ఇంధనానికి మారే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.35 వేల కోట్లు కేటాయించారు. బయో వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా సంపద సృష్టికి గోబర్ధన్ పథకం కింద ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. సాగు, భవనాలు, పరికరాలు తదితరాలన్నింటినీ హరితమయం చేయడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. పీఎం కిసాన్ పథకానికి రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లుగా నిర్దేశించుకున్నారు. పశుగణాభివృద్ధి, మత్స్య విభాగాలపై ఫోకస్ పెంచారు. ప్రధాని బాగా ప్రోత్సహిస్తున్న చిరుధాన్యాలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు ఎగువ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించారు. మహిళలకు మరింత సాధికారత మహిళా సాధికారత దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. 81 లక్షల పై చిలుకు స్వయం సహాయ బృందాలను స్టార్టప్‌ల తరహాలో తీర్చిదిద్దడం ద్వారా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నట్టు ప్రకటించారు. పర్యాటక రంగానికి ఇతోధికంగా ప్రోత్సాహకాలిస్తామన్నారు. మధ్య తరగతి దర్శనీయ ప్రాంతాల్లో పర్యటించేందుకు పథకం ప్రకటించారు. జి–20 సారథ్యం.. గొప్ప అవకాశం ‘‘జి–20 సదస్సుకు ఈ ఏడాది భారత్ సారథ్యం వహించనుండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన పాత్రను మరింత బలోపేతం చేసుకునేందుకు గొప్ప అవకాశం. వసుధైక కుటుంబకం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) నినాదంతో ఈ దిశగా ముందుకెళ్తున్నాం’’అని నిర్మల తెలిపారు. బడ్జెట్ సైడ్‌లైట్స్... ఈసారి 87 నిమిషాలే... బడ్జెట్ ప్రసంగాన్ని విత్త మంత్రి ఈసారి 8,000 పై చిలుకు పదాల్లో, కేవలం 87 నిమిషాల్లోనే ముగించారు. 2020 బడ్జెట్ సమరి్పంచినప్పుడు ఆమె ఏకంగా 162 నిమిషాలు మాట్లాడటం విశేషం! బడ్జెట్ ప్రసంగాల్లో అతి సుదీర్ఘమైనదిగా అది చరిత్రకెక్కింది కూడా. ఆ తర్వాత క్రమంగా నిడివి తగ్గతూ వస్తోంది. నిర్మల 2021లో 110 నిమిషాలు, 2022లో 92 నిమిషాలు ప్రసంగించారు. కరోనా నేపథ్యంలో 2021లో తొలి పేపర్‌లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆమెదే. క్షమాపణలతో నవ్వులు పూయించి... ►కాలం చెల్లిన పాత వాహనాలను పక్కన పెట్టే పథకానికి నిధులు ప్రకటించే క్రమంలో ఆర్థిక మంత్రి కాస్త తడబడి ‘ఓల్డ్ పొలిటికల్ వెహికిల్స్’అనడంతో సభ్యులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నిర్మల వెంటనే సర్దుకుంటూ ‘ఓల్డ్ పొల్యూటింగ్ వెహికిల్స్. సరేనా? అయాం సారీ’అనడంతో అంతా ఒక్కసారిగా నవ్వేశారు. ►అధికార సభ్యుల స్వాగతం నడుమ లోక్‌సభలోకి ప్రవేశించిన నిర్మల, ఎరుపు రంగు బహీ ఖాతా నుంచి బయటికి తీసిన ట్యాబ్లెట్ పీసీ సాయంతో పద్దును ప్రవేశపెట్టారు. ఆమె కూతురు, బంధువులు స్పీకర్ గ్యాలరీ నుంచి వీక్షించారు. ►కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రసంగం ముగిశాక ప్రధాని ఆమె దగ్గరికి వెళ్లి అభినందించారు. మంత్రివర్గ సభ్యులతో పాటు కొందరు విపక్ష సభ్యులు కూడా ఆమెను చుట్టుముట్టారు. ►ఆమె ప్రసంగం పొడవునా అధికార సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు. ముఖ్యంగా ఐటీ రాయితీలు ప్రకటిస్తుండగా మోదీ, మోదీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చిరుధాన్యాల ప్రస్తావన రాగానే ప్రధాని మోదీ బల్లపై చరుస్తూ హర్షం వెలిబుచ్చారు. అప్పుడప్పుడూ విపక్ష సభ్యులు నిరసనలు తెలిపారు. ►బడ్జెట్ ప్రసంగం మొదలైన కాసేపటికి సభలోకి అడుగు పెట్టిన రాహుల్‌గాం«దీని కాంగ్రెస్ సభ్యులు ‘జోడో జోడో. భారత్ జోడో’అని నినదిస్తూ స్వాగతించారు. అప్పుడప్పుడూ ‘అదానీ, అదానీ’నినాదాలూ విన్పించాయి. ►మామూలుగా నినాదాలు, నిరసనలతో హోరెత్తించే తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ప్రసంగాన్ని నిశ్శబ్దంగా వింటూ కని్పంచారు. ఆర్థిక వృద్ధి అవసరాలు, ప్రజాకాంక్షల మధ్య చక్కని సమతౌల్యం కుదిరిన బడ్జెట్ ఇది. పెట్టుబడి వ్యయ పద్దు తొలిసారి రూ.10 లక్షల కోట్లను తాకింది. ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను వ్యవస్థలోనూ మధ్యతరగతికి లబ్ధి చేకూర్చేలా మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ఆ దాయ పన్ను వ్యవస్థను మరింత ఆకర్షణీయం చేయడం దీని ఉద్దేశం. మహిళా సాధికారతకూ మరింత పెద్దపీట వేశాం. కస్టమ్స్ సుంకాలనూ హేతుబద్దీకరించే ప్రయత్నం చేశాం. -
2030 నాటికి మూడో ఆర్థిక శక్తిగా భారత్
మాదాపూర్: ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2030 నాటికి మూడో ఆర్థిక శక్తిగా ఎదగనుందని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ అన్నారు. మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో మంగళవారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) 2023 స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ 2047 నాటికి మనదేశం నెంబర్‌వన్‌గా నిలుస్తుందన్నారు. సీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఆయన పట్టాలను అందజేశారు. ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై చర్చలు నిర్వహించే జీ–20 దేశ సమావేశాల్లో ఐసీఏఐ కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఐసీఏఐ అధ్యక్షుడు దేబాషిన్ మిత్రా మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన సీఏ ఉత్తీర్ణులైన విద్యా ర్థుల్లో 42% మహిళలే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఐ ఉపాధ్యక్షుడు అనికేత్ సునీల్ తలాటి, ఐసీఏఐ కౌన్సిల్ సభ్యులు శ్రీధర్ ముప్పాల, ప్రతినిధులు సుశీల్‌కుమార్ గోయల్, ప్రసన్నకు మార్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
మోదీ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమని మంత్రి కె.తారక రామారావు ఆరోపించారు. పురోగమన దిశగా అడుగులు వేస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దారుణంగా దెబ్బతీశారని విమ ర్శించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చి ఆరేళ్ల యిన సందర్భంగా కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీని అరికట్టడం, తీవ్రవా దానికి నిధులు ఆపడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసమే నోట్ల రద్దు అంటూ బీజేపీ ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ అవాస్తవాలేనని తేలిపోయిందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ తిరోగమనం రద్దయిన పెద్దనోట్లలో 99.3 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వుబ్యాంకు గణాంకాలతో సహా ప్రకటించిందని.. లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికితీస్తున్నట్టు చెప్పిన కేంద్రం చివరికి తెల్ల ముఖం వేయాల్సి వచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పైగా కొత్త నోట్ల ముద్రణ కోసం ఆర్బీఐకి రూ.21 వేల కోట్లు అదనపు ఖర్చు అయిందన్నారు. 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత 2017 జనవరి నాటికి దేశంలో రూ.17.97 లక్షల కోట్ల నగదు చలామణీలో ఉండేదని.. ప్రస్తుతం అది 72శాతం పెరిగి రికార్డు స్ధాయిలో రూ.30.88 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. కేంద్రం కరోనా పరిస్థితులు, లాక్డౌన్ వంటివి ఆర్థికవ్యవస్ధ పతనానికి కారణాలుగా చూపిస్తోందని.. లాక్డౌన్ కన్నా ముందు 2020 నాటికే వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలో ఉన్న విషయాన్ని దాచి పెట్టారని విమర్శించారు. ఉపాధిపోయి.. నిరుద్యోగం పెరిగి.. పెద్ద నోట్ల రద్దు, కరోనా అనంతర నిర్ణయాల వల్ల చిన్నాపెద్దా పరిశ్రమలు లక్షలకొద్దీ మూతపడ్డాయని కేటీఆర్ చెప్పారు.దీనితో నిరుద్యోగం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. 2016 నుంచి 2019 మధ్య సుమారు 50లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, 2016లో 88లక్షల మంది కనీసం ఐటీ రిటర్నులు దాఖలు చేయలేకపోయారని చెప్పారు. పారిశ్రామిక ఉత్పత్తులు, ఆర్థికవ్యవస్థలో కొనుగోళ్లు తగ్గడంతో ప్రభుత్వాల పన్ను రాబడులు తగ్గిపోయాయని, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభావం పడిందని చెప్పారు. మోదీ క్షమాపణలు చెప్పాలి నోట్ల రద్దు నిర్ణయం తప్పు అయితే 50రోజుల తర్వాత తనను సజీవంగా దహనం చేయాలంటూ అప్పట్లో ప్రధాని మోదీ మభ్యపెట్టారని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు నోట్ల రద్దు దుష్పరిణామాల బాధ్యతను తీసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఎన్నికలే బ్రిటన్‌కు మందు
మహాసంక్షోభం ముంచుకొస్తున్నదని, నలుదిక్కులా పొంచివున్న సమస్యలు కాలనాగులై కాటేసే ప్రమాదముందని తెలిసినా అలవికాని హామీలిచ్చి బ్రిటన్ ప్రధాని పదవిని చేజిక్కించుకున్న లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల వ్యవధిలోనే తత్వం బోధపడి నిష్క్రమించారు. బ్రిటన్ చరిత్రలో అతి స్వల్పకాలం ఏలుబడి సాగించిన నేతగా అపకీర్తి మూటకట్టుకున్నారు. నెలాఖరుకల్లా మరొకరు ఆ పదవిని అధిష్ఠించాల్సి ఉంది. ఎనిమిది వారాల్లో ముచ్చటగా మూడో ప్రధానిని బ్రిటన్ ప్రజానీకం చూడబోతున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టే నేత ఈ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఏం చేస్తారన్నది కొన్నిరోజుల్లో తేలిపోతుంది. పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉన్న కన్సర్వేటివ్ పార్టీ ఎన్నికల ఊసెత్తకుండా కొత్త నేతతో నష్టనివారణకు ప్రయత్నించవచ్చు. కానీ అది అన్ని విధాలా అప్రజాస్వామికమే అవుతుంది. ప్రస్తుతం బ్రిటన్ చుట్టూ ముసురుకున్న సమస్యలకు లిజ్ ట్రస్ కారకులు కాకపోవచ్చు. 2016లో వెనకాముందూ చూడకుండా బ్రెగ్జిట్‌కు దేశం ఆమోదముద్ర వేయటంలోనే అందుకు బీజాలు పడివుండొచ్చు. ఈయూ నుంచి బయటికొచ్చినప్పటినుంచీ ఆర్థిక అస్థిరత పీడిస్తున్న సంగతి కాదనలేనిది. కరోనా కష్టాలు సరేసరి. ఈలోగా ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ యుద్ధం ఇంధన ధరలను ఆకాశాన్నంటేలా చేసింది. కానీ ఈ సమస్యల పరిష్కారానికి ఆమె అనుసరిస్తానన్న విధానాలపై ప్రధాని పదవికి పోటీపడినప్పుడే కన్సర్వేటివ్ పార్టీలో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆమె చూపుతున్న మార్గం ఆత్మహత్యాసదృశమవుతుందని ఆర్థిక నిపుణులు సైతం హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం తెచ్చి వృద్ధికి దోహదపడతానని, అందుకోసం పన్నులపై కోత విధిస్తా నని, విద్యుత్ బిల్లులపై ద్రవ్యోల్బణం ప్రభావం పడకుండా అదుపు చేస్తానని ట్రస్ హామీ ఇచ్చినప్పుడు ఆమెతో పోటీపడిన రిషి సునాక్ అది మరింత సంక్షోభాన్ని కొనితెస్తుందన్నారు. పన్ను కోతల వల్ల ఏర్పడే లోటును ఎలా పూరిస్తారో, పెరిగే వ్యయానికి నిధులు ఎక్కణ్ణించి వస్తాయో చూప కుండా నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. కానీ సునాక్‌ను ఆమె నిరాశావాదిగా కొట్టిపారేశారు. అయితే గత నెల 23న ఆర్థికమంత్రి క్వాసీ క్వార్టెంగ్ మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత జరిగింది అదే. ఒకపక్క ప్రభుత్వ వ్యయం పెంపు, మరో పక్క 4,500 కోట్ల పౌండ్ల పన్ను కోతలు, దాని భర్తీకి బాండ్ల జారీ ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని రుణ ఊబి లోకి నెట్టేస్తాయన్న అంచనాలకు దారీతీశాయి. వడ్డీరేట్లు పెరిగాయి. ఇంధన ధరలు ఆకాశాన్నంటి, ద్రవ్యోల్బణం పది శాతానికి ఎగబాకి, త్వరలో ఆర్థిక మాంద్యం రాబోతున్న సూచనలు కనిపిస్తున్న తరుణంలో చేసిన ఈ ప్రతిపాదనలు ఫైనాన్షియల్ మార్కెట్లను భయోత్పాతంలోకి నెట్టేశాయి. ఫలి తంగా కొత్తగా జారీచేసే బాండ్లు కొనడంమాట అటుంచి, తమదగ్గర ఉన్నవాటిని మదుపుదారులు అమ్ముకోవటం ప్రారంభించారు. ఇది బాండ్ల విలువను మింగి, పౌండ్ పతనానికి దారితీసింది. ఈ సంక్షోభాన్ని అడ్డుకోవటానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక గత్యం తరం లేదని తెలిసి మినీ బడ్జెట్ ప్రతిపాదనలు ఒక్కొక్కటే ఉపసంహరించుకోవటం ప్రారంభిం చారు. చివరకు ఆర్థికమంత్రిని సాగనంపి ఆ స్థానంలో జెరిమీ హంట్‌ను తీసుకొచ్చారు. సమస్యలను సక్రమంగా విశ్లేషించి సరైన విధానాలకు రూపకల్పన చేయటం, వాటి అమలులో ఎదురయ్యే జయాపజయాలకు తామే బాధ్యత వహించటం నాయకత్వ స్థానంలో ఉండేవారు చేయాల్సిన పని. కానీ లిజ్ ట్రస్ అలా వ్యవహరించలేకపోయారు. తన అసమర్థతనూ, చేతకాని తనాన్నీ చాటుకున్నారు. ప్రధాని పదవికి పోటీపడినప్పుడు చేసిన వాగ్దానాలను అమలుచేయటానికి తనకు సన్నిహితుడైన క్వార్టెంగ్ను ఆర్థికమంత్రిని చేసింది లిజ్ ట్రస్సే. మినీ బడ్జెట్లోని ఆయన ప్రతిపాదనలన్నీ ట్రస్ మానసపుత్రికలే. ఆర్థికమంత్రిగా ఉన్నందుకైనా క్వార్టెంగ్ ఆమె ప్రతి పాదనలకు మార్పులు, చేర్పులు చేసిన దాఖలా కనబడదు. తీరా వీటిపై వ్యతిరేకత వెల్లువెత్తేసరికి ఆయన్ను బాధ్యుణ్ణి చేసి గతవారం కేబినెట్ నుంచి తప్పించారు. పైగా ఓపక్క తన నిర్ణయాలను వెనక్కి తీసుకుంటూనే యోధురాలినని, తుదికంటా పోరాడతానని నమ్మబలికారు. ఆ వెంటనే పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు రాజీనామా చేసిన హోంమంత్రి బ్రేవర్మన్ ఉన్నమాట న్నారు. ప్రభుత్వానికి సారథ్యంవహించేవారు తప్పులు చేయలేదని బుకాయించటానికి బదులు అవి జరిగాయని నిజాయితీగా అంగీకరించటానికి సిద్ధపడాలని ఒక ఎంపీకి పొరపాటున పంపిన మెయిల్లో ఆమె వ్యాఖ్యానించారు. తన సహచరుల్లో తనపై ఎలాంటి అభిప్రాయం ఉన్నదో అర్థమయ్యాక ఇక రాజీనామా చేయటమే ఉత్తమమని ట్రస్ భావించివుండొచ్చు. పార్లమెంటులో కన్సర్వేటివ్ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉండొచ్చు. అంతమాత్రంచేత జనామోదం ఉందో లేదో తెలియని మరొకరిని పార్టీ సభ్యులు లేదా ఎంపీల అంగీకారంతో ప్రతిష్ఠించి అధికారంలో పూర్తికాలం కొనసాగాలనుకోవటం అప్రజాస్వామికం. ఇది తొలిసారి కూడా కాదు. ఒకప్పుడు ‘సహజ పాలక పక్షం’గా నీరాజనాలందుకున్న కన్సర్వేటివ్ పార్టీ ఇప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబడింది. ప్రభుత్వ నిర్ణయాలు దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాయని స్పష్టంగా తెలుస్తున్నప్పుడూ, అధికార కన్సర్వేటివ్ పార్టీ ముఠా తగాదాల్లో మునిగి మేధోశూన్యత లోకి జారిపోయిందని అర్థమవుతున్నప్పుడూ అన్ని పక్షాలూ ప్రజాతీర్పు కోరటమే పరిష్కారం.బ్రిటన్‌కు మందు -
సహకార రంగం అభివృద్ధికి కలసి పనిచేయాలి
న్యూఢిల్లీ: సహకార రంగం సమగ్రాభివృద్ధికి రాష్ట్రాలు కలసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో సహకార రంగం కీలక పాత్ర పోషించగలదన్నారు. రాష్ట్రాల సహకార శాఖల మంత్రుల రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు గురువారం ఢిల్లీలో ప్రారంభమైంది. దీనిని ఉద్దేశించి అమిత్‌షా మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లోనూ సహకార ఉద్యమం ఒకే వేగంతో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహకార రంగం కార్యకలాపాలు నిదానించిన చోట, తగ్గుముఖం పట్టిన చోట వెంటనే వాటిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకే మనకు జాతీయ సహకార విధానం కావాలన్నారు. నూతన విధానం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోపరేటివ్ రంగం సమగ్రాభివృద్ధికి తోడ్పడేలా, కొత్త విభాగాలను గుర్తించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. సహకార ఉద్యమం దక్షిణ భారత్, పశ్చిమ భారత్‌లో బలంగా ఉందన్నారు. ఉత్తర, మధ్య భారత్‌లో అభివృద్ధి దశలో ఉంటే, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా తక్కువ అభివృద్ధికి నోచుకున్నట్టు చెప్పారు. 100 ఏళ్ల లక్ష్యం.. : కోపరేటివ్ రంగం అభివృద్ధికి రాష్ట్రాలన్నీ ఒకే మార్గాన్ని, ఏకీకృత విధానాలను అనుసరించాలని అమిత్‌షా సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ వారమే 47 మంది సభ్యులతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు అధ్యక్షతన గల ఈ ప్యానెల్ సహకార రంగానికి సంబంధించి జాతీయ విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. టీమ్ ఇండియా స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలు సహకార రంగం అభివృద్ధికి కలసి పనిచేయలని అమిత్‌షా కోరారు. ‘‘మన లక్ష్యం 100 ఏళ్లుగా ఉండాలి. కోపరేటివ్‌లు దేశ ఆర్థిక రంగానికి మూలస్తంభంగా మారాలి’’అని అమిత్‌షా ఆకాంక్ష వ్యక్తం చేశారు. కోపరేటివ్ రంగం వృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలను ఆయన వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ల సంఖ్యను ఐదేళ్లలో మూడు లక్షలకు పెంచడంతోపాటు, డేటాబేస్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. -
GST: ఐదేళ్లుగా దేశమంతా ఒకే మార్కెట్
దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారి ‘జీఎస్టీ’ గురించి చర్చ జరిగింది. కానీ 2017లో మాత్రమే అది అమలులోకి రాగలిగింది. తొలుత కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా, ఐదేళ్ల తర్వాత అది శక్తిమంతమైంది. వచ్చిన ఏడాదే 63.9 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఇందులోకి మళ్లారు. 2022 నాటికి ఈ సంఖ్య రెట్టింపయింది. కీలక అంశాలపై దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయ సాధనలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషించింది. గతంలో రాష్ట్రాల మధ్య ఉనికిలో ఉంటూ వచ్చిన పన్ను మధ్యవర్తిత్వాల సమస్యను జీఎస్టీ పూర్తిగా తొలగించివేసింది. నిజంగానే జీఎస్టీ, భారతదేశాన్ని సింగిల్ మార్కెట్‌ను చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదని చెప్పడంలో ఏ సందేహమూ లేదు. భారతదేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టి జూలై 1తో అయిదేళ్లు పూర్తయింది. 2003 సంవత్సరంలో పరోక్ష పన్నులపై కేల్కర్ టాస్క్‌ఫోర్స్ నివేదికలో జీఎస్టీ గురించి తొలిసారిగా చర్చించారు. కానీ దానికి తుదిరూపు ఇవ్వడానికి చాలా కాలం పట్టింది. ప్రవేశపెట్టింది మొదలుకొని జీఎస్టీ సహజంగానే పెను సమస్యలను ఎదుర్కొంది. అయితే కోవిడ్–19 కల్లోలాన్ని ఎదుర్కొని, దాని ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత, జీఎస్టీ శక్తిమంతంగా ఆవిర్భవించింది. సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో సరిపెట్టుకోకుండా, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ మార్గంలోకి నడిపిం చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకున్నా యంటే ఆ ఘనత జీఎస్టీ కౌన్సిల్‌కే దక్కుతుంది. ఈ రకమైన పరస్పర కృషి వల్లే భారత్ ప్రపంచంలోనే అత్యంతవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు ఆవిర్భవించింది. భారత్‌లో జీఎస్టీ 2017లో అమల్లోకి వచ్చింది కానీ, చాలా దేశాలు అంతకుముందే జీఎస్టీ విధానం వైపు మళ్లాయి. కేంద్రమూ, రాష్ట్రాలూ పన్నుల మీద స్వతంత్రతను అనుభవించిన అర్ధ–సమాఖ్య వ్యవస్థ చాలాకాలంగా ఏకీకృత పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ వచ్చింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన జీఎస్టీ మండలి, భారత్‌కే ప్రత్యేకమైన జీఎస్టీ సొల్యూషన్ (ద్వంద్వ జీఎస్టీ) దీనికి సమాధానాలుగా నిలి చాయి. దేశంలో విభిన్న పరిమాణాలతో, విభిన్న అభివృద్ధి దశలతో కూడిన రాష్ట్రాలు, వాటి వారసత్వ పన్నుల వ్యవస్థను మిళితం చేసి జీఎస్టీ పరిధిలోకి తేవలసి వచ్చింది. కొన్ని మినహాయింపులతో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పన్నులను జీఎస్టీలో కలపడం జరిగింది. ఈ క్రమంలో 17 రకాల పన్ను చట్టాలను మేళవించి జీఎస్టీ ద్వారా ఏకీకృత పన్నుల వ్యవస్థను అమల్లోకి తేవడం జరిగింది. పన్ను రేట్లు, మినహాయింపులు, వాణిజ్య ప్రక్రియ, ఐటీసీ చలనం వంటి కీలక అంశాలపై జాతీయ ఏకాభిప్రాయ సాధనలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషించింది. దేశంలోని 63.9 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులు 2017 జూలైలో జీఎస్టీలోకి మళ్లారు. 2022 జూన్ నాటికి ఈ సంఖ్య రెట్టింపై 1.38 కోట్లకు చేరుకుంది. 41.53 లక్షలమంది పన్ను చెల్లింపుదారులు, 67 వేల మంది ట్రాన్స్ పోర్టర్లు ఈ–వే పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. నెలకు సగటున 7.81 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ చేస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రారం భమైంది మొదలు 292 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయి. ఇందులో 42 శాతం అంతర్రాష్ట్ర సరకుల రవాణాకు సంబంధించినవి. ఈ సంవత్సరం మే 31న ఒకేరోజు అత్యధికంగా 31,56,013 ఈ–వే బిల్స్ జనరేట్ కావడం ఒక రికార్డు. నెలవారీ సగటు వసూళ్లు కూడా 2020–21లో రూ. 1.04 లక్షల కోట్ల నుంచి, 2021–22లో రూ. 1.24 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ సంవత్సరం తొలి రెండు నెలల్లో సగటు వసూళ్లు రూ. 1.55 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ ధోరణి పెరుగుతుందని చెప్పడం హేతు పూర్వకమైన, న్యాయమైన అంచనా అవుతుంది. సీఎస్టీ, వీఎటీ వ్యవస్థలో రాష్ట్రాల మధ్య ఉనికిలో ఉంటూ వచ్చిన పన్ను మధ్యవర్తిత్వాల సమస్యను జీఎస్టీ పూర్తిగా తొలగించివేసింది. బోర్డర్ చెక్‌పోస్టులు, సరుకులు లోడ్ చేసిన ట్రక్కులను నిలబెట్టి మరీ తనిఖీ చేయడంతో కూడిన గతంలోని నియంత్రణ వ్యవస్థ కల్లోలం సృష్టించి కాలాన్నీ, ఇంధనాన్నీ వృథా చేసేది. దీంతో లాజిస్టిక్స్ వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోయింది. సరుకుల ధరలో 15 శాతం వరకూ దీని ఖర్చులే ఉండేవని అంచనా. జీఎస్టీకి మునుపటి వ్యవస్థలో అనేక సరుకులపై కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి రేట్లు 31 శాతం కంటే ఎక్కువగానే ఉండేవి. కానీ ప్రస్తుత జీఎస్టీ వ్యవస్థ కింద 400 సరకులు, 80 సేవలపై పన్నులను బాగా తగ్గించడమైనది. అత్యధికంగా 28 శాతం రేటు ఇప్పుడు విలాస వస్తువులపై మాత్రమే ఉంది. గతంలో 28 శాతం పన్ను రేటు ఉన్న 230 సరుకుల్లో సుమారు 200 సరుకులను పన్ను తక్కువగా ఉండే శ్లాబ్‌లకు మార్చడమైనది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అవసరాలను తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రధ్ద తీసుకుంది. వీటిపై పన్ను రేట్లు బాగా కుదించింది. పైగా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనం కోసం ఈ సంస్థలను సప్లయ్ చైన్స్‌తో అనుసంధానించడం జరిగింది. ఈ క్రమంలో రెండు కీలకమైన చర్యలను కేంద్రం తీసుకుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఇస్తున్న పన్ను మినహాయింపు 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు పెరిగింది. కాగా, త్రైమాసిక రిటర్న్‌లు, నెల వారీ చెల్లింపుల పథకం ప్రవేశపెట్టడంతో 89 శాతం పన్ను చెల్లింపు దారులకు ప్రయోజనం కలిగింది. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇది ఐటీ ఆధారితంగా, పూర్తి ఆటోమేటిక్ పద్ధతిలో కొనసాగుతోంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సామర్థ్యా లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నవీకరిస్తూండటం వల్ల మొత్తం వ్యవస్థను క్రియాశీలంగా ఉంచడం సాధ్యమైంది. జీఎస్టీ వ్యవహారాలపై అనేక వ్యాజ్యాలు... సమన్లు జారీ చేయడం, వ్యక్తులను అరెస్టు చేయడం, రికవరీల కోసం ఆస్తులను జప్తు చేయడంతో సహా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వంటి అంశాల పైనే వస్తున్నాయి. మోహిత్ మినరల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కూడా చాలా ప్రాచుర్యం పొందింది. కానీ జీఎస్టీలోని ప్రాథమిక అంశాలను కోర్టు పక్కన పెట్టలేదని గుర్తించాలి. దాదాపు 24 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అసీమ్ దాస్‌గుప్తా 2000 నుంచి 2011 సంవ త్సరం దాకా రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారిక గ్రూప్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. మొట్టమొదటి జీఎస్టీ చట్టాల రూపకల్పన 2009లో జరిగింది. 2017 జూలై 2న ఒక వాణిజ్య పత్రికకు అసీమ్ దాస్‌గుప్తా ఇచ్చిన ఇంటర్వ్యూలో జీఎస్టీలోని ముఖ్యమైన అంశాలను వక్కా ణించారు. ఆయన చెప్పిన అంశాలు ఇప్పటికీ మార్పు లేకుండా కొనసాగుతున్నాయి: ‘సర్వీస్ టాక్స్‌ని విధించే అధికారం రాష్ట్రాలకు అసలు ఉండేది కాదు. అందులో కేవలం భాగం పొందడమే కాదు, పన్ను విధించే అధికారం కోసం అడుగుతూనే ఉండేవి. జీఎస్టీ దానికి అవకాశం కల్పించింది.’ ఆయన ఇంకా ఇలా చెప్పారు: ‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తిపై సాధికారిక కమిటీ దృఢమైన వైఖరి తీసుకుంది. సెంట్రల్ జీఎస్టీపై పార్లమెంట్‌కూ, రాష్ట్ర జీఎస్టీపై అసెంబ్లీలకూ సిఫార్సు చేసే విభాగమే జీఎస్టీ కౌన్సిల్. సాంకేతికంగా శాసనసభ దాన్ని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. కాబట్టి శాసనసభల అధికారాన్ని ఇది తీసేసు కోవడం లేదు.’ ఇంకా ముఖ్యంగా ఆయన ఇలా అన్నారు: ‘ఇక రేట్లకు సంబంధించి చూస్తే, రాష్ట్రాలు, కేంద్రం కలిసి రెండింటికీ ఒక రకమైన ఏక పన్నును ఆమోదించాయి. కాబట్టి సహకారాత్మక సమాఖ్య ప్రయోజనం కోసం రాష్ట్రాలు, కేంద్రం పాక్షికంగా త్యాగం చేశాయని దీనర్థం. అదే సమయంలో సర్వీస్ టాక్స్ విషయంలో రాష్ట్రాలకు జీఎస్టీ అదనపు అధికారాలను ఇచ్చింది. రాష్ట్ర ప్రాంతీయ ఉత్పత్తుల్లో సగం సేవల కిందికే వస్తాయి.’ జీఎస్టీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బ్లాగులో ఇలా రాశారు: ‘అటు వినియోగ దారు, ఇటు మదింపుదారు (అసెస్సీ) ఇద్దరికీ అనుకూలంగా జీఎస్టీ ఉంటుందని రుజువైంది. పన్ను చెల్లింపుదారులు, టెక్నాలజీని అంది పుచ్చుకున్న మదింపుదారులు ఇద్దరూ చూపించిన సానుకూలతకు ధన్య వాదాలు. నిజంగానే జీఎస్టీ, భారత్‌ను సింగిల్ మార్కెట్‌ని చేసింది.’ నిర్మలా సీతారామన్ (జూలై 1 నాటికి జీఎస్టీ వచ్చి ఐదేళ్లు) వ్యాసకర్త కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
మహా పతనం.. ఒక కప్పు చాయ్ రూ.100, లీటర్ పెట్రోల్ 280, కిలో చికెన్ 1000
రావణుడి పాలనలో శ్రీలంక భోగభాగ్యాలతో తులతూగేదని చదివాం! కానీ ప్రస్తుత లంక పరిస్థితి మాత్రం ఆంజనేయుడు దహనం చేసిన తర్వాత లంక లాగా ఉంది. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి క్షీణించడంతో లంక ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరింది. కరోనాతో ప్రారంభమైన ఆర్థిక కష్టాలు ఉక్రెయిన్ యుద్ధంతో చెప్పలేనంతగా పెరిగాయి. వీటిని దాటుకొని శ్రీలంక నిలబడుతుందా? లేక దివాలా తీస్తుందా? అని ఆర్థికవేత్తలు అనుమానపడుతున్నారు. స్వాతంత్య్రానంతరం ఎన్నడూ చూడని మహా ఆర్థిక సంక్షోభం శ్రీలంకను చుట్టుముట్టింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మూలిగే నక్కపై తాటిపండు అన్నట్లు విదేశీ నిల్వలు అడుగంటి అల్లాడుతున్న శ్రీలంకలో ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. విద్యార్థుల పరీక్షలు నిర్వహించేందుకు తగిన పేపర్లు లేవని ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేయడం, పెట్రోలు కోసం క్యూలో నిలబడి ఇద్దరు సామాన్య పౌరులు చనిపోవడం లంకలో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ దుస్థితికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమని సామాన్యుల నుంచి ప్రతిపక్షం దాకా ఆరోపిస్తున్నాయి. లంక విదేశీ మారక నిల్వల్లో క్షీణత 2020 ఆగస్టు నుంచే ఆరంభమైంది. 2021 నవంబర్‌లో ఈ నిల్వలు ప్రమాదకర హెచ్చరిక స్థాయి దిగువకు చేరాయి. జనవరి 2022లో శ్రీలంక విదేశీ నిల్వలు మరింత దిగజారి 230 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. నిల్వల తరుగుదలతో ప్రభుత్వం నిత్యావసరాల దిగుమతులు చేసుకోవడానికి, అప్పులు చెల్లించడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో త్వరలో లంక డిఫాల్ట్ (ఎగవేత) దేశంగా మారే ప్రమాదం ఉందన్న భయాలు పెరిగాయి. స్వతంత్రం వచ్చినప్పటినుంచి లంక విత్తలోటుతో సతమతమవుతూనే ఉంది. 2019లో ఈస్టర్ దాడుల ప్రభావం లంక టూరిజంపై పడి విదేశీ నిధుల రాక తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం కోవిడ్ లంకను కోలుకోలేని దెబ్బ తీసింది. 2020 ఏప్రిల్, జూన్ కాలంలో కేంద్రబ్యాంకు విదేశీ నిధులను ఉపయోగించి 10 వేల కోట్ల డాలర్ల ప్రభుత్వ విదేశీ రుణాలను తీర్చింది. ఇలా ఉన్న నిధులు అప్పుల కింద చెల్లించాల్సిరావడం లంక పరిస్థితిని ఇక్కట్ల పాలు చేసింది. అన్నిటికీ కొరతే విదేశీ నిల్వల తరుగుదలకు ఇంధన ధరల పెరుగుదల తోడవడంతో దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఎక్కడ చూసినా నిత్యావసరాల కొరత కనిపిస్తోంది. వీటికి విద్యుత్ కోతలు, నీటి సరఫరా కోతలు తోడవుతున్నాయి. కిరాణా కొట్లు, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపుల ముందు భారీగా ప్రజలు క్యూ కడుతున్నారు. దేశంలో విదేశీ మారకం కొరత కారణంగా దిగుమతి దారులు బ్యాంకుల నుంచి ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పొందటం కష్టంగా మారింది. దీనివల్ల నౌకాశ్రయాల్లో కంటైనర్లు పేరుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంధన లేమితో పలు విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల వ్యవసాయానికి ఉంచిన నీటిని వాడి విద్యుదుత్పాదన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీని వల్ల తీవ్రమైన ఆహారకొరత ఎదురుకానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫార్మా రంగంలో ఔషధాల కొరత తీవ్రతరమైందని లంక ఫార్మా ఓనర్ల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంక్షోభ కారణంగా లంక రేటింగ్‌ను ఏజెన్సీలు మరింత డౌన్‌గ్రేడ్ చేసే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే ఇప్పట్లో దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్లు రావడం జరగకపోవచ్చని భయాలున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతర్గతంగా పలు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. విత్తలోటుకు కారణమయ్యే లగ్జరీ వాహనాలు, రసాయన ఎరువులు, పసుపులాంటి ఆహార వస్తువుల దిగుమతిని నిషేధించింది.దేశీయ బ్యాంకులు కుదుర్చుకునే ఫార్వార్డ్ కాంట్రాక్టులపై కేంద్ర బ్యాంకు పరిమితులు విధించింది. విదేశీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ఆకర్షణకు, చెల్లింపుల ప్రవాహం (రెమిటెన్స్ ఫ్లో– దేశంలోకి వచ్చే విదేశీ నిధులు) పెరుగుదలకు కీలక పాలసీలు ప్రకటించింది. విదేశీ సాయం లంకకు సాయం చేయడం కోసం బంగ్లా, చైనాలు కరెన్సీ స్వాపింగ్(అసలును ఒక కరెన్సీలో, వడ్డీని మరో కరెన్సీలో చెల్లించే వెసులుబాటు) సదుపాయాన్ని పొడిగించాయి. దీంతో పాటు చైనా 70 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేసింది. ఇండియా సైతం 240 కోట్ల డాలర్ల విలువైన పలు రకాల సహాయాలు ప్రకటించింది. పాకిస్తాన్ సిమెంట్, బాస్మతీ రైస్, ఔషధాల సరఫరాకు ముందుకు వచ్చింది. ఖతార్ తదితర దేశాలు కూడా తగిన సహాయం ప్రకటించాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ సాయాన్ని అంగీకరించాలంటే పలు కఠిన షరతులను లంక అంగీకరించాల్సి వస్తుంది. బెయిల్ అవుట్ లేకుండానే తాము గట్టెక్కుతామని, పరిస్థితి త్వరలో చక్కబడుతుందని లంక ప్రభుత్వం, లంక కేంద్ర బ్యాంకు (సీబీఎస్‌ఎల్) ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై అటు ఆర్థికవేత్తలు, ఇటు ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. చైనా సాయం పేరిట దేశాన్ని కబళిస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం తాజాగా ఐఎంఎఫ్‌ను సంప్రదిస్తామని ప్రకటించింది. కప్పు టీ రూ.100 ► దేశంలో టోకు ద్రవ్యోల్బణం 15.1 శాతాన్ని, ఆహార ద్రవ్యోల్బణం 25.7 శాతాన్ని తాకాయి. ఇవి ఆసియాలోనే గరిష్టం. ► వంటగ్యాస్ సిలిండర్ ధర గత అక్టోబర్‌లో 1500 రూపాయలుండగా, ప్రస్తుతం 3వేల రూపాయలకు దగ్గరలో ఉంది. ► పాల పౌడర్ ధరలు పెరగడంతో ప్రస్తుతం కప్పు టీ ధర రూ. 100కు చేరింది. ► ఒక గుడ్డు ధర రూ.35కు చేరగా, కిలో చికెన్ రూ.1,000ని తాకింది. ► లీటర్ పెట్రోల్ ధర రూ. 280ని దాటేసింది. ► లంక రూపాయి 30 శాతం క్షీణించి అమెరికా డాలర్‌తో మారకం 275కు చేరింది. ఇదీ పరిస్థితి ► గత నవంబర్‌నాటికి శ్రీలంక మొత్తం విదేశీ రుణాలు 3200 కోట్ల డాలర్లున్నాయి. ► శ్రీలంక 2021– 26 కాలంలో 2,900 కోట్ల డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. ► కరోనాకు ముందు లంక టూరిజం ఆదాయం 360 కోట్ల డాలర్లుండగా ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. ► లంకకు వచ్చే టూరిస్టుల్లో రష్యన్లు, ఉక్రేనియన్ల వాటా దాదాపు 25 శాతం. యుద్ధం కారణంగా వీరి రాక ఆగిపోయింది. ► లంక ఎగుమతుల్లో కీలకమైన తేయాకును దిగుమతి చేసుకునే దేశాల్లో రష్యా, ఉక్రేనియన్ కీలకం. ► కరోనాకు ముందు చైనా నుంచి లంకకు లక్షల్లో టూరిస్టులు వచ్చేవారు. కరోనా దెబ్బకు వీరంతా తగ్గిపోయారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది బాబు, యనమల
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ పాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థను అథోగతిపాలు చేసిన ఘనత చంద్రబాబు, యనమల రామకృష్ణుడులదేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ప్రజలంతా దసరా పండుగ హడావుడిలో ఉంటే.. చంద్రబాబు బ్యాచ్ కడుపుమంటతో ఇళ్లల్లో కూర్చుని అబద్దపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకొంటోందని విమర్శించారు. విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ రెండేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో దాదాపు రూ.4 లక్షల కోట్ల అప్పుతెచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. ఎప్పుడైనా ఒక్కపైసా పేద కుటుంబానికి సాయం చేశారా.. అని నిలదీశారు. తెచ్చిన అప్పు మొత్తాన్ని హారతి కర్పూరంలా చేసిన మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడతారా అని మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నిధులు సమకూర్చి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. అమ్మ ఒడి పాత పథకమని, టీడీపీ కూడా అమలు చేసిందని యనమల చెప్పడం సిగ్గుచేటన్నారు. ‘మీ బతుకంతా నారాయణ, చైతన్య కార్పొరేట్ కాలేజ్‌లు, వాళ్ల స్కూళ్లు బాగుచేయడమే తప్ప.. ప్రభుత్వ పాఠశాలల గురించి ఏనాడైనా ఆలోచించారా..’ అని ఎద్దేవా చేశారు. నేరాలు బయటపడతాయనే నలుగురు ఎంపీలను బీజేపీలో కలిపారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తమ ఆర్థిక నేరాలు ఎక్కడ బయటపడతాయోనని ఉన్న నలుగురు ఎంపీలను ఆ పార్టీలో కలిపేసిన మీరు ఆర్థిక నేరాల గురించి మాట్లాడతారా అని విమర్శించారు. తమ నాయకుడు ఇచ్చిన హామీ ప్రకారమే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నారని చెప్పారు. లిక్కర్‌బాబు అయ్యన్నపాత్రుడు లిక్కర్ ధర పెరుగుతోందని మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కరెంట్ సంక్షోభం రానుందని నిపుణులు సైతం చెబుతున్నారన్నారు. మన రాష్ట్రంలోనే కరెంట్ కష్టాలు ఉన్నట్లు చంద్రబాబు ప్రజలను తప్పుదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా కరెంట్ ఎక్కడ ఇచ్చారని మాట్లాడుతున్న యనమల, అయ్యన్నపాత్రుడుల కళ్లు మూసుకుపోయాయా.. అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో 1,25,791 మంది ఎస్టీ గృహ వినియోగదారులకు, 35,148 మంది ఎస్సీ గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉన్నవారికి ఉచితంగా కరెంటు ఇస్తున్నామని చెప్పారు. నీతిఆయోగ్ సైతం ఆర్బీకేలను ప్రశంసించిందన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని చెప్పారు. గతేడాది రూ.500 కోట్ల నష్టం వస్తే ప్రభుత్వం రీయింబర్స్ చేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, వైఎస్సార్సీపీ నాయకుడు జోగినాయడు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షోభంపై కరెన్సీ ముద్రణ అస్త్రం యోచన లేదు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు కోవిడ్–19 మహమ్మారి విసిరిన సవాళ్లను అధిగమించేందుకు కరెన్సీ నోట్ల ముద్రణ ప్రణాళిక ఏదీ ప్రభుత్వం దృష్టిలో లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాదానం ఇస్తూ, ‘‘నో సర్’’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనడానికి కరెన్సీ ముద్రణ జరపాలా, వద్దా అన్న అంశంపై ఆర్థికవేత్తల మధ్య తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అధిక శాతం మంది కరెన్సీ ముద్రణ సరికాదన్న అభిప్రాయంలో ఉన్నారు. మరికొన్ని అంశాలకు సంబంధించి లోక్‌సభలో ఆర్థిక మంత్రి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధాలను పరిశీలిస్తే.. ► 2020–21లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతం క్షీణించింది. మహమ్మారి దీనికి ప్రధాన కారణం. తీవ్ర ప్రతికూలతలను కట్టడి చేయడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంది. ► ఎకానమీ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, మూలాలు పటిష్టంగా ఉన్నాయి. లాక్డౌన్ ఆంక్షలు తొలగడంతో తిరిగి రికవరీ క్రియాశీలమవుతోంది. స్వావలంభన్ (ఆత్మనిర్భర్) భారత్ చర్యలు వృద్ధి పురోగతికి దోహదపడుతున్నాయి. ► స్వావలంభన్ భారత్ (ఏఎన్‌బీ) కింద ప్రభుత్వం రూ.29.87 లక్షల కోట్ల విలువైన సమగ్ర, ప్రత్యేక ఆర్థిక ఉద్దీపనను ప్రకటించింది. ► వృద్ధి విస్తృతం, పటిష్టం కావడానికి 2021–22 బడ్జెట్లో కేంద్రం పలు చర్యలను ప్రకటించింది. మూలధన వ్యయాల్లో 34.5 శాతం పెంపు, ఆరోగ్య రంగంలో కేటాయింపులు 137 శాతం పెరుగుదల వంటివి ఇందులో ఉన్నాయి. ప్రజారోగ్యం, ఉపాధి కల్పన వంటి లక్ష్యాల సాధనకు 2021 జూన్‌లో కేంద్రం రూ.6.29 లక్షల కోట్ల సహాయక ప్యాకేజ్ ప్రకటించింది. ► జీడీపీ సర్దుబాటు చేయని స్థిర ధరల వద్ద (నామినల్) 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 14.4 శాతం వృద్ధి నమోదువుతుందని 2021–22 బడ్జెట్ అంచనా. ఆర్బీఐ తాజా విశ్లేషణల ప్రకారం, వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతం. అర్బీఐ అంతక్రితం 10.5 శాతం వృద్ధి అంచనాలను 9.5 శాతానికి తగ్గించడానికి మహమ్మారి ప్రేరిత అంశాలే కారణం. ► వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)కి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా రెపో ఆపరేషన్స్సహా పలు చర్యలను ఆర్బీఐ తీసుకుంటోంది. ముఖ్యంగా లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) తగిన లిక్విడిటీ అందుబాటులో ఉండడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ► పరారైన ఆర్థిక నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారి ఆస్తులను జప్తు చేసుకుని, బాకీలన్నీ రాబట్టడానికి కేంద్రం తగిన అన్ని చర్యలు తీసుకుంటుంది. ► బ్యాంకింగ్‌లో మొండిబకాయిల సమస్యను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. లోక్‌సభలో దివాలా చట్ట సవరణ బిల్లు దివాల చట్ట సవరణ బిల్లును (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్సీ కోడ్– అమెండ్మెంట్ బిల్లు 2021) ఆర్థికమంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రుణ ఒత్తిడిలో ఉన్న లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు ప్రీ–ప్యాకేజ్డ్ రిజల్యూషన్ పక్రియ సౌలభ్యతను కల్పించడం ఈ సవరణ ప్రధాన ఉద్దేశం. ఏప్రిల్ 4న ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతారామన్ ప్రవేశపెట్టారు. రుణ చెల్లింపుల వైఫల్య పరిమితి రూ.కోటికి లోబడి ప్రీ–ప్యాకేజ్డ్ రిజల్యూషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. బిజినెస్ @ పార్లమెంటు క్యూ1 పన్ను వసూళ్లలో 86% వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (క్యూ1–ఏప్రిల్ నుంచి జూన్)లో నికర పన్ను వసూళ్లు 86 శాతం పెరిగినట్లు లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ఇందులో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2.46 లక్షల కోట్లయితే, పరోక్ష పన్నుల విషయంలో ఈ పరిమాణం రూ.3.11 లక్షల కోట్లని పేర్కొన్నారు. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (2020 ఇదే కాలంతో పోల్చి) 109 శాతంపైగా పెరిగి రూ.2,46,520 కోట్లకు పెరిగాయని తెలిపారు. నికర పరోక్ష పన్నుల విషయంలో పెరుగుదల 70 శాతం ఉందని వివరించారు. ఇన్ఫోసిస్‌కు ఇప్పటికి రూ.164.5 కోట్లు కొత్త ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్ పోర్టల్ అభివృద్ధికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కేంద్రం ఇప్పటికి రూ.164.5 కోట్లు చెల్లించిందని పంకజ్ చౌదరి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2019 జనవరి నుంచి జూన్ 2021 మధ్య ఈ చెల్లింపులు జరిపినట్లు వివరించారు. ఆర్థికశాఖ సహాయమంత్రి పేర్కొన్న వివరాల ప్రకారం రూ.4,242 కోట్ల ఈ ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది. నిర్వహణ, జీఎస్టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 7న పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే కొన్ని సాంకేతిక లోపాలను పన్ను చెల్లింపుదారులు, వృతి నిపుణులు, సంబంధిత వ్యక్తులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నిరంతర పరిష్కారానికి ఇన్ఫోసిస్ పనిచేస్తోంది. రూ.8.34 లక్షల కోట్లకు తగ్గిన ఎన్పీఏలు మొండిబకాయిల (ఎన్పీఏ) భారం 2021 మార్చి చివరికి రూ.61,180 కోట్లు తగ్గి రూ.8.34 లక్షల కోట్లకు దిగివచ్చినట్లు లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కే కరాద్ తెలిపారు. 2020 మార్చి ముగింపునకు ఎన్పీఏల భారం రూ.8.96 లక్షల కోట్లని వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గడానికి కారణమని వివరించారు. మరో ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, 2018 మార్చి 31వ తేదీ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.8,95,601 కోట్లని వివరించారు. -
భారత్ జీడీపీ వృద్ధి 7 శాతం!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2021–22లో 7 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి అంచనా వేసింది. ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఐక్యరాజ్యసమితి కమిషన్ (యూఎన్ఈఎస్సీఏపీ) మంగళవారం విడుదల చేసిన తన సర్వే ఆధారిత నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... 1. మహమ్మారి భారత్ వ్యాపార క్రియాశీలతను తీవ్రంగా దెబ్బతీసింది. దీనితో 2020–21లో ఆర్థిక వ్యవస్థ 7.7% క్షీణిస్తుంది. బేస్ ఎఫెక్ట్‌సహా ఆర్థిక క్రియాశీలత మళ్లీ ప్రారంభం కావడంతో 2021–22లో వృద్ధి రేటు 7%గా ఉండే వీలుంది. 2. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15–మే 3, మే 4–మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు ఆర్థిక సంవత్సరం మొదటి, రెండు త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొ లగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊ పందుకోవడంతో మూడో త్రైమాసికంలో స్వల్ప వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలోనూ దాదాపు ఇదే స్థాయి వృద్ధి రేటు నమోదుకావచ్చు. 3. కేంద్ర రుణ సమీకరణలకు సంబంధించి వడ్డీ వ్యయాలను తక్కువ స్థాయిలో ఉంచడం, బ్యాంకింగ్ మొండిబకాయిల తీవ్రతను అందుపులో ఉంచడం దేశం ముందు ఉన్న ప్రస్తుత పెద్ద సవాళ్లు. 4. వర్ధమాన ఆసియా–పసిఫిక్ దేశాల సగటు వృద్ధిరేటు 2021లో 5.9 శాతం ఉండే వీలుంది. 2022లో ఇది 5 శాతానికి తగ్గవచ్చు. 2020లో ఆయా దేశాల ఉత్పత్తి రేటు 1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. 5. బేస్ ఎఫెక్ట్ వల్ల 2021లో భారీ వృద్ధి రేటు (వీ నమూనా) కనిపించినప్పటికీ, తిరిగి ఎకానమీ ‘కే’ నమూనా రికవరీగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. పలు పరిశ్రమలు, వ్యక్తులకు సంబంధించి రికవరీ రేటు విస్తృత ప్రాతిపదికన, ఏకరీతిన కాకుండా విభిన్నంగా ఉండే అవకాశం ఉంది. 6. ఆసియా, పసిఫిక్ దేశాలు కేవలం వృద్ధిమీదే దృష్టి పెడుతున్నాయి తప్ప, ఉపాధి కల్పన, సంక్షోభాలను తట్టుకుని నిలబడ్డానికి చర్యలు వంటి అంశాలపై శ్రద్ధ పెట్టడం లేదు. మహమ్మారి వల్ల ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో దాదాపు 8.9 కోట్ల మంది తీవ్ర పేదరికంలో పడిపోయారు. వారు రోజుకు కేవలం 1.90 డాలర్లు (రూ.145కన్నా తక్కువ) సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయారు. 7. వృద్ధి ప్రణాళికల్లో ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు వంటి అంశాలకూ ప్రాధాన్యత ఇవ్వాలి. వర్ధమాన దేశాల్లో సైతం దిగువన ఉన్న ఎకానమీలకు అంతర్జాతీయ సహకారం అందాలి. కోవిడ్‌ను ఎదుర్కొనడంలో చైనా పటిష్ట చర్యలు తీసుకుంది. ఈ కారణంగానే 2020 నాల్గవ త్రైమాసికంలో 6.5% వృద్ధిని సాధించగలిగింది. చైనా రిక వరీ మున్ముందూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. -
ఆర్బీఐ హెచ్చరిక
కరోనా వైరస్ మహమ్మారి పర్యవసానాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా వుంటాయని కొన్నాళ్లుగా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. తాజా రిజర్వ్‌బ్యాంక్(ఆర్బీఐ) వార్షిక నివేదిక సైతం దాన్నే ధ్రువీ కరించింది. దీని తాకిడి ఆర్థిక రంగంపై ఎలా వుండబోతున్నదో ఆ నివేదిక నిర్దిష్టమైన అంచనా లివ్వకపోయినా భవిష్యత్తు ఎలా వుంటుందో స్థూలంగా తెలియజేసింది. విస్తృతమైన, లోతైన సంస్క రణలు తీసుకురానట్టయితే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడటం కష్టమని చెప్పింది. ఆర్బీఐ వార్షిక నివేదిక ఏటా జూన్‌తో మొదలై మరుసటి సంవత్సరం జూలై వరకూ వున్న ఆర్థిక చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. 2019–20 సంవత్సరానికి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం ఆర్బీఐ ఆదాయం రూ. 41 లక్షల కోట్ల నుంచి 53.3 లక్షల కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదల 28.97 శాతం. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులు 18.4 శాతం, 27.3 శాతం చొప్పున పెరిగాయని నివేదిక వివరించింది. అయితే ఈ పెట్టుబడుల్లో అత్యధిక భాగం కరోనా మహమ్మారి విరుచుకుపడటానికి ముందునాటివని అను కోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన లాక్డౌన్ వల్ల దేశంలో సమస్త కార్యకలాపాలూ స్తంభించి పోయాయి. అన్ని రంగాలూ తీవ్ర నష్టాలు చవిచూశాయి. మే నెలలో లాక్డౌన్ సడలింపులు మొదలు కావడం, కొన్ని రంగాల కార్యకలాపాలకు పాక్షికంగా అనుమతి లభించడంతో క్రమేపీ అంతా చక్కబడొచ్చని ఆశించినవారు కూడా లేకపోలేదు. కానీ స్థానికంగా వున్న పరిస్థితుల కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు యధావిధిగా కొనసాగాయి. సడలింపులు అమలైనచోట్ల కూడా ఎన్నో పరి మితులు అమలయ్యాయి. కనుకనే మే, జూన్ నెలల్లో ఆశించిన రీతిలో వాణిజ్యరంగం మెరుగు కాలేదు. ఇందుకు కారణం సాధారణ ప్రజానీకంలో రేపటిపై ముసురుకున్న సందేహాలే. ఒకపక్క కరోనా తీవ్రత సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశాలు కనబడకపోవడం, లాక్డౌన్ సమయంలో ఎదుర్కొన్న అవస్థలు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. కనుకనే వినియోగం గణనీయంగా పడి పోయింది. ఉపాధి దెబ్బతినడం, జీతాలు తగ్గడం వంటి భయాలున్నప్పుడు తప్పనిసరి అవసరాలకు తప్ప ఇతరత్రా ఖర్చులకు ఎవరూ సిద్ధపడలేరు. మార్కెట్లో వినియోగం సరిగా లేదనుకున్నప్పుడు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో మదుపు చేయదల్చుకున్నవారు వెనక్కి తగ్గుతారు. ఇప్పుడు జరిగింది అదే. ఈ పరిస్థితిని ఆర్బీఐ సక్రమంగానే చూపింది. ఇది 2020–21 రెండో త్రైమాసికం వరకూ కొనసాగే అవకాశం వుందని అంచనా వేసింది. కరోనా ప్రభావంతో మనం మాత్రమే కాదు... ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనుకనే ఆర్బీఐ వార్షిక నివేదిక ఏం చెబుతుందోనని అందరూ ఆసక్తిగా చూశారు. ఊహించినట్టే అది నిరాశాజనకమైన అంచనాలే ఇచ్చింది. 2008నాటి ఆర్థిక మాంద్యంతో ప్రస్తుత స్థితిని పోల్చలేమని, అప్పట్లో అంతర్జాతీయంగా ఆస్తుల విలువలు మాత్రమే క్షీణించాయని నివేదిక తెలిపింది. కానీ ప్రస్తుత సంక్షోభం మొత్తం మానవాళిపై, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూప గలదని వివరించింది. కేంద్రం ఆర్థిక రంగంలో భారీ సంస్కరణలు తెస్తేనే పరిస్థితి మెరుగవుతుందని సూచించింది. జీఎస్టీని సరళతరం చేయడం మొదలుకొని ఉక్కు, బొగ్గు, విద్యుత్, రైల్వే తదితర రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెంచాలని ప్రతిపాదించింది. అయితే ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆచరణ సాధ్యమేనా? అందుకు బదులు ఉద్యోగ కల్పన కోసం భిన్నరంగాలకు పెద్ద యెత్తున నేరుగా సాయం అందజేయగలిగితే పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజు కోవడానికి కేంద్రం ఇప్పటికే రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించినమాట వాస్తవమే. ఆ ప్యాకేజీ వివరాలను దశలవారీగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే ఆ పేరిట తీసుకున్న చర్యల్లో అత్యధికం బ్యాంకు రుణాల మంజూరే. ఉదాహరణకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమల్లో వంద కోట్ల టర్నోవర్ దాటిన యూనిట్లకు ఏ హామీ చూపకుండా నేరుగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే సౌకర్యం కల్పించారు. ఈ రుణాలు నాలుగేళ్ల వ్యవధిలో చెల్లించేందుకు, తొలి ఏడాది అసలు, వడ్డీ చెల్లింపులపై మినహాయింపులిచ్చే వెసులుబాటు ఇచ్చారు. అలాగే వ్యవసాయం, గృహనిర్మాణం, రియల్ఎస్టేట్, నాన్ ఫైనాన్సింగ్ రంగాలకు ఊతమిచ్చేందుకు... నిరుపేదలు, వలస కార్మికులు తదితరులకు కూడా వివిధ చర్యలు ప్రకటించారు. కానీ మార్కెట్లో వినియోగం బాగుందనుకుంటేనే ఎవరైనా ముందుకు కదులుతారు. ఆ పరిస్థితి లేదనుకున్నప్పుడుబ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, పెట్టుబడులు పెట్టే సాహసం ఎవరూ చేయరు. వినియోగం పెరగాలంటే ప్రజల చేతుల్లో ఏదో మేర డబ్బుండాలి. ఆ పరిస్థితి లేకపోబట్టే రుణాలు తీసుకోవడానికి అటు ఎంఎస్ఎంఈలు జంకితే, ఎలాంటి హామీ లేకుండా ఇవ్వడానికి బ్యాంకులు సందేహించాయి. మే నెలలో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే జూలై నాటికి బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు రూ. 1.20 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలి పింది. వాస్తవానికి ఈ మంజూరైన రుణాల్లో గత నెల వరకూ తీసుకున్న మొత్తం దాదాపు రూ. 62,000 కోట్లు మాత్రమే. ఆర్బీఐ లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మెరుగ్గా వుంది. ఉపాధి హామీ పథకం, గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ వంటివి అందుకు దోహద పడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో అలా నిరుపేదలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలు పెద్దగా లేవు. దానికి తోడు రవాణా, ఆతిథ్య రంగం, వినోదం వగైరా రంగాలు నిలిచిపోవడంతో వాటిపై ఆధారపడి జీవనం సాగించే లక్షలాదిమంది పరిస్థితి అయోమయంలో పడింది. ఆ రంగాల్లో గణనీయమైన సంఖ్యలో ఉపాధి అవకాశాలు మాయమయ్యాయి. కేంద్రం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని, పరి స్థితిని సమీక్షించి భిన్న రంగాల్లో దెబ్బతిన్నవారిని ఆదుకోవడానికి మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిం చడం అవసరం. -
చైనా శకం ముగిసింది!
గతమెంతో ఘనకీర్తి..?! భవిష్యత్తులో చైనా ఇదేవిధంగా చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందేమో. పిన్ను నుంచి పెద్ద యంత్రం వరకు ఏ ఉత్పత్తిని అయినా తయారు చేయగలదు చైనా. అందుకే అంత వేగంగా ఎదిగి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలిగింది. కానీ, కరోనాతో, అమెరికాతో వాణిజ్య కయ్యం కారణంగా చైనా పరిస్థితి మారిపోనుందని నిపుణులు, పారిశ్రామికవేత్తల మాటలను పరిశీలిస్తే అర్థమైపోతోంది. ‘ప్రపంచానికి పరిశ్రమగా చైనా రోజులు ముగిసినట్టే’.. ఈ విధంగా వ్యాఖ్యానించింది ఫాక్స్ కాన్ బాస్ యంగ్ లీ. (3 కోట్లు దాటిన పరీక్షలు) దీనికి కారణంగా ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం)ను ఆయన పేర్కొన్నారు. యాపిల్ ఐఫోన్ల నుంచి, డెల్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ తయారీ కేంద్రం చైనాయే. యాపిల్ కు ప్రధాన తయారీ భాగస్వాముల్లో ఒకటైన ఫాక్స్ కాన్తోపాటు చైనా కేంద్రంగా విస్తరించిన డజను వరకు టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు చైనా బయట వైపునకు చూస్తున్నాయి. చైనా మార్కెట్ కు, యూఎస్ మార్కెట్‌కు సరఫరా వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను మారిన పరిస్థితుల్లో అవి అవగతం చేసుకున్నాయి. చైనా బయట క్రమంగా మరింత తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ (ఫాక్స్ కాన్ గా ట్రేడయ్యే సంస్థ) చైర్మన్ యుంగ్ లీ తెలిపారు. ప్రస్తుతానికి మొత్తం తయారీ సామర్థ్యంలో 30 శాతం చైనా బయట ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. గతేడాది జూన్ నాటికి ఇది 25 శాతమే. ఏడాదిలో చైనా వెలుపల 5 శాతం తయారీని పెంచుకున్న ఈ సంస్థ.. భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకునే ప్రణాళికలతో ఉంది. చైనాలో తయారై అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై పెరిగే టారిఫ్‌ల భారం పడకుండా ఉండేందుకు గాను ఫాక్స్ కాన్ సంస్థ భారత్, ఆగ్నేయాసియా, ఇతర ప్రాంతాలకు తయారీని తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కంపెనీ ఫలితాల ప్రకటన సందర్భంగా యంగ్ లీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘‘భారత్ లేదా ఆగ్నేయాసియా లేదా అమెరికా.. ఏదైనా సరే ఆయా ప్రాంతాల్లో తయారీ ఎకోసిస్టమ్ ఉంది’’ అని లీ పేర్కొన్నారు. అయితే, ఫాక్స్ కాన్ తయారీలో చైనా ఇక ముందూ కీలకపాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాకపోతే ప్రపంచానికి తయారీ కేంద్రంగా చైనా దశకం ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. భారత్‌లో ఫాక్స్ కాన్ విస్తరణ అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా బయట కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అవసరమైతే యాపిల్ ఉత్పత్తులను పూర్తిగా చైనా బయట తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యంగ్ లీ గతేడాదే ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. దీర్ఘకాలంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటు కావడం తథ్యమని లీ మాటలతో స్పష్టమవుతోంది. ఫాక్స్‌కాన్‌కు మన దేశంలోనూ తయారీ కేంద్రాలున్నాయి. మరిన్ని పెట్టుబడులతో సామర్థ్య విస్తరణ చేయనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది కూడా. భారత్‌లో తయారీకి అమెరికాకు చెందిన యాపిల్ ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అమెరికాకు సరఫరా చేసే ఉత్పత్తుల తయారీకి భారత్ ను ప్రధానంగా ఫాక్స్ కాన్ పరిశీలిస్తుండడం గమనార్హం. యాపిల్ ఐపాడ్, మ్యాక్ ఉత్పత్తులకు డిమాండ్ కారణంగా ఫాక్స్ కాన్ జూన్ క్వార్టర్ లో 5,835 కోట్ల భారీ లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ తైవాన్‌కు చెందినది. టెన్సెంట్ హోల్డింగ్స్‌కు చెందిన వీచాట్ వినియోగాన్ని అమెరికా పౌరులు వినియోగించకుండా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా యాపిల్ తన యాప్ స్టోర్ నుంచి వీచాట్ యాప్ ను తొలగించినట్టయితే వార్షికంగా ఐఫోన్ల ఎగుమతులు 25–30% పడిపోవచ్చనేది టీఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అంచనా. పోటీతత్వంతో స్వావలంబన భారత్ భారత్ తన అవసరాలను దేశీయంగా తీర్చుకునేందుకు (ఆత్మ నిర్భర్) దేశీయ పరిశ్రమ కచ్చితంగా మరింత పోటీనిచ్చే విధంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంబిస్తున్న తరుణంలో.. భారత్ కూడా తన అవసరాలకు తనపైనే ఆధారపడాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛాయుత మార్కెట్ కలిగిన అమెరికా సైతం రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్న విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. కనుక రానున్న రోజుల్లో ఆత్మ నిర్భర్‌కు మరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ‘‘మన పరిశ్రమలను మరింత పోటీయుతంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోటీతత్వం మన పరిశ్రమల సమర్థతను పెంచుతుంది. ఆ పోటీయే మనకు మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు, ఉద్యోగ కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధానాలను అమలు చేసినట్టు ప్రభు చెప్పారు. దేశాన్ని మరింత సౌభాగ్యంగా మార్చేందుకే ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ పిలుపునిచ్చినట్టు చెప్పారు. -
ప్రధానిగా మోదీకి డిస్టింక్షన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగులేని ప్రజాదరణ ఉందని మరోసారి తేలింది. ప్రధానిగా మోదీనే అత్యుత్తమం అని ‘ఇండియా టుడే – కార్వీ ఇన్సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే తాజాగా తేల్చింది. ప్రధానిగా మోదీ పనితీరు అద్భుతంగా ఉందని సర్వేలో పాల్గొన్నవారిలో 30% మంది, బావుందని 48%, సాధారణంగా ఉందని 17% అభిప్రాయపడ్డారు. 5% మాత్రం మోదీ పనితీరు బాగాలేదన్నారు. ఒకవైపు, దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా, మరోవైపు, దేశ ఆర్థిక రంగ కుంగుబాటు, ఇంకోవైపు చైనాతో తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న క్లిష్ట సమయంలో జరిగిన ఈ సర్వేలో.. దేశ ప్రజలు మోదీపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. ఫిబ్రవరి 2016 – ఆగస్టు 2020 మధ్య నిర్వహించిన 10 సర్వేలను పోలిస్తే.. మోదీకి ప్రజాదరణ గణనీయంగా పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానమంత్రిగా మోదీని ప్రజలు డిస్టింక్షన్లో పాస్ చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి çఏడాదైన విషయం తెలిసిందే. మోదీ ప్రజాదరణ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో అత్యధికంగా(4 పాయింట్ స్కేల్‌పై 3.14గా) ఉంది. ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తర భారతంలో 4 పాయింట్ స్కేల్‌పై 3.01గా, తూర్పు భారత్‌లో 3.02గా, దక్షిణ భారతంలో 2.99గా ఉంది. మతాల వారీగా చూస్తే హిందువుల్లో 3.13, ముస్లింల్లో 2.33 గా మోదీపై ప్రజాదరణ ఉంది. కులాలవారీగా మోదీ ఓబీసీ, ఎంబీసీల్లో అత్యధికంగా 3.08, దళితుల్లో 3.01, అగ్రవర్ణాల్లో 2.99 స్కోరు సాధించడం గమనార్హం. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పనితీరు చాలా బావుందని కేవలం 9% మంది అభిప్రాయపడగా, బావుందని 35%, సాధారణమని 32%, బాగాలేదని 21% మంది తెలిపారు. కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకురాగలిగే నేత రాహుల్ గాంధీయేనని 23% మంది పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రియాంకాగాంధీకి 14%, మన్మోహన్ సింగ్‌కు 18%, సోనియా గాంధీకి 14% మంది ఓటేశారు. సర్వే లోని ఇతర ముఖ్యాంశాలు.. ► కరోనా తమను తీవ్రంగా దెబ్బతీసిందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఆదాయం పూర్తిగా పడిపోయిందని 63%, ఉద్యోగం/వ్యాపారం పోయిందని 22%, పెద్దగా మార్పేమీ లేదన్న వారు 15%. ► ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమికి 316 సీట్లు..కాంగ్రెస్ కూటమికి 93, ఇతరులకు 134 సీట్లు వస్తాయి. ► మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు పనితీరు చాలా బావుందని 24%, బావుందని 48%, సంతృప్తి కానీ, అసంతృప్తి కానీ లేదని 19%, అసంతృప్తి అని 8%, ఏమీ చెప్పలేమని 1% చెప్పారు. ► మోదీ ప్రభుత్వ అతిపెద్ద విజయం జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అని 16%, రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు అని 13% అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతిరహిత పాలన అని 9%, మౌలిక వసతుల వృద్ధి అని 11% అభిప్రాయపడ్డారు. ► కరోనాను సరిగ్గా నియంత్రించలేకపోవడం మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యమని 25%, నిరుద్యోగమని 23%, వలస కార్మికుల సంక్షోభమని 14% మంది తెలిపారు. ► ఆర్థిక రంగ పునరుత్తేజానికి కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ తమ ఆర్థిక స్థితిగతులను మారుస్తుందని 55% మంది విశ్వాసం వ్యక్తం చేయడం విశేషం. ► లాక్‌డౌన్‌తో ప్రభుత్వం చెప్పినట్లు లక్షలాది ప్రాణాలు నిలిచాయన్నది వాస్తవమని 34% మంది తెలిపారు. ఆర్థిక తిరోగమనానికి దారి తీసిందని 25%..ఆర్థిక తిరోగమనానికి దారితీసినా ఎక్కువ ప్రాణాలు కాపాడిందని 38% మంది చెప్పారు. ► వలస కార్మికుల దుస్థితికి బాధ్యులు.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అని 43%, రాష్ట్ర ప్రభుత్వాలు అని 14%, యాజమాన్యాలు అని 13%, సరైన సమాచారం లేకపోవడం అని 12%, కేంద్రం అని 10%, చెప్పలేమని 8% మంది చెప్పారు. ► తూర్పు లద్దాఖ్‌లో చైనాకు సరైన గుణపాఠం చెప్పిందని 69%, సరిగ్గా వ్యవహరించలేదని 15%, ప్రభుత్వం సమాచారం దాచి పెట్టిందని 10% తెలిపారు. ► చైనా వస్తువుల బహిష్కరణకు 90 శాతం మంది మద్దతు పలికారు. 7 శాతం మంది నో అన్నారు. చైనా యాప్స్‌ను నిషేధించడం, కాంట్రాక్టులు రద్దు చేయడం సరైన విధానమేనని 91% స్పష్టం చేశారు. ► కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ పనితీరు అత్యుత్తమంగా ఉందని 8%, బావుందని 33%, యావరేజ్ అని 35%, బాగాలేదని 20% మంది చెప్పారు. ► పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతిస్తామని 50% మంది స్పష్టం చేశారు. బెస్ట్ పీఎం మోదీయే.. అత్యుత్తమ భారత ప్రధాని ఎవరన్న ప్రశ్నకు.. 44% మోదీకి, 14% వాజ్‌పేయికి, 12% ఇందిరా గాంధీకి, 7% నెహ్రూకి, 7% మంది మన్మోహన్‌కు ఓటేశారు. తదుపరి ప్రధానిగా 66% మోదీనే ఎన్నుకున్నారు. 8% రాహుల్‌కి, 5% సోనియాకి, 4% అమిత్‌షాకు ఓటేశారు. -
వందేళ్లలో ఘోర సంక్షోభమిది
ముంబై: ఆర్థికంగా, ఆరోగ్య పరంగా గడిచిన వందేళ్లలో ప్రపంచం ఎన్నడూ ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కోలేదని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కోవిడ్‌తో ఉద్యోగాలు, ఉత్పత్తి, సంక్షేమం వంటి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఎన్నెన్నో సంక్షోభాలను తట్టుకుని నిలిచిన భారత ఆర్థి క, ద్రవ్య వ్యవస్థలకు ఇది అత్యంత విషమ పరీక్ష’ అన్నారాయన. శనివారమిక్కడ ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ కాన్క్లేవ్లో దాస్ మాట్లాడారు. దేశ ద్రవ్య వ్యవస్థను చక్కదిద్దడానికి ఆర్బీఐ ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు ఫలితాలనిస్తున్నాయన్నారు. లాక్‌డౌన్‌లోను, తదనంతరం కూడా ఆర్థిక వృద్ధి క్షీణించిందని, ఫలితంగా బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగాయని దాస్ చెప్పారు. బ్యాంకుల మూలధనం క్షీణించిందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్ పథకం అమలు చేయాల్సి ఉందన్నారు. అన్‌లాక్ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. పరిశ్రమ మెరుగ్గా స్పందించింది ‘ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విశ్వాసాన్ని పెంపొందించడం, వృద్ధిని పునరుద్ధరించడం ఆర్బీఐ తక్షణ కర్తవ్యాలు. నిజానికి సంక్షోభ సమయంలో భారతీయ పారిశ్రామిక రంగం, సంస్థలు మెరుగైన రీతిలో స్పందించాయి. చెల్లింపు వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు ఎలాంటి ఆటుపోట్లకు గురికాకుండా నిలిచాయి’ అని దాస్ వ్యాఖ్యానించారు. సప్లయ్ చెయిన్ పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది? డిమాండ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేదెప్పుడు? ఆర్థికాభివృద్ధిపై కరోనా ప్రభావం ఎలా ఉండనుంది వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేదన్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షిస్తూ.. బ్యాంకింగ్ వ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులకూ లోను కాకుండా చూస్తూ.. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు ఆర్బీఐ కృషి చేస్తోందన్నారు. ఫైనాన్షియల్ రంగం మాత్రం ఆంక్షల సడలింపుల కోసం ఎదురు చూడకుండానే తిరిగి మామూలు స్థితికి రావాల్సిన అవసరముందని చెప్పారు. రిజల్యూషన్ కార్పొరేషన్.. ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక సంస్థలతో వ్యవహరించడానికి చట్టబద్ధత కలిగిన ’రిజల్యూషన్ కార్పొరేషన్’ అవసరమని శక్తికాంత దాస్ చెప్పారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో ఆయా సంస్థలను ముందుగానే గుర్తించి హెచ్చరిండానికి, వీలైతే పునరుద్ధరించడానికి వీలుంటుందన్నారు. ‘దీని ఏర్పాటుతో పాటు ఇతర నిబంధనలతో కూడిన ఫైనాన్షియల్ రిజొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్(ఎఫ్ఆర్డీఐ) బిల్లును ప్రభుత్వం 2017లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే, డిపాజిటర్ల డబ్బు కు రక్షణ ఉండదంటూ వ్యతిరేకత వ్యక్తం కావడంతో దాన్ని వెనక్కి తీసుకుంది’ అని వివరించారు. కానీ రిజల్యూషన్ కార్పొరేషన్ అవసరం చాలా ఉందన్నారు. -
మౌలిక రంగానికి కరోనా సెగ..
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందన్న అంశాన్ని తాజాగా వెలువడిన మార్చి మౌలిక రంగం గణాంకాలు వెల్లడించాయి. ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి మార్చిలో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా –6.5 క్షీణతలోకి జారిపోయింది. తాజా గణాంకాలను గురువారం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఎనిమిది రంగాలనూ పరిశీలిస్తే... ► క్రూడ్ ఆయిల్ (–5.5 శాతం), సహజ వాయువు (–15.2 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–0.5%), ఎరువులు (–11.9%) స్టీల్ (–13 శాతం), సిమెంట్ (–24.7%), విద్యుత్ (–7.2 శాతం) రంగాలు క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. ► ఇక బొగ్గు ఉత్పత్తి వృద్ధిలోనే ఉన్నా, ఈ రేటు 9.1 శాతం నుంచి 4.1 శాతానికి పడింది. ఏప్రిల్–మార్చి 0.6 శాతం: 2019 మార్చిలో ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 5.8%. ఈ ఏడాది ఫిబ్రవరిలో 7 శాతం వృద్ధి చోటుచేసుకుంది. ఇక 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు కేవలం 0.6%గా నమోదయ్యింది. 2018–19లో ఈ రేటు 4.4%. వృద్ధికి మౌలికం కీలకం: ఆర్థికశాఖ టాస్క్‌ఫోర్స్ ఇదిలావుండగా, భారత్ వృద్ధికి, 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడానికి మౌలిక రంగం అభివృద్ధి కీలకమని ఆర్థికమంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఒక టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు తుది నివేదికను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించింది. మౌలిక రంగంలో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి ప్రయత్నం, కొత్తప్రాజెక్టులు చేపట్టడం వృద్ధికి కీలకమని అభిప్రాయపడింది. 2019–20 నుంచి 2024–25 మధ్య మౌలిక రంగంలో దాదాపు రూ.111 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని విశ్లేషణలను ప్రస్తావించింది. మౌలిక రంగం పర్యవేక్షణ, అమలు, నిధుల సమీకరణ విషయంలో దృష్టి పెట్టడానికి మూడు వేర్వేరు గ్రూపులను ఏర్పాటు చేయాలని టాస్క్‌ఫోర్స్ సూచించింది. -
కరోనా, క్యూ4 ఫలితాలు కీలకం
న్యూఢిల్లీ: కరోనా కేసులు, కంపెనీల క్యూ4 ఫలితాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపే కీలకాంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీని సిద్ధం చేస్తోందన్న ఆశలు ఉన్నాయి. మరోవైపు నేటి నుంచి లాక్డౌన్ దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలించే అవకాశాలున్నాయని, ఆర్థిక కార్యకలాపాలు మెల్లమెల్లగా ఆరంభమవుతాయనే అంచనాలు మార్కెట్లో సెంటిమెంట్‌కు జోష్‌నివ్వవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, డాలర్‌తో రూపాయి మారకం విలువ గమనం, ముడి చమురు ధరల కదలికలు, విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి.. ఈ అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. ఇక ఈ వారంలో ఇన్ఫోసిస్, ఏసీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్, అలెంబిక్ ఫార్మా, మైండ్‌ట్రీ తదితర కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. కాగా, కరోనా వైరస్ ప్రభావం తమ వ్యాపారాలపై ఎలా ఉండనున్నదనే విషయమై కంపెనీలు వెల్లడించే అంచనాలపైననే ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారిస్తారన్న విశ్లేషణలు ఉన్నాయి. బోర్డ్ మీటింగ్స్ ఇన్ఫోసిస్, టాటా ఎలెక్సీ, ఆదిత్య బిర్లా మనీ, లిండే ఇండియా 2 గంటల్లో సెటిల్ చేయండి ఆరోగ్య బీమా క్లెయిమ్‌లపై ఐఆర్డీఏఐ ఆదేశం న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల విషయంలో రెండు గంటల్లో నిర్ణయం తీసుకోవాలని బీమా కంపెనీలను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్డీఏఐ ఆదేశించింది. కరోనా వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఐఆర్డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా సెటిల్ చేయాలని బీమా సంస్ధలకు ఐఆర్డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆథరైజేషన్ రిక్వెస్ట్ అందిన రెండు గంటలలోపు సంబంధిత(నెట్వర్క్) హాస్పిటల్‌కు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్కు ఆమోదం తెలుపుతూ సమాచారమివ్వాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. -
కంటే కలలే కనాలి
మధ్యతరగతి జీవితానికి జీతం సరిపోదు.అయితే అరకొరా... ఇల్లాలి కొరకొరా.వనరులు పెంచుకోవాలంటే స్టార్స్ కనిపిస్తాయి.ఇక పెంచుకోదగ్గది... అలా పెంచుకునే వీలైనది ఒక్కటే ఒకటి... ఆశ.చుట్టూ కష్టాలు కనపడుతుంటే ఏం ఆశించగలం?అందుకే ఒక కునుకు తీయండి. ఒక కల కనండి. 1990ల కాలం అంటే అప్పటికి ఇందిరా గాంధీ చనిపోయింది. రాజీవ్‌గాంధీ ఓడిపోయాడు. వి.పి.సింగ్, అతని తర్వాత చంద్రశేఖర్... వీరి పాలనలో దేశం ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి వెనుకబడిన వర్గాల అభ్యున్నతి గురించి చర్చలు జరుగుతున్నాయి. కాని అవకాశాలు ఎక్కడా లేవు. సంపద లేదు. సామాన్యుడు సూపర్‌స్టార్ అవడానికి వీలయ్యే పరిస్థితులు లేవు. సగటు మగాడి జీవితం జానా బెత్తెడుగా ఉంది. ఏదో ఒక పని చేయడం, భార్యాపిల్లలను పోషించుకోవడం, రాత్రిళ్లు ముడుచుకుని పడుకోవడం... పెద్ద పెద్ద కలలు కనేందుకు కూడా ఎవరూ సాహసం చేయని పరిస్థితి (దేశంలో 2000 సంవత్సరం తర్వాత ఆర్థిక సరళీకరణల ఫలితంగా ధనం అందుబాటులోకి రావడం, సాఫ్ట్వేర్ రంగం ఊపందుకోవడం, ఆ తర్వాతి కాలంలో అబ్దుల్ కలామ్ లాంటి వాళ్లు వచ్చి కలలు కనండి అని పిలుపు ఇవ్వడం మనకు తెలుసు. కాని 1990ల నాటికి కలలు కనడం కూడా ఖరీదైన వ్యవహారమే).ఇటువంటి సమయంలో దూరదర్శన్‌లో వచ్చిన ‘ముంగేరిలాల్ కే హసీన్ సప్నే’ సీరియల్ జనం తమ కష్టాలను కాసేపు నవ్వుకుని మర్చిపోయే వీలు కల్పించినట్టే చాలామంది సామాన్యులను మీకు కష్టాలు చుట్టుముడితే కళ్లు మూసుకొని కలల్లోకి వెళ్లండి... అక్కడైనా వాటిని తీర్చుకుని సేద తీరండి అని చెప్పింది.ఈ సీరియల్ ‘ముంగేరిలాల్’గా చేసిన రఘువీర్ యాదవ్ ట్రిపుల్ ఎం.ఏ చేశాడు. కాని ఉద్యోగం రాదు. అతడికి పిల్లనిచ్చిన మావ ఢిల్లీలో రికమండేషన్ చేసి ఏదో ప్రయివేటు కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంచుతాడు. ఇంట్లో భార్య, మామగారూ... ఆఫీసులో సాటి క్లర్కు, ఎప్పుడూ మేకప్ సరి చేసుకుంటూ పని ఎగ్గొట్టే లేడీ టైపిస్టూ, అవసరం లేకపోయినా చిందులు తొక్కే బాసు... వీరి మధ్య ముంగేరిలాల్ జీవితం మొదలవుతుంది.ముంగేరిలాల్ (అంటే ఇది మనవైపు సుబ్బయ్య వంటి ఒక కామన్ నేమ్) దుర్బలుడు. బలహీనంగా ఉంటాడు. భౌతికంగా కూడా అతడు హీరోగా జనం కళ్లకు ఆనడు. కాని అతడికి అదృష్టవశాత్తు ఒక జబ్బు ఉంది. నిలబడి కాని, పడుకుని కాని, ఆఫీసులో కాని, ఇంట్లో కాని అప్పటికప్పుడు కలల్లోకి వెళ్లిపోతాడు. ఆ క్షణంలో అతడి కుడి కన్ను, కుడి భుజం అదురుతాయి. ఆ తర్వాత కలలో క్షణాల్లో ప్రవేశిస్తాడు. ఆ కలల్లో తన నిజ జీవిత పాత్రలే మరో విధంగా తారసపడుతుంటాయి. ఆ పాత్రల మీద అతడు ఆధిపత్యం చెలాయిస్తుంటాడు.ఉదాహరణకు ఒక ఎపిసోడ్లో అతడి భార్య అతడితో సాయంత్రం ఊరిలోని కళాక్షేత్రంలో లతా మంగేశ్కర్ కచేరీ ఉందని దానికి వెళ్లే భాగ్యం తమకు లేదని వాపోతుంది. వెంటనే ముంగేరిలాల్ కలలోకి వెళ్లిపోతాడు. ఆ కలలో ముంగేరిలాల్ తన అసిస్టెంట్‌తో (నిజ జీవితంలో ఆఫీసులో టైపిస్ట్) కూచుని ఉంటాడు. హాల్ కిటకిటలాడుతుంటుంది. కాని లతా మంగేష్కర్‌కు ఏదో అవాంతరం వచ్చి కచేరీకి రాదు. నిర్వహాకుడు అంటే నిజ జీవితంలో ముంగేరిలాల్కు బాస్‌గా ఉన్న వ్యక్తి చాలా హైరానా పడుతుంటాడు. లతా రాకపోతే ప్రేక్షకులు పందిరి పీకి ఇల్లు కడతారని హడలిపోతాడు. ఇంతలో ఎవరో ఆ నిర్వాహకుడికి ఒక వార్త చెబుతారు. ప్రేక్షకుల్లో ముంగేరిలాల్ అనే మహా గానపండితుడు ఉన్నాడని ఆయన లతా మంగేష్కర్ కంటే గొప్పవాడని ఆయనను గనక బతిమిలాడుకుంటే ఆయన పాడితే గట్టెక్కేస్తామని చెబుతారు. అంతే. నిర్వాహకుడు వెళ్లి ముంగేరిలాల్ కాళ్ల మీద పడతాడు. ముంగేరిలాల్కు ఇది మొహమాటంగా ఉంటుంది. అరె.. నాకేదో నాలుగు ముక్కలు వస్తే ఏంటి మీరిలా ఇబ్బంది పెడతారు అన్నట్టుగా చూస్తాడు. కాని చివరకు స్టేజీ ఎక్కి అసిస్టెంట్‌తో కలిసి అద్భుతంగా పాటలు పాడి చప్పట్ల మోత మోగిస్తాడు. అలా ఇంట్లో ఉండే ముంగేరిలాల్ ఆ ఫంక్షన్ చుట్టి వస్తాడు.ముంగేరిలాల్ ఎపిసోడ్స్ అన్నీ ఇలాగే సాగుతాయి. ఒక ఎపిసోడ్లో నేరస్తులను పట్టుకుని పోలీసుగా, ఇంకో ఎపిసోడ్లో సరిహద్దులో శతృవుతో పోరాడే సిపాయిగా, ఇంకో ఎపిసోడ్లో కష్టమైన ఆపరేషన్‌ను అవలీలగా చేసి పారేసే డాక్టర్‌గా, మరో ఎపిసోడ్లో ఐశ్వర్యవంతుడిగా కనిపిస్తుంటాడు. ఏ కలలో ఏ అవతారం ఎత్తినా అతడు చేసేది మాత్రం మంచి. పొందేది కూడా మంచి. మంచి కోరుకుంటూ కలలు కనడం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిదే అని ఈ సీరియల్ చెబుతుంది. నిజ జీవితంలో నిస్పృహ కొంచెమైనా తీర్చుకోండి అని పిలుపు ఇస్తుంది.‘ముంగేరిలాల్ కే హసీన్ సప్నే’ 1990లో 13 ఎపిసోడ్లు ప్రసారం అయ్యింది. పెద్ద హిట్ అయ్యింది. ఇంట్లో పిల్లలూ పెద్దలూ హాయిగా ఆ సీరియల్‌ను చూశారు. ఆ పరంపర మన జానపదంలో కూడా ఉండటం వల్ల సులభంగా కనెక్ట్ అయ్యారు. పంచతంత్రంలో ఒక కుమ్మరి తాను మధ్యాహ్నం కునుకు తీస్తూ వందల కుండలు తయారు చేసి ఐశ్వర్యవంతుడు అయినట్టుగా భావించి కాలు తాటించి ఉన్న ఒక్క కుండనూ పగల గొట్టుకుంటాడు. అయితే అది పగటి కలలు చేటు అని చెప్పే కథ. ఇక్కడ మాత్రం పగటి కలలు పాజిటివ్ ఎనర్జీకి ఉపయోగపడతాయి అని చెప్పే కథ.రఘువీర్ యాదవ్ హీరోగా చేసిన తొలి సీరియల్ ఇది. ఈ సీరియల్‌తో అతడు దేశానికంతా పరిచయం అయ్యాడు. దీనికి ముందు ‘సలామ్ బాంబే’ సినిమాలో అతడు నటించినా జన సామాన్యానికి చేరువైంది ముంగేరిలాల్ తోనే.ఇక ఈ ఎపిసోడ్స్‌కు దర్శకత్వం వహించింది నేటి ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝా అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ‘గంగాజల్’, ‘రాజనీతి’, ‘అపహరణ్’ వంటి భారీ రాజకీయ చిత్రాలు తీసే ప్రకాష్ ఝా తన కెరీర్ ప్రారంభంలో ఒక మధ్యతరగతి జీవనాన్ని సున్నిత హాస్యంతో తీయడం మంచి జ్ఞాపకం అనుకోవాలి. మన దగ్గర పూరీ జగన్నాథ్ కూడా తొలి రోజుల్లో సరదా సీరియల్స్ దూరదర్శన్ కోసం తీశాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.1990లలో మధ్యతరగతి సంతోషాలను, చిన్నపాటి సంఘర్షణలను, ఒకరిలో మరొకరి పట్ల ఉండే ఆత్మీయతను ఆర్తిని సీరియల్స్‌గా తీసేవారు. ఇవాళ టీవీలో మధ్యతరగతి అనేది ఒకటి కనిపించకుండా పోయింది. అందరూ ఖరీదైన చీరలు నగలు పెట్టుకుని, మగవారైతే జుబ్బాలు దిగవిడుచుకుని కుట్రలు చేయడం ఎలా అని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు. వంట గదిలో మొగుడూ పెళ్లాల చిర్రుబుర్రులు, పిల్లల స్కూళ్ల ఎంపిక దగ్గర చర్చోపచర్చలు, అయినవారి పెళ్లి కానుక విషయంలో ఒకరితో మరొకరు పడే పేచీలు, ఇంట్లో పెద్దవారు ఉంటే వారితో పిల్లలు పడే గారాలు, ఆఫీసులో కలీగ్స్‌తో చిన్నపాటి స్నేహాలూ స్పర్థలూ ఇవి లేకుండా పోయాయి.జాతీయ చానళ్లలో లేవు.ప్రాంతీయ చానళ్లలో కూడా లేవు.అందుకే అందమైన మధ్యతరగతి జీవితం ఒక కలలా మిగిలింది.మనం కూడా పగలో, రాత్రో ఒక కల గని ముంగేరిలాల్ వలే ఆ జీవితాన్ని దర్శించి ఆనందిద్దాం. ఊరట చెందుదాం. ►ముంగేరిలాల్ ఎపిసోడ్స్ అన్నీ ఇలాగే సాగుతాయి. ఒక ఎపిసోడ్లో నేరస్తులను పట్టుకుని పోలీసుగా, ఇంకో ఎపిసోడ్లో సరిహద్దులో శతృవుతో పోరాడే సిపాయిగా, ఇంకో ఎపిసోడ్లో కష్టమైన ఆపరేషన్‌ను అవలీలగా చేసి పారేసే డాక్టర్‌గా, మరో ఎపిసోడ్లో ఐశ్వర్యవంతుడిగా కనిపిస్తుంటాడు. ఏ కలలో ఏ అవతారం ఎత్తినా అతడు చేసేది మాత్రం మంచి. -
ఆర్థిక వ్యవస్థకు ‘డైమండ్’ మెరుపు!
న్యూఢిల్లీ: భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయ్యేనాటికి ఆర్థికవ్యవస్థను మరింతగా ఉరకలెత్తించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. దేశ జీడీపీని 9–10% చొప్పున పరుగులు పెట్టిస్తూ 2022–23కి ఎకానమీని 4 లక్షల కోట్ల డాలర్లకు చేర్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని నీతిఆయోగ్ రూపొందించింది. ‘‘స్ట్రాటజీ ఫర్ న్యూఇండియా 75’’ పేరిట ఒక విజన్ డాక్యుమెంట్‌ను బుధవారం విడుదల చేసింది. 2022 నాటికి భారత్ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు(వజ్రోత్సవం) కానుంది. ఈ విశిష్ట సందర్భాన్ని గర్వంగా మలుచుకునేందుకు, అగ్రదేశాల సరసన భారత్‌ను నిలబెట్టేందుకు ఇప్పటినుంచే తగిన అడుగులు వేయాలని నీతిఆయోగ్ అభిప్రాయపడింది. ఇందుకోసం పలు వృద్ధి వ్యూహాలను విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు. జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో దాదాపు 800 మందితో సంప్రదింపుల అనంతరం ఈ నివేదికను రూపొందించడం జరిగింది. అధిక వృద్ధి సాధనకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన 41 రంగాల గుర్తించి, వీటిపై తీసుకోవాల్సిన విస్తృత చర్యలను ఇందులో సూచించారు. జీడీపీ జోరు కీలకం... దేశ ఎకానమీని విస్తృతపరిచేందుకు జీడీపీని పరుగులు పెట్టించాలని విజన్ డాక్యుమెంట్ పేర్కొంది. ముందుగా వచ్చే ఐదేళ్లు (2018–23) 8–9 శాతం జీడీపీ సాధించాలని తెలిపింది. దీంతో ప్రస్తుతం 2.7 లక్షలకోట్ల డాలర్లున్న దేశ ఎకానమీ 2022–23 నాటికి 4 లక్షల కోట్ల డాలర్లకు ఎదుగుతుందని వివరించింది. ఇదే జరిగితే 2022–23 కల్లా 9–10 శాతం వేగంతో వృద్ధి సాధ్యమవుతుందని, దీనివల్ల 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకుతుందని తెలిపింది. కేవలం గణాంకాల్లో కాకుండా జీడీపీ వృద్ధి సమ్మిళితంగా, స్థిరంగా ఉండాలని సూచించింది. గతేడాది భారత్ 6.7 శాతం వృద్ధి నమోదు చేసింది. జీడీపీ పరుగుతో పాటు దేశ పెట్టుబడి రేటు (గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్) పెరగాలని తెలిపింది. ప్రస్తుతం జీడీపీలో 29 శాతమున్న జీఎఫ్‌సీఎఫ్ 2022 నాటికి 36 శాతానికి పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. అల్పాదాయ దశ నుంచి దేశ జనాభా క్రమంగా అధికాదాయాల దిశగా కదులుతున్నారని, ఈ క్రమంలో ప్రస్తుతం 1,700 డాలర్లున్న తలసరి ఆదాయం 2022–23 నాటికి 3,000 డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. రైతులు ఇక అగ్రిప్రెన్యూర్స్..! ప్రస్తుతం ఇండియా ఆర్థిక పరివర్తన చివరి దశలో ఉందని విజన్ డాక్యుమెంట్ తెలిపింది. ప్రాథమిక రంగంపై ఎక్కువగా ఆధారపడ్డ దేశం కాబట్టి రైతులను పరిపుష్టం చేయాలని సూచించింది. సాగు రైతులను ‘అగ్రిప్రెన్యూర్లు’గా (సాగుతో పాటు సరైన మార్కెటింగ్ చేసుకోగల వ్యక్తులు) తీర్చిదిద్దాలని తెలిపింది. ఇందుకోసం ఇ–నామ్స్ విస్తరణ, ఏపీఎంసీ చట్టాన్ని ఏపీఎల్ఎం చట్టంగా మార్చడం, జాతీయ ఏకీకృత మార్కెట్ ఏర్పాటు, సరళీకృత ఎగుమతుల వ్యవస్థ ఏర్పాటు తదితర చర్యలు చేపట్టాలని తెలిపింది. మేక్ ఇన్ ఇండియా, ఆయుష్మాన్ భారతి, ప్రధాన మంత్రి జన ఆరోగ్య అభియాన్, స్వచ్ఛ భారత్ పథకాలను సక్రమంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను డాక్యుమెంట్ వివరించింది. శ్రామిక శక్తిలో మహిళలవాటాను పెంచాలని, కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు, సామాజిక భద్రతా ఛత్రం కిందకు మరిం తమందిని తీసుకురావాలని, ప్రస్తుత కార్మిక చట్టాలను సరళీకరించాలని, శిక్షణావ్యవస్థను మెరుగుపరచాలని సూచించింది. రుణమాఫీపరిష్కారం కాదు! రైతు కష్టాలు తీర్చేందుకు రుణమాఫీ సరైన పరిష్కారం కాదని నీతిఆయోగ్ అభిప్రాయపడింది. రుణమాఫీ కేవలం కొంతమంది సాగుదారులకు మాత్రమే లబ్ధి చేస్తుందని, సాగు సంక్షోభాల నివారణకు మార్గం చూపదని ‘భారత్ న్యూ విజన్ డాక్యుమెంట్’ఆవిష్కరణ సందర్భంగా నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. సాగు శాస్త్రవేత్త రమేశ్ చాంద్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పేద రాష్ట్రాల్లో కేవలం 10– 15 శాతం రైతులు మాత్రమే సంస్థాగత పరపతి పొందుతున్నారని, మిగిలినవారికి మాఫీతో ప్రయోజనం ఉండదని వివరించారు. ఒక్కోరాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉన్నప్పుడు అందరికీ వర్తించేలా మాఫీ పథకం అసాధ్యమని, దీనికి బదులు సాగు సంస్కరణలకు యత్నించే రాష్ట్రాలకు ఆర్థికసాయం అందించడం ఉత్తమమని సలహా ఇచ్చారు. ఇంకా ఏం చెప్పిందంటే! వివాదాల పరిష్కారానికి ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేరిట ఒక స్వతంత్ర సంస్థ ఏర్పాటు. 2022–23 నాటికి డిజిటల్ డివైడ్‌ను తొలగించి, అన్ని రాష్ట్రాల్లో పూర్తి డిజిటల్ అనుసంధానత ఏర్పాటు చేయడం, 100 శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించడం. డిస్కమ్‌ల ప్రైవేటైజేషన్, స్మార్ట్ గ్రిడ్ ఏర్పాటు, దేశమంతా 100% విద్యుత్ సరఫరాకు చర్యలు. కార్మికులకు సంబంధించి సమగ్ర సమాచారం ఎల్ఎంఐఎస్ (లేబర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ఏర్పాటు చేయడం.భారత్‌కు విచ్చేసే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను మరింత పెంపొందించాలని సూచించింది. అంతర్జాతీయ పర్యాటకంలో భారత వాటాను వచ్చే ఐదేళ్లలో 1.18 శాతం నుంచి 3 శాతానికి పెంచాలని నిర్దేశించింది. 2022–23 నాటికి అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను 88 లక్షల నుంచి 1.2 కోట్లకు పెంచాలని సూచించింది. రైల్వేల అభ్యున్నతికి టిక్కెట్ ధరలు, సబ్సిడీల నియంత్రణ, ఆస్తులను విక్రయించడం అవసరమని సూచించింది. ప్రయాణికులను ఆకట్టుకునేలా ధరల నమూనాను రూపొందించుకోవాలని, మౌలికవసతుల కల్పనను వేగవంతం చేయాలని, రైళ్ల సరాసరి వేగాలను మెరుగుపరచాలని తెలిపింది. మాటలు కాదు... చేతలు కావాలి: జైట్లీ పేదరికాన్ని నిర్మూలించాలంటే బలమైన సంస్కరణలు కావాలని, కేవలం నినాదాలతో పేదరికం మటుమాయం కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విపక్షాలకు చురకలంటించారు. స్ట్రాటజీ ఫర్ న్యూఇండియా ః 75 ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ఉత్తమాటలు వినడానికి బాగుంటాయని, కానీ వాటితో ప్రయోజనం లేదని క్రమంగా ప్రజలు గ్రహిస్తారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చాక వేగంగా ఎదిగేందుకు పలు అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేదని ఆయన పరోక్షంగా గత ప్రభుత్వాలను విమర్శించారు. కానీ ప్రస్తుతం భారత్ దూసుకుపోయేందుకు తగిన సమయం వచ్చిందన్నారు. -
ఒకటే భయం
-
అమ్మో.. వచ్చేస్తుంది ఒకటో తారీఖు
-
అమ్మో.. వచ్చేస్తుంది ఒకటో తారీఖు
జనానికి పొంచి ఉన్న ‘నగదు’ గండం బెంబేలెత్తిపోతున్న పేద, మధ్య తరగతి, వేతన జీవులు పాల నుంచి పచారీ కొట్టు దాకా కష్టాలే క్యాష్.. క్యాష్.. క్యాష్... ఎహే... 15 రోజులుగా ఉన్న గొడవేగా...! మళ్లీ ఏంటి? అది కాదు బాబోయ్... ఫస్టొచ్చేస్తోంది... ఆ వస్తే? ఖర్చులండీ... ఇంటి అద్దె, పచారీ కొట్టు, పనిమనిషి, పాలవాడు, స్కూలు ఫీజు, పిల్లల ఆటో... వగైరా వగైరా వీటన్నింటికీ క్యాష్ కావాలి... వామ్మో... కొత్త నోట్లే! అవును... న్యూ క్యాష్ మరెలా..? ఎలా... ఎలా? పెద్ద నోట్ల రద్దు దేశంలో ఎంతగా అలజడి సృష్టించినా... ప్రభుత్వ పెద్దలు, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు లాంటి కేంద్ర మంత్రులు... ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని, దేశహితం కోసం సహనంతో ఉండాలని చెబుతున్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందని, నల్లధనాన్ని లెక్కతేల్చి... దేశాభివృద్ధికి వెచ్చిస్తామని నొక్కి చెబుతున్నారు. మరోవైపు సామాన్యుడికేమో ఖర్చులకు నాలుగు కొత్తనోట్లను సంపాదించడానికి సరిపోతోంది. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. పైగా బ్యాంకుల్లో నగదు మార్పిడి పరిమితిని నాలుగు వేల నుంచి రెండు వేల రూపాయలకు కుదించారు. ఏటీఎంలలో రెండు వేలకు మించి రాదు... అదీ గంటల కొద్దీ లైన్లలో నిలబడి.. అదృష్టం బాగుండి మీవంతు వచ్చేసరికి మిషన్‌లో నగదు ఉంటే! చెక్కుతో తీసుకుంటే ఒకేసారి రూ.24 వేలు (వారానికి) ఇస్తామని ప్రకటించినా... నగదు కొరతతో బ్యాంకులు అంత ఇవ్వట్లేదు. నగదు లావాదేవీలపై ప్రధానంగా ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థ మనది. మొదటి తారీఖుకల్లా జీతాలు చేతికందే వారితో పాటు ఇతరులకు కూడా.. నెలలో తొలివారమే కీలకం. ఉండే ఖర్చులన్నీ ఈ వారంలోనే. పాలవాడి నుంచి పచారీ కొట్టు దాకా బిల్లులు చెల్లించాల్సింది ఈ మొదటి వారంలోనే. సాధారణంగా నెలారంభంలో మధ్యతరగతి జీవికి అయ్యే ఖర్చులు... పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అతనికున్న చెల్లింపు వెసులుబాట్లు ఏంటో చూద్దాం. అద్దె: సొంతిళ్లు లేని వారికి ఇదో సమస్య కానుంది. ఇంటి యజమాని తన అద్దె ఆదాయాన్ని లెక్కల్లో చూపడానికి ఇష్టపడకపోతే (ఉద్యోగిగా జీతం తీసుకుంటున్నా, ఇతరత్రా వ్యాపారాల ద్వారా సంపాదిస్తూ అప్పటికే అదాయపు పన్ను చెల్లిస్తున్నా.. ఇంటిపై వచ్చే అద్దెను చాలామంది లెక్కల్లో చూపరు) అద్దెకుండే వారికిచిక్కే. ఎందుకంటే యజమాని చెక్కు వద్దంటాడు. అద్దెను నగదు రూపంలో... అదీ కొత్త నోట్లతో చెల్లించాలి. రూ.5 వేల నుంచి రూ.10 వేల దాకా నగదు అవసరం ఉంటుంది. మెరుుంటెనెన్స: నెలవారీ ఖర్చుల నిమిత్తం చాలావరకు అపార్ట్మెంట్లో నగదు రూపంలోనే మెరుుంటెనెన్స్ వసూలు చేస్తారు. ఇది వెరుు్య నుంచి రెండున్నర వేల రూపాయల వరకు ఉంటుంది. కిరాణా దుకాణం: నెలకు సరిపడా బియ్యం, పప్పులు, ఇతర వస్తువులు కొనాలి. సూపర్మార్కెట్లలో కార్డులు తీసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ పేదలకు ఇబ్బందే. అలాగే చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో కార్డుల సదుపాయం ఉండదు కాబట్టి నగదు పెట్టి కొనాల్సిందే. పాలు, పేపర్ బిల్లు: పాలు, పేపర్ బిల్లుకు నగదు ఇవ్వాల్సిందే. ఇందుకు రూ.2 వేల వరకు కావాలి. కూరగాయలు: నగదు పెట్టే కొనాలి. వారాంతాల్లో నాన్‌వెజ్ అరుునా క్యాష్‌తోనే కొనాలి. కేబుల్ బిల్లు: నగదు రూపంలోనే చెల్లించాలి. డిష్ టీవీలు ఉంటే ఆన్లైన్లో మొబైల్ బ్యాంకింగ్ లేదా కార్డు ద్వారా రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. గ్యాస్ బిల్లు: ప్రస్తుతానికి పాతనోట్లు తీసుకుంటున్నా... ప్రభుత్వం గడువు పెంచకపోతే వచ్చేనెల నుంచి ఇది కూడా కొత్తనోట్లతో లేదా రూ.100 నోట్లతో చెల్లించాల్సిందే. స్కూలు ఫీజులు: పాఠశాలలు, కాలేజీల్లో వారుుదాల రూపంలో ఫీజులు కట్టే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు వీటి వారుుదాలను కొత్తనోట్లతో నగదు రూపంలోనే స్కూలు కౌంటర్లో చెల్లించాలి. బ్యాంకుల్లో చెల్లించే వెసులుబాటు ఉన్న స్కూళ్లలో తల్లిదండ్రులకు కొంత ఉపశమనం. స్కూల్ వ్యాన్ బిల్లు: నగదు రూపంలోనే ఇవ్వాలి. ప్రైవేటు ట్యూషన్ ఫీజు: నగదు రూపంలోనే ఇవ్వాలి. కరెంటు బిల్లు: ఆన్లైన్లో చెల్లించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అరుుతే ఊరికి బిల్ కలెక్టర్ వచ్చినపుడు నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్, మొబైల్ బిల్లులు: ఆన్లైన్లో చెల్లించొచ్చు. నగదు రూపంలో కట్టేవారికి ఇదో అదనపు భారం. గ్రామీణులకు దీనికి క్యాష్ అవసరం. పని మనిషి: చేసే పనిని బట్టి రూ.1,500 నుంచి రూ.3 వేల వరకు నగదు ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్త్రీ: సగటున ఐదారు వందలు. నగదు ఇవ్వాలి. ఈఎంఐ: టూ వీలర్ లేదా ఫోర్ వీలర్, గృహరుణం తీసుకున్న వారికి కిస్తులు (ఈఎంఐలు) చెల్లించాల్సి ఉంటుంది. అరుుతే ఈసీఎస్, చెక్కుల రూపంలో ఇది జరిగిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ప్రైవేటు చీటీలు: రిజిస్టర్ చిట్ఫండ్లు అరుుతే చెక్కు లు, ఆన్లైన్ పేమెంట్లు స్వీకరిస్తారుు. అరుుతే చాలామంది మిత్రులు, బంధువులు, పరిచయస్తుల దగ్గర ప్రైవేటు చీటీలు వేయడం అలవాటైపోరుుంది. ఇది చట్టబద్ధమైనది కాదు కాబట్టి నగదులోనే ఇవ్వాలని నిర్వాహకులు కోరుతారు. వేసే చీటీని బట్టి కిస్తు మొ త్తం ఉంటుంది. దీనికీ నగదు సర్దాల్సి వస్తుంది. ఆఫీసుల్లో మైక్రో ఏటీఎం జనం నగదు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొన్ని పెట్రోల్ బంకుల్లో మైక్రో ఏటీఎంల ద్వారా కొత్తనోట్లను విత్‌డ్రా చేసుకొనే అవకాశం కల్పించారు. అలాగే ఒకటో తేదీ నుంచి ఆఫీసుల్లోనే మైక్రో ఏటీఎం ద్వారా నగదును అందజేయవచ్చు. ఉద్యోగి వేతన ఖాతాను అనుసంధానించిన డెబిట్ కార్డు ద్వారా విత్‌డ్రా పరిమితిని పెంచి మైక్రో ఏటీఎంతో రూ.15 వేల నగదును ఉద్యోగి చేతికి అతని కార్యాలయంలోనే అందించొచ్చు. ► ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు బ్యాంకుల్లో భారీ క్యూలో నిలబడటం కష్టమే. క్యూలలో ఇప్పటికే పలువురు అస్వస్థతకు గురై చనిపోయారు. కాబట్టి వీరికోసం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడం, నీడ, తాగునీటి వసతి లాంటివి కల్పిస్తే కాస్త ఉపశమనం ఇచ్చినట్లవుతుంది. ఖాతాలు లేనివారికి నేరుగా గ్రామపంచాయతీల్లో నగదు అందజేస్తున్నట్లే నవంబరు పింఛన్‌ను అందరికీ నగదు రూపంలో అందజేసే అవకాశాలను పరిశీలించడం మరో మార్గం. వారంలో పెళ్లి.. డబ్బుల కోసం కంటతడి ‘‘సార్.. నా కుమారుడి పెళ్లి.. ఎలాగైనా చేసి డబ్బులియ్యండి..’’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నిమ్మవానిపల్లెకు చెందిన నిమ్మల శ్రీనివాస్ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన కుమారుడు వెంకటేశ్ పెళ్లి డిసెంబర్ 1న జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అరుుతే పెళ్లి ఖర్చుల కోసం సమకూర్చుకున్న డబ్బు బ్యాంకులో ఉంది. దీంతో ముస్తాబాద్‌లోని ఎస్బీఐకి వెళ్లి.. డబ్బులివ్వాలని కోరగా రూ.24 వేల కంటే ఎక్కువ ఇవ్వలేమని సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో ఏం చేయాలో తెలియక శ్రీనివాస్ కంటతడి పెట్టారు. సేవింగ్స్ ఖాతా డిపాజిట్‌కే పాత నోట్ల వెసులుబాటు సాక్షి, హైదరాబాద్: పోస్టాఫీసుల్లో కేవలం సేవింగ్స బ్యాంక్ ఖాతాలోనే రద్దైన రూ.500, రూ.1,000 నోట్ల డిపాజిట్లకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తపాలా శాఖ వర్గాలు తెలిపారుు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పాత నోట్ల డిపాజిట్లను అంగీకరించకూ డదని మంగళవారం స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా సేవింగ్ బ్యాంక్ ఖాతాకు మినహారుుస్తూ సవరణ ఆదేశాలు జారీ చేసింది. పోస్టాఫీసుల్లో చిన్న మొత్తాల పథకాల పరిధిలోకి వచ్చే సేవింగ్స బ్యాంక్, రికరింగ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి అకౌంట్ (ఎస్ఎస్ఏ), మంత్లీ ఇన్‌కం స్కీం (ఎంఐఎస్), సీనియర్ సిటిజన్ అకౌంట్ తదితర ఖాతాల్లో డిపాజిట్లకు పాతనోట్లను అనుమతిస్తూ వచ్చారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయంతో కేవలం సేవింగ్స బ్యాంక్ అకౌంట్ డిపాజిట్‌కు మాత్రమే పాత నోట్లను అనుమతించనున్నారు. పర్యవసానాలు... ► మొదటి వారంలో నగదు తిప్పలు ఉంటారుు కాబట్టి ఉద్యోగుల హాజరు శాతంపై ప్రభావం ఉంటుంది. ► ఏటీఎంలో తీసుకునే డబ్బు ఏమూలకు సరిపోదు. బ్యాంకుల్లో చెక్కు ద్వారా డబ్బు ‘డ్రా’ చేయడానికి క్యూలో నిలబడితే ఆ రోజుకు ఆఫీసుకు ఎగనామమే అవుతుంది. పైగా బ్యాంకుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లకు కూడా తీవ్ర ఇబ్బందే. వయోభారం కారణంగా వారు బ్యాంకు క్యూలలో గంటలకొద్దీ నిలబడలేరు. ఇలా చేస్తే కాస్త ఊరట.. ► కేంద్ర ప్రభుత్వ, రక్షణ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని గ్రూపు ‘సి’ ఉద్యోగులకు రూ.10 వేలు వేతన అడ్వాన్సును నగదు రూపంలో ఇస్తున్నారు. ► రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు కూడా తమ ఉద్యోగులకు నవంబరు నెల వేతనాన్ని ఓ రూ.15 వేల వరకు కొత్తనోట్లను ఇస్తే.. వేతనజీవి బండి సాఫీగా సాగుతుంది. లేకపోతే చుక్కలు కనిపిస్తారుు. ► తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు నవంబర్ జీతం (డిసెంబరు ఒకటిన ఇచ్చేది) మొత్తాన్ని నగదు రూపంలో (కనీసం రూ.10 వేలు) ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ► కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఇలాంటి వెసులుబాటును కల్పిస్తే.. తక్షణావసరాలకు చేతిలో డబ్బు ఉంటుంది. జనం అవసరాలు కొంతమేరకు తీరుతారుు. జనం ముందున్న మార్గాలివీ ఏటీఎం: రూ.2 వేలు. (రోజుకు రూ.2 వేల చొప్పున ఖర్చులకు సరిపడా తీయాలంటే ఏడెనిమిది రోజులు క్యూలో నిలబడాలి. ఇది అసాధ్యం. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఖాళీగా ఉంటే క్యూలో నిలబెట్టొచ్చు) చెక్కు ద్వారా విత్‌డ్రా: వారానికి 24,000. (ఆర్బీఐ ఎక్కువ డబ్బు ఇవ్వట్లేదని, తమ దగ్గరున్న నగదును అందరికీ సర్దాల్సి ఉంటుందని, కాబట్టి తక్కువ మొత్తమే ఇవ్వగలమని బ్యాంకులు చెబుతున్నారుు) డెబిట్/క్రెడిట్ కార్డులు: పట్టణ ప్రాంతాల్లో చెల్లింపులకు వాడుకోవచ్చు. ప్రధానంగా కరెంట్, నెట్, కిరాణా బిల్లులు తదితరాలకు వాడొచ్చు కానీ అద్దె, పనిమనిషి వేతనం లాంటి ఇతరత్రా అవసరాలకు కుదరదు. చిన్న పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో వీటిద్వారా లావాదేవీలకు ఆస్కారం తక్కువ. వ్యాలెట్ యాప్స్: బిల్లుల చెల్లింపు, డిష్ టీవీ, మొబైల్ రీచార్జ్‌లు తదితరాలకు వాడుకోవచ్చు. మొబైల్లో నెట్ యాక్సెస్ ఉండి.. వీటిని వాడగలిగేవారికి ఓకే. అరుుతే గ్రామీణులకు వీటిపై అవగాహన లేదు. వాడలేరు. - సాక్షి నాలెడ్‌జ సెంటర్ -
ప్రగతి పేరు, ప్రకృతితో పోరు
పారిశ్రామిక విప్లవానికి ముందు ఈ స్థాయిలో మానవాళి ఎరుగని విధ్వంసానికి అసలు కారణం ఏమిటి? విధ్వంసంలో కూడా ‘ప్రగతినీ/అభివృద్ధి’నీ చూడగల్గినది సామ్రాజ్యవాద -పెట్టుబడి వ్యవస్థ మాత్రమే. ప్రసిద్ధ పర్యావరణ శాస్త్ర పరిశోధకుడు, ఆర్థిక విశ్లేషకుడు బెలామీ ఫాస్టర్ చెప్పినట్టు ‘ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అవతరించినది మొదలు మానవాళికి, ప్రకృతికి మధ్య అంతకుముందు నెలకొని ఉన్న సంప్రదాయ సమతుల్యత కాస్తా తిరిగి పాదుకొల్పడానికి వీలులేనంతగా తారుమారైపోయింది.’ ‘వాదనలు ఎన్నిరకాలైనా వినిపించవచ్చు గాక! కానీ, బహుకొద్దిగానే ఉన్న దేశ అపురూపమైన వనరులనూ, ప్రకృతి వనరులనూ; అంతే స్థాయిలో ఉన్న నిధులనూ అదుపుగా, పొదుపుగా ఆచితూచి వినియోగించుకోగల జీవన శైలికి ప్రభుత్వాలూ, పౌరులూ అలవాటు పడకపోతే భవిష్యత్తు, మనుగడ ప్రశ్నార్థకం కాకతప్పదు.’ - గౌతమ్ భాటియా (ప్రసిద్ధ వాస్తుశాస్త్రవేత్త, శిల్పకారుడు) వాన ఎక్కువైతే రొంపి కరువు, వాన తక్కువైతే వరపు కరువని శతాబ్దాల అనుభవం. తమ అవసరాల కొద్దీ మానవులు, అధికార తాపత్రయంతో ప్రభుత్వాలు అపురూపమైన ప్రకృతి వనరుల మీద శక్తికి మించి ఆధిపత్యం నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నం ఎంత ఉధృతంగా వికటిస్తుందో ఇంతకు ముందు చూశాం. ఇప్పుడు కూడా చూస్తున్నాం. ప్రత్యక్షంగా అనుభవి స్తున్నాం. గతంలో ఎన్నడూ ఎరుగని ప్రకృతి వైపరీత్యం దూసుకువచ్చి లక్షలాది ప్రాణాలను తోడుకుపోయిన ఉదంతాలు కూడా మన ఇరుగు పొరు గున, ఆసియా ఖండంలోనూ (అండమాన్, తమిళనాడు; ఇండోనీసియా) చూశాం. ఎప్పటివారో తెలియదు కానీ కాకరపర్తి కృష్ణశాస్త్రి ‘ప్రళయ సంరంభం’ శీర్షికతో రాసిన కవితలో సునామీ జలఖడ్గాన్ని స్వయంగా చూశారా అన్న రీతిలో, అనూహ్యమైన శైలితో, ‘భీకర లీల లేచి అతివేల జవం బున వచ్చి/ దుస్సహమై ధరముంచి’ అని రాశారు. ప్రకృతి వైపరీత్యాలకు మారుపేర్లుగా గత కొద్ది సంవత్సరాలుగా అలాంటి భీకర దృశ్యాలు వాతావరణంలో కనిపించి ప్రజలను అతలాకుతలం చేశాయి. ఎల్-నినో (దుర్భిక్షానికి), లా నినో (అతివర్షానికి) మరింత విధ్వంసంతో కూడిన వైపరీ త్యాలుగా నమోదైనాయి. ఇవి రుతువులను తారుమారు చేశాయి. విభజనకు నిరసన అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలను గత రెండువారాలుగా నూరేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో వర్షాలు ముంచెత్తాయి. వేలాది ఎకరాలలో పంటలు నాశనమైనాయి. వానకన్నా ముందు ఆకస్మిక వరదలు వచ్చి (కొన్నేళ్ల నాటి కర్నూలు విధ్వంసం మాదిరిగా) నగరాలను, పట్టణాలను ధ్వంసం చే శాయి. ఇప్పట్లో పూరించలేని స్థాయిలో నష్టం కలిగించాయి. వాణిజ్యం స్తంభించింది. వాతావరణ శాఖ హెచ్చరికలను సైతం అవహేళన చేస్తున్నట్టు ఈ వైపరీత్యం విరుచుకుపడింది. కానీ ఒకటి... గతంలో కన్నా, ప్రస్తుతం ఉన్న మెరుగైన సాంకేతిక వ్యవస్థ చాలావరకు జననష్టాన్ని నివారించడానికి ఆస్కారం కల్పిం చింది. సకాలంలో అప్రమత్తం చేయగల సాంకేతిక వ్యవస్థ ఉన్నప్పటికీ, ముందు చూపులేని నాయకులు మాత్రం సరైన సమయంలో స్పందించ డంలో విఫలమైనారు. పేదలు, బలహీన వర్గాలు, మధ్య తరగతి ప్రతిసారి దారుణంగా నష్టపోతోంది. నిజానికి పాలకుల ఈ తరహా చండితనానికి మరో ప్రధాన కారణం ఉంది. పాలకులకూ కావాలి ఆ స్పృహ పర్యావరణ సమతౌల్యం ఘోరంగా దెబ్బతిన్న ప్రాంతాలలో భారత్ 13వ స్థానంలో ఉన్నదని శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వేలు ఘోషిస్తున్నాయి. సముద్ర గర్భంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం గతంలో విశ్వ వ్యాప్తంగా భూతలం మీద పర్యావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయడానికి తగిన సాక్ష్యాలు దొరికాయని లండన్‌లోని జాతీయ సాగర పరి శోధన కేంద్రం వెల్లడించింది. హిమనదాలుగా నిరంతరం తమ ఉనికిని కాపా డుకునే ధృవప్రాంతాలను ఆవరించి ఉండే ఆర్కిటిక్ ప్రాంత శీతల స్థితి కూడా అదుపు తప్పి, అక్కడ వాతావరణం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు హెచ్చ రించారు. భూగర్భంలో శీతల స్థితిని అంచనా కట్టేందుకు కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ అంశాలకు పూర్తి స్పృహ పాలకులకు కూడా ఉండాలి. అప్పుడే ప్రకృతి వైపరీత్యాల వేళ స్పందించవలసిన విధంగా స్పందించ గలుగుతారు. సమర్థ పాలకునిగా, ఉన్నతాధికారిగా, ఇంజనీర్‌గా సేవలు అందించిశాశ్వత కీర్తిని పొందిన సర్ ఆర్థర్ కాటన్‌ను గోదావరి జిల్లాల ప్రజలు నాటికీ నేటికీ వివాహాది శుభకార్యాలలో ‘కాటనాయ నమః’ అంటూ పూజిస్తారు. కాని ఈ ఆధునిక భగీరథుడిని (కాటన్‌ను) కరువు కాటకాలొస్తే ప్రజలు చస్తే చస్తారు, పరాయి దేశంలో ప్రజల కోసం ఎందుకు అంత ఖర్చు చేయవలసి వచ్చిందో సంజాయిషీ ఇవ్వమని లండన్ కోర్టు ముందుకు బ్రిటీష్ వలస పాలకులు ఈడ్చారు. దానికి కాటన్ సమాధానం - ‘కరువు కాటకాలతో చనిపోతున్న ప్రజలకు మనం ఆనకట్టలు, రిజర్వాయర్ల ద్వారా జలధారలు అందజేస్తే మన పాలనలోని ప్రజలను రక్షించుకోవడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయానికి ఆదాయం పెరుగుతుంద’ని బుద్ధిచెప్పి వచ్చాడు. ఈ స్ఫూర్తి ఇప్పటి కొందరు మన పాలకులకు లేదు. ‘యథా రాజా తథా ప్రజా’ అన్న సామెత అవినీతిలో కూరుకుపోయిన నేటి కొందరు పాల కులకు, కొందరు ఇంజనీర్లు, మరికొందరు కాంట్రాక్టర్లకు వర్తించినంతగా మరెవరికీ వర్తించదు. కనుకనే కాటన్ సహా కొందరు ప్రజా ప్రయోజనాల స్పృహకల్గిన పాలకులు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యలాంటి హేమాహేమీ ఇంజనీర్లు వివిధ చిన్న జలమార్గాల అనుసంధానం ద్వారా కాల్వల ద్వారా రవాణా వ్యవస్థను పెంపొందించి, స్థిర పరచడానికి కృషి చేశారు. ఫలితంగా 1890ల నాటికే గోదావరి, కృష్ణల నదీ వ్యవస్థతో బకింగ్‌హామ్ కెనాల్‌కు వంకలు, వాగుల్ని కూడా అనుసంధానించి, ఆంధ్రలోని కాకినాడ నుంచి తమిళనాడులోని విల్లుపురందాకా, 450 మైళ్ల పర్యంతం జలమార్గాన్ని సుస్థిరం చేశారు. ఈ వరసలోనే కాకినాడ-పుదుచ్చేరి మార్గంలో బకింగ్‌హామ్ కెనాల్ సహా పెక్కు కాల్వలను కలపడానికి ఆ తరువాత కాలంలో ప్రయత్నం జరిగింది. ఈ బకింగ్ కెనాల్ చరిత్ర కాలగతిలో ‘గత జలసేతు బంధనం’గా ముగిసిపోకుండా ఉండి ఉంటే, సెకనుకు 5,600 క్యూబిక్ అడుగుల నీటిని బట్వాడా చేయగల శక్తిగల బకింగ్‌హామ్ ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని భారీ వరద ముంపునుంచి రక్షించుకుని ఉండే పని అని పాల్ హైలాండ్ రాసిన ‘ఇండియన్ బామ్’ పుస్తకం వెల్లడిస్తోంది (హిందూ, 5-12-2015). నిజాం కాలం ప్రాజెక్టులు పాలనా వ్యవస్థలో అవినీతి అంతర్భాగమైనప్పుడు జలమార్గాల వ్యవస్థ నిర్వహణలోనూ, కట్టడాలలోనూ చోటు చేసుకుంటుంది. కాని నిరంకుశ నిజాం పాలనలో రిజర్వాయర్ల నిర్మాణంలోనే కాదు, కనీసం మురుగునీటి పారుదలకు డ్రైనేజీ వ్యవస్థను నిర్మించిన తీరు గమనించాల్సిందే. అలాంటి పథకం లేనందుననే ప్రస్తుతం నగరాలను, పట్టణాలను ముంచెత్తుతున్న వానలు, వరదలతో డ్రైనేజీ వ్యవస్థకు నవరంధ్రాలు మూసేసినట్టయింది. ఉపరితలంలోనే మురుగు పారుదలయ్యేట్టు స్వతంత్ర భారత పాలకులు వ్యవస్థను నిర్మించినందున మొత్తం డ్రైనేజీ పారుదల నిర్మాణ పథకం లోప భూయిష్టంగా తయారై నగర శోభ కూడా మారు రూపు తొడిగింది. ఇటీవల భారీ వరదలకు ఇబ్బందులపాలైన హైదరాబాద్ నగరంలో, కొన్ని రోజులనాడు మొజంజాహి మార్కెట్ పొడవునా, పబ్లిక్ గార్డెన్స్ వద్ద (తెలుగు విశ్వవిద్యాలయం లైన్లో) తవ్వకాలు జరుగుతున్నప్పుడు నిజాం నాటి మురుగునీటి, వర్షపునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి నిర్మించిన కట్టడం పది అడుగుల లోతున కన్పించింది. భూమిని పరీక్షించే సమయంలో అది కన్పించలేదు. మెట్రో రైలు నిర్మాణంలో భారీ దిమ్మలకు అవసరమైన పునాదుల తవ్వకంలో ఆ నిర్మాణ రహస్యం బయల్పడింది. అందుకే అంత లోతుగా డ్రైన్ పైప్‌లైన్‌ను పది అడుగుల లోతున వేస్తారని అనుకోలేదని మెట్రోరైల్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.వి.ఎస్. రెడ్డి ఆశ్చర్యం వెలిబుచ్చారు. ‘ఆ పైప్‌లైన్ సుందరమైన నిర్మాణం’ అని కూడా కితాబు ఇచ్చారు. ఆశ్చర్యమే మంటే ఇందుకు సంబంధించిన పటాలుగానీ, డ్రాయింగ్స్గానీ జి.హెచ్. ఎం.సి. దగ్గర, మున్సిపల్ వాటర్ బోర్డు వద్ద లభించక పోవటం. ఇదే సమయంలో ‘హైటెక్ సిటీ’ నిర్మాణం తన గొప్పేనని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతాచేసి అదే హైటెక్ సిటీకి కీలకమైన భూగర్భ (అండర్ గ్రౌడ్) డ్రైనేజీ వ్యవస్థను నిర్మించలేకపోయాడని మరవరాదు. ఆధు నిక పాలకులు ‘ప్రగతి/అభ్యుదయం’ చాటున సహజ వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నందుననే ప్రకృతి ఎదురుదాడికి దిగవలసివస్తోంది. దెబ్బతిన్న సమతౌల్యంతో ఇక్కట్లు పారిశ్రామిక విప్లవానికి ముందు ఈ స్థాయిలో మానవాళి ఎరుగని ఈ విధ్వం సానికి అసలు కారణం ఏమై ఉంటుంది? విధ్వంసంలో కూడా ‘ప్రగతిని/ అభివృద్ధి’నీ చూడగల్గిన ఏకైక వ్యవస్థ సామ్రాజ్యవాద -పెట్టుబడి వ్యవస్థ మాత్రమే. పర్యావరణ శాస్త్ర ప్రసిద్ధ పరిశోధకుడు, ఆర్థిక విశ్లేషకుడైన బెలామీ ఫాస్టర్ చెప్పినట్టు ‘ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అవతరించినది మొదలు మానవాళికి, ప్రకృతికి మధ్య అంతకుముందు నెలకొని ఉన్న సంప్రదాయ సమతుల్యత కాస్తా తిరిగి పాదుకొల్పడానికి వీలులేనంతగా తారుమారై పోయింది’’ (‘ది వల్నరబుల్ ప్లానెట్: 1999 న్యూయార్క్). అంత కన్నా నిశితంగా, కారల్‌మార్క్స్ సహచరుడైన ఫ్రెడరిక్ ఏంగెల్స్ ఈ పరిణామం గురించి 150 ఏళ్ల క్రితమే ఇలా హెచ్చరించాడు: ‘ఆసియా మైనర్, మెసపటోమియా, గ్రీస్ తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు సాగుకు లాయకైన భూముల్ని పొందేందుకు అటవీభూముల్ని ధ్వంసం చేశారేగాని, ఈ పని మూలంగా భూమిలో తేమను సంరక్షించగల రిజర్వాయర్లు, అడవులకీ పరి రక్షణా కేంద్రాలనీ గుర్తించలేకపోయారు. అలాగే, ఏడాదిలో ఎక్కువ రోజుల పాటు పర్వత సానువుల నుంచి నిరంతరం జాలువారే ఊటలను కాపాడు కోలేక పోతామని వారు గుర్తించలేక పోతున్నారు. ఫలితంగా, వర్షాకాలాల్లో మైదాన ప్రాంతాల్ని ముంచెత్తే భారీ వరదల్ని నిరోధించలేక పోతున్నారు. ఆ విధంగా విదేశాలలోని ప్రజల్ని జయించి పెత్తనం చెలాయించే పరాయి వాడిలా మనం ప్రకృతిపట్ల వ్యవహరించరాదు! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
‘ఓటుబ్యాంక్’లపై వృద్ధి తూటా
బిహార్ యువత పెద్ద ఎత్తున ఆర్థిక తర్కానికే ఓటు వేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిం దేమీ లేదు. పరిస్థితులు ఇప్పుడున్నట్టుగా ఇలాగే ఉండిపోతే అతి ఎక్కువగా నష్టపోయేది వారే. వారి భవిత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. లాలూ, ఒక విచిత్ర మానసిక స్థితిలో, ఉపన్యాస ధోరణిలో కూరుకుపోయి ఉన్నారు. పావు శతాబ్దిగా అది మారలేదు. గతించిన కాలమనే అగాధంలోంచి విసుగెత్తించే అ పదబంధాలు, జోకులు, హావభావాలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఆయన హాస్యం పొంగని బ్రెడ్డులా చదునుగా, బరువుగా ఉంటుంది. బిహార్ శాసనసభ ఎన్నికలు దురభిమానపూరిత సెంటిమెంట్‌కు, ఆర్థిక తర్కానికి మధ్య శక్తివంతమైన చర్చగా మారాయి. కుల, మతాలకు, సెంటిమెంటుకు దన్నుగా నిలచేవేమిటో మనకు సుపరిచితమే. మరి ఈ తర్కం ఏమిటి? ఈ ఎన్నికలు జరిగేది అభివృద్ధి గురించేనని అందరికీ తెలిసిందే. సుపరి పాలన లేనిదే అభివృద్ధి అసాధ్యం. సుపరిపాలనకు సుస్థిరత అవసరం. నితీష్ కుమార్ సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేరనడానికి ఆధారాలున్నాయి. లాలూప్రసాద్ యాదవ్, కాంగ్రెస్‌లతో కలసి ఆయన ఆకుకు అందని పోకకు పొందని అవకాశవాద కూటమిని ఏర్పరచారు. అందులోని భాగస్వాము లంతా ఒకరి వ్యక్తిగత ప్రతిష్టను మరొకరు భంగపరిచే చరిత్ర గల వారే. పైగా, వ్యక్తిగత స్థాయిలోనే కాదు, పునాది మద్దతుదార్ల స్థాయిలో కూడా వారు ఒకరి పట్ల మరొకరికి ఉన్న అసంతృప్తిని దాచుకునే ప్రయత్నమైనా చేయలేదు. వారితో పోలిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పునాది దృఢంగా ఉన్నదనేది స్పష్టమే. పరిపాలించడానికి అది సంసిద్ధంగా ఉన్నదని విశ్వసిం చడానికి తగ్గ హేతువూ ఉంది. తార్కిక పరిభాషలో చెప్పాలంటే రుజువుతో నిర్ధారించడం (క్యూఈడీ) లేదా చేసి చూపడమే అందుకు నిదర్శనం. ‘‘అందరికీ అభివృద్ధి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ నిలకడగా ఓటర్లకు ఒకే సందేశాన్ని ఇస్తున్నారు. బిహార్ అభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక పథకాలు దానికి దన్నుగా ఉండటంతో వారు ఆ సందేశానికి భారీ ఎత్తున స్పందిస్తున్నారు. పాత, కాలం చెల్లిన కుల, మతాలు ఇంతవరకు అక్కడి ఓటర్లు ఎన్నికల్లో ఎవరిని ఎంచుకోవాలని నిర్ణయించుకునే విషయంలో కీలక చలాంకాలుగా ఉంటున్నాయి. ‘‘బిహారు ప్యాకేజీ’’ ఆ గాలి బుడగను బద్ధలు చేసి, మొత్తంగా పరిస్థితిలో పెను మార్పును కలుగచేసేది. రహదారులకు కులం ఉండదు. విద్యుత్తుకు జాతి ఉండదు. పేదరికానికి మతం ఉండదు. పేదల సామాజిక సంక్షేమమే లక్ష్యంగా చొరవతో చేపట్టిన జన్‌ధన్ యోజన, బీమా పథకాల వంటివి ప్రదర్శనాత్మక ప్రభావానికి తోడవుతాయి. బిహార్ యువత పెద్ద ఎత్తున తర్కానికే ఓటు వేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. పరిస్థితులు ఇప్పుడున్నట్టుగా ఇలాగే ఉండిపోతే అతి ఎక్కువగా నష్టపోయేది వారే. కాబట్టి వారు అలాగే చేస్తారు. ఈ ఎన్నిక ల్లో వారి జీవితాలే పణంగా ఒడ్డి ఉన్నాయి. వారి భవిత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. 1990-1995 మధ్య కాలంలో పుట్టిన వారికి ఇప్పుడు ఇరవయ్యో, ఇరవైయైదేళ్లో ఉంటాయి. ఉద్యోగం గురించి ఆందోళన అతి తీవ్ర స్థాయిలో ఉండేది ఆ వయసులోనే. కాబట్టి రానున్న ఐదేళ్లూ వారి భవితకు సంబంధించి కీలకమైనవి. ఇప్పుడు వారు వినాలని కోరుకుంటున్న మాటలనే నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. కాబట్టే వారికి ఆయన ధృవతారలా కనిపిస్తున్నారు. కడుపుమంటతో పార్టీని బెదిరించైనా పార్టీలో ప్రాధాన్యాన్ని సంపాదించగలమనుకున్న తిరుగుబాటుదార్లు సైతం... బిహారు యువత ఓటు భారీ ఎత్తున నరేంద్రమోదీకి అనుకూలంగా బదలాయింపు అవు తోందని అంగీకరించడం మొదలైంది. యువత, జనాభాపరమైన నూతన నిర్ణయాత్మక అంశాన్ని సృష్టించింది. అభిప్రాయ సేకరణలన్నీ కాకున్నా కొన్ని దాన్ని నమోదు చేయడం ప్రారంభించాయి. లాలూప్రసాద్ యాదవ్, ఒక మానసిక స్థితిలో, ఉపన్యాస ధోరణిలో కూరుకుపోయి ఉన్నారు. పావు శతాబ్ధకాలంగా అది మారలేదు. గతించిన కాలమనే అగాధంలోంచి విసు గెత్తించే అవే పదబంధాలు, జోకులు, హావభావాలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఆయన హాస్యం ఈస్ట్ లోపించి పొంగని బ్రెడ్డు అంత చదునుగా, బరువుగా ఉంటుంది. ఈ ఎన్నికల నాటకంలో ఏకైక విదూషక పాత్రను పోషిస్తున్నది బూట కపు ఉదారవాదులు మాత్రమే. అప్పుడప్పుడూ ఏైదైనా పత్రికల్లో కనిపించే సంపాదకీయ పేజీల వ్యాసాల ద్వారా, డ్రాయింగ్ రూమ్ సంభాషణల ద్వారా పునరు జ్జీవం పొందాలని వారు తెగ తాపత్రయపడుతున్నారు. కానీ కుల, మత నేతల ఆయుధాగారంలో సరికొత్త ఆలోచనలు ఏమీ లేకపోవడమే వాటి ప్రాధాన్యత క్షీణించిపోతుండటానికి కారణం. కానీ ఈ బూటకపు ఉదార వాదులు మాత్రం నరేంద్ర మోదీ ఆర్థిక తర్కం ప్రాతిపదికపై ఈ ఎన్నికల పోరాటం సాగిస్తుండటం వల్లనే బిహారు రెండు దశాబ్దాల క్రితం ఎక్కడుందో అక్కడే ఉండిపోతుందని గట్టిగా చెబుతున్నారు. అలా అని పాత నిర్ణయాత్మక అంశాలన్నీ పూర్తిగా అంతరించి పోయి నట్టేనని నా అభిప్రాయం కాదు. కాకపోతే అవి ఇక ఎంతమాత్రమూ నిర్ణయాత్మకమైనవిగా లేవు. వాటి మార్కెట్టు కుచించుకుపోయింది. ప్రధాన ప్రవాహం దిశ మార్చు కుంటోంది. ఇటు పక్కన ప్రవాహం కుచించుకుపో తోందంటే అది అవతలి ఒడ్డున సంఘటితమయ్యే ధోరణిని ప్రదర్శిస్తుంది. ఈ ఎన్నికల్లో మనం చూస్తున్న మరో ముఖ్యాంశం ఇది. పునాదిలోనే విశ్వసనీయత లోపించినప్పుడు అది ఎల్లప్పుడూ అంచుల వద్ద చీలికలను ప్రేరేపిస్తుంటుంది. నితీష్‌కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌లు ఆ కులాలు, మతాల వారు ఎన్నటికీ బీజేపీ వైపుకు పోరనే ఊహపై ఆధారపడి ఓటర్ల ఆమోదం తమకు లభించినట్టేనని భావిస్తు న్నారు. కానీ ఓటర్లు వారి నుంచి దూరంగా, మరో దిశకు పయనిస్తున్నారు. మరో విధంగా చెప్పాలంటే, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్‌కుమార్‌ల ప్రధాన ఓటర్లకు వారిపై ఇక ఎంత మాత్రమూ నమ్మకం లేదు. కాబట్టే ఇతర నేతలను అన్వేషిస్తున్నారు. ఒక భ్రమను ఎవరూ కొనరు. నితీష్, లాలూల తరఫున ప్రచారం కోసం అట్టహాసంగా స్వచ్ఛందంగా వచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా అంతకంటే తాను చేయగల మెరుగైన పనులు న్నాయని గ్రహించారు. బిహార్ ఎన్నికలపై నా అభిప్రాయం పక్షపాతంతో కూడినదని భావి స్తారనేది స్పష్టమే. ఆ పార్టీ సభ్యుణ్ణి కావడం వల్లనే నా అభిప్రాయాన్ని పక్షపాత పూరితమైనదిగా చూస్తారు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒక్క టే. ఒక్కసారి బిహార్‌కు వెళ్లి మీ కళ్లతో మీరే అక్కడ జరుగుతున్న ఓటర్లలో జరుగుతున్న మథనాన్ని చూడండి లేదా మరింత కచ్చితంగా చెప్పాలంటే విని రండి. మన ప్రజాస్వామ్యం నిశ్శబ్దంగా ఉండే ఓటరుకు ప్రసిద్ధి. కానీ ఈసారి బిహార్ ఓటరు నోరు విప్పుతున్నాడు. అలా అని ఎవరూ అరవడం లేదు. ఆ అవసరమూ లేదు. సాధారణంగానే ఉద్వేగంతోనో లేదా ఆగ్రహం తోనో గొంతులు పెరుగుతాయి, అయినా ప్రజల మనస్థితి ప్రశాంతంగా ఉంది. తమకు ఏమి కావాలో ప్రజలకు తెలుసు. ఓటింగ్ మొదలైనప్పుడు వారు తాము ఏమి కోరుకుంటున్నారో దాన్ని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు వారి మానసిక స్థితి వాదులాటకు సిద్ధంగా లేదు, ప్రశాతంగా ఉంది. ఉత్సుకతను రేకెత్తిస్తున్నది ఒక్కటే... ప్రస్తుత స్థితి తలకిందులు కావడ మనేది ప్రభుత్వంలో మార్పునకు మించినదాన్ని దేన్నో ప్రతిఫలించవచ్చు. చర్చ ఇప్పుడు సాంప్రదాయకమైన కుల, మత పెద్దల నియంత్రణలో లేదు. యువత దాన్ని మలుస్తోంది. నేతల విన్యాసాలతో యువత విసిగి పోయింది. అది జీవితాన్ని కోరుకుంటోంది. (వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి) - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
నూతన ఆర్థిక వ్యవస్థకు బ్లూప్రింట్
పేదలకు సమగ్ర సామాజిక భద్రతను కల్పించే దిశగా చేపట్టిన గొప్ప చర్య ఈ బడ్జెట్లోని అత్యంత ముఖ్యమైన అంశమని నా అభిప్రాయం. మన రాజ్యాంగంలో ఆ లక్ష్యం లిఖించి ఉంది. కానీ ఆ లక్ష్య సాధనకు సాధనాలు మాత్రం ఎప్పుడూ మన ఆర్థిక వ్యవస్థ శక్తికి మించినవిగానే అనిపిస్తుండేవి. ఈ సంప్రదాయక వివేకానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తల వంచలేదు. సామాజిక రంగంలోని బలహీలమైన లంకెలను ఆయన దృఢం చేశారు. వినూత్నమైన పథకాలను ఆవిష్కరించారు. సరిగ్గా చెప్పాలంటే ఇది అరుణ్ జైట్లీ తొలి బడ్జెట్. దీనిని చూసి దేశంలోని ఓ బృందం బాగా కలత చెందుతుంది. అది చిన్నదే అయినా అత్యంత శక్తివం తుల బృందం. వారంతా తమ సంపదను నల్లధనంగా మార్చి విదేశాల్లో లేదా స్వదేశంలోనే దాచినవారు. మోసకారులను గతానికి జవాబుదారీతనం వహించేలా చేసి వారికి కఠిన శిక్షలను విధించడం, పారదర్శకంగా నిర్ణయా లను తీసుకోవడం ద్వారా ముందు ముందు మోసాలు జరగకుండా నివారిం చడం అనే ద్విముఖ విధానంతో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీలు అవినీతిని సవాలు చేశారు. ధనవంతులు మీకంటే, నాకంటే భిన్నమైన వారనేది బాగా తెలిసిన విషయమే. వారివద్ద చాలా డబ్బుంది. డబ్బు సహజంగానే అహంకారాన్ని పెంచి పోషిస్తుంది. కానీ కొందరు భారత కుబేరులు అరుదైన రీతిలో ఆ తలబిరుసుతనంలో ప్రత్యేకీకరణను చూపుతున్నారు. తాము చేసినవి ఎంతటి తీవ్ర నేరాలైనా డబ్బు పడేసి శిక్ష తప్పించుకోగలమని వారి విశ్వాసం. నల్లధనానికి వ్యతిరేకంగా ప్రతిపాదించిన చట్టం ఇప్పుడున్న లొసుగులను అడ్డగిస్తుంది. జైలు అంటే కఠిన కారాగారవాసం. అంతేగానీ లంచాలతో కొనుక్కోగల సుఖ జీవితం కాదు. జైట్లీ బడ్జెట్ పట్ల అంసతుష్టితో ఉన్న మరో బృందం ఆయన విఫలం కావాలని కోరుకునే బాపతు. చాలా మంది ప్రతిపక్ష పార్టీల నేతల మొహాల్లో తొంగిచూస్తున్న విచారమే అందుకు ఆధారం. కొందరు తమలోని నిరాశా నిస్పృహలను డాంబికాల మాటున కప్పిపుచ్చుకోవాలని యత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ప్రజాస్వామిక ఆచరణ తరచూ వ్యతిరేకత కోసమే వ్యతి రేకత అనే అలవాటును ప్రోత్సహిస్తుంది. అలాంటి రాజకీయవేత్తలు అత్యంత ముఖ్యమైన ఒక అంశాన్ని విస్మరిస్తున్నారు. ఇది, ఐదేళ్లూ అధికారంలో కొనసాగగలమని ఆత్మవిశ్వాసంతో ఉన్న సుస్థిర ప్రభుత్వ బడ్జెట్. కాబట్టి అది సుస్పష్టంగా నిర్వచించుకున్న విస్తృత పరిధి దిశగా సమతూకంతో, స్థిరచిత్తం తో ఆచి తూచి అడుగులు వేయగలుగుతుంది. ఇది ఆరంభం మాత్రమే. వచ్చే ఏడాదికి ఈ ప్రభుత్వం మరింత సంతోషంగా ఉండవచ్చు. దృష్టి పథాన్ని ఎంత సుదూరానికైనా విస్తరించనివ్వడం, అంత దూర మూ పయనించగలిగేలా కాళ్లను మాత్రం నేలపైనే నిలిపి ఉంచడం అనే దే పరిపాలనాపరమైన తాత్వికత. ఆచరణాత్మకంగా ఉండటం అవసరం. పేద రికాన్ని ఎలా నిర్మూలించగలం? దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న భారతీ యులందరికీ విద్యుత్తు, మరుగుదొడ్లున్న ఇళ్లను అందించడం, మరీ ముఖ్యం గా ఇంటింటా ఉద్యోగం ఉన్న సంపాదనాపరుడు ఉండేలా చూడటం ద్వారా నే సాధ్యం. ఆత్మగౌరవంపై నమ్మకముంచండి. పేదలకు సమగ్ర సామాజిక భద్రతను కల్పించే దిశగా చేపట్టిన గొప్ప చర్య ఈ బడ్జెట్లోని అత్యంత ముఖ్యమైన అంశమని నా అభిప్రాయం.ఆర్థిక మంత్రి మాటల్లోనైతే అది ‘‘న్యాయమైన, దయతోకూడిన సమాజం.’’ మన రాజ్యాంగంలో ఆ లక్ష్యం లిఖించి ఉంది. కానీ ఆ లక్ష్య సాధనకు సాధనాలు మాత్రం ఎప్పుడూ మన ఆర్థిక వ్యవస్థ శక్తికి మించినవిగానే అనిపిస్తుండేవి. ఈ సంప్రదాయక వివేకా నికి జైట్లీ తల వంచలేదు. సామాజిక రంగంలోని బలహీలమైన లంకెలను ఆయన దృఢం చేశారు. వినూత్నమైన పథకాలను ఆవిష్కరించారు. నెలకు ఒక రూపాయికి ప్రమాద బీమా, రోజుకు ఒక రూపాయికి జీవిత బీమా పేదలకు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీలో ఇప్పుడు కనీసం డజను మంది మాజీ ఆర్థిక మంత్రులు ఉండి ఉండాలి. వారిలో కొందరు బడ్జెట్ నిపుణులుగా గుర్తింపును పొందినవారు కూడా. తమ బడ్జెట్లలో ఈ బీమా పథకాలను ఎందుకు ప్రవేశపెట్టలేదా? అని వారంతా ఇప్పుడు తమను తాము తప్పక తిట్టుకుంటూ ఉండాలి. ఉపశమన చర్యలతో పేదరికాన్ని పాక్షికంగానే నిర్మూలించగలం. పేదరిక నిర్మూలన మాత్రం ఉద్యోగాల కల్పన ద్వారానే సాధ్యం. నరేంద్ర మోదీకి భారతీయులలో విశ్వాసముంది. కాబట్టే ఆయన ప్రభుత్వ ఆర్థిక చింతనకు ‘మేక్ ఇన్ ఇండియా’ పునాదిరాయి కాగలిగింది. పెద్ద ఎత్తున ఉద్యోగా వకాశాలు విస్తరించాల్సిన అవసరం ఇప్పుడుంది. 1980ల కష్టకాలంలో రోనాల్డ్ రీగన్ అమెరికాకు అధ్యక్షునిగా ఉన్నారు. ‘‘మీ పొరుగువాడు ఉద్యోగం కోల్పోవడమంటే ఆర్థిక తిరోగమనం, మీరు ఉద్యోగం కోల్పోవడమంటే ఆర్థిక మాంద్యం’’ అని ఆయన అప్పట్లో ఒకసారి అభివర్ణించారు. 2013 నాటికి యూపీఏ ప్రభుత్వం ఆర్థిక తిరోగమనంపై, ఆర్థిక మాంద్యాన్ని పేరబెట్టింది. ఉద్యోగ కల్పనకు పెట్టుబడులు కావాలి. విశ్వసనీయతను తిరిగి నెలకొల్పలేకపోతే విదేశీ పెట్టుబడులైనా గానీ లేదా దేశీయ పెట్టుబడులైనా గానీ చేకూరవు. క్రమక్రమంగా విశ్వసనీయతను పెంపొందింపజేయడానికి కేంద్రం.. పజలను ద్రవ్యవ్యవస్థలో భాగస్వాములను చేయడమే మార్పునకు సంబం ధించిన కీలకమైన అంశంగా పరిగణించి వరుసగా పలు చర్యలను చేపట్టింది. తొమ్మిది మాసాలుగా సాగిన ఈ కృషి తదుపరి, నేటి బడ్జెట్ మన దేశాన్ని పెట్టుబడులకు సహేతుక గమ్య స్థానంగా పునఃస్థాపించగలిగింది. పేదల ఆర్థిక సాధికారత మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, వృది చెందుతున్న మార్కెట్‌గా మారుస్తుంది. తత్పర్యవసానంగా ప్రథమ ప్రయో జనం దేశీయ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకే సమకూరుతుంది. రోడ్లు, రైల్వేలు, నగరాలు, రేవుల వంటి మౌలిక సదుపాయాల రంగమే సమీప భవిష్యత్తులో అతి పెద్ద ఉపాధి కల్పనా వనరు కానుంది. సురేశ్ ప్రభు అద్భుతమైన రైల్వే బడ్జెట్‌ను అందించారు. రైల్వే స్టేషన్‌ను పట్టణ ఆర్థిక, వినోద కార్యక్రమాల కేంద్రంగా మార్చే అవకాశాన్ని అది అందించింది. స్టేషన్ 25 అంతస్తుల భవనం ఎందుకు కారాదని రైల్వే మంత్రి ప్రశ్నించారు. జాతీయ బడ్జెట్ ఆ దార్శనికత స్థాయిని పలురెట్లు హెచ్చించింది. దేశాన్ని పెద్ద ఎత్తున పరివర్తన చెందించడానికి అవసరమైన భారీ పెట్టుబడులకు చట్టప రమైన, పరిపాలనాపరమైన ప్రాతిపదికను సృష్టించడంలో పెద్ద ముందడు గులను వేయగలిగింది. దీని సంకేత శబ్దం (పాస్వర్డ్) మరో మారు కూడా జవాబుదారీతనంతో కూడిన స్పష్టతే. దివాలా చట్టం అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంస్కరణ. పెట్టుబడుల పేరిట బ్యాంకులను ప్రైవేటు ఖజానాలుగా మార్చి ఇష్టానుసారం కొల్లగొట్టిన నయవంచకులు ఇకపై కూలిన శిథిలాల మధ్య చాలా తక్కువ సౌఖ్యాన్నే అనుభవించగలుగుతారు. వృద్ధి ఒక గణాంకం కాదు. అది బ్యాంకు ఖాతాలోని కొన్ని అదనపు అంకెలకు మించి మరేమైనా కావాలంటే దానికి రక్తమాంసాలను ఇవ్వాలి. ఉద్యోగాలు, నైపుణ్యాలకు అవకాశాలు లేకపోతే, ఆర్థిక వ్యవస్థ కాగితపు పులి మాత్రమే అవుతుంది. జైట్లీ బడ్జెట్ నిజాయితీ, వాస్తవికవాదాలతో తయారైన డాక్యుమెంటు, భవితకు సంబంధించిన శక్తివంతమైన దృష్టి. అది దేశాన్ని వ్యూహాత్మకతతో పాటూ విశ్వసనీయమైన భవన నిర్మాతగా, వర్తమానాన్ని గుర్తించి భవితను మలుచుకోగల మనిషిగా పరివర్తన చెందించే ప్రణాళిక. భారత నూతన ఆర్థిక వ్యవస్థకు మొట్టమొదటి నమూనా చిత్రం. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
లాభంతో మొదలు
-
కాలిఫోర్నియా విభజనపై కదలిక
లాస్ ఏంజెలిస్: అమెరికాలో జనాభాలో అత్యంత పెద్దదైన కాలిఫోర్నియా రాష్ట్రాన్ని ఆరు రాష్ట్రాలుగా విభజించాలన్న ప్రతిపాదన వేగం పుంజుకుంది. విభజనపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న ప్రతిపాదన అర్హత సాధించేందుకు ప్రజలతో సంతకాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గత వారం అనుమతించింది. ఈ ప్రతిపాదన అర్హత సాధించాలంటే జూలై మధ్యనాటికి 8,08,000 వేలమంది సంతకాలు అవసరం. సిలికాల్ వ్యాలీకి చెందిన వెంచర్ పెట్టుబడిదారు టిమ్ డ్రేపర్ ఈ విభజన ప్రతిపాదనను తెచ్చారు. ‘3.8 కోట్ల జనాభా ఉన్న కాలిఫోర్నియా ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లో ఒక టి. రాష్ట్రంలో చాలా భాగంలో పాలన సరిగ్గా సాగడం లేదు.. రవాణా, మౌలిక సదుపాయాలు పాతవి. ఇకనైనా విభజించకపోతే పరిస్థితి దిగజారుతుంది’ అని ఆయన గురువారం ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ఆయన ప్రతిపాదనపై నవంబర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగే అవకాశముంది. ఒకవేళ దీని కి ప్రజలు అంగీకరించినా, కాంగ్రెస్ (పార్లమెం టు) ఒప్పుకుంటేనే విభజన సాధ్యమవుతుంది. అదే జరి గితే రాష్ట్రం పశ్చిమ, మధ్య, దక్షిణ కాలిఫోర్నియాలు, సిలికాన్ వ్యాలీ తదితర రాష్ట్రాలుగా విడిపోతుంది.