అమ్మో.. వచ్చేస్తుంది ఒకటో తారీఖు | Fear of Poor, middle class, Salaryman | Sakshi
Sakshi News home page

అమ్మో.. వచ్చేస్తుంది ఒకటో తారీఖు

Published Thu, Nov 24 2016 2:55 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

అమ్మో.. వచ్చేస్తుంది ఒకటో తారీఖు

అమ్మో.. వచ్చేస్తుంది ఒకటో తారీఖు

జనానికి పొంచి ఉన్న ‘నగదు’ గండం
బెంబేలెత్తిపోతున్న పేద, మధ్య తరగతి, వేతన జీవులు
పాల నుంచి పచారీ కొట్టు దాకా కష్టాలే

 
 క్యాష్.. క్యాష్.. క్యాష్...
 ఎహే... 15 రోజులుగా ఉన్న గొడవేగా...!
 మళ్లీ ఏంటి?
 అది కాదు బాబోయ్... ఫస్టొచ్చేస్తోంది...
 ఆ వస్తే?
 ఖర్చులండీ...
 ఇంటి అద్దె, పచారీ కొట్టు, పనిమనిషి,
 పాలవాడు, స్కూలు ఫీజు, పిల్లల ఆటో...
 వగైరా వగైరా
 వీటన్నింటికీ క్యాష్ కావాలి...
 వామ్మో... కొత్త నోట్లే!
 అవును... న్యూ క్యాష్
 మరెలా..? ఎలా... ఎలా?


 పెద్ద నోట్ల రద్దు దేశంలో ఎంతగా అలజడి సృష్టించినా... ప్రభుత్వ పెద్దలు, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు లాంటి కేంద్ర మంత్రులు... ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని, దేశహితం కోసం సహనంతో ఉండాలని చెబుతున్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందని, నల్లధనాన్ని లెక్కతేల్చి... దేశాభివృద్ధికి వెచ్చిస్తామని నొక్కి చెబుతున్నారు. మరోవైపు సామాన్యుడికేమో ఖర్చులకు నాలుగు కొత్తనోట్లను సంపాదించడానికి సరిపోతోంది. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. పైగా బ్యాంకుల్లో నగదు మార్పిడి పరిమితిని నాలుగు వేల నుంచి రెండు వేల రూపాయలకు కుదించారు.

ఏటీఎంలలో రెండు వేలకు మించి రాదు... అదీ గంటల కొద్దీ లైన్లలో నిలబడి.. అదృష్టం బాగుండి మీవంతు వచ్చేసరికి మిషన్‌లో నగదు ఉంటే! చెక్కుతో తీసుకుంటే ఒకేసారి రూ.24 వేలు (వారానికి) ఇస్తామని ప్రకటించినా... నగదు కొరతతో బ్యాంకులు అంత ఇవ్వట్లేదు. నగదు లావాదేవీలపై ప్రధానంగా ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థ మనది. మొదటి తారీఖుకల్లా జీతాలు చేతికందే వారితో పాటు ఇతరులకు కూడా.. నెలలో తొలివారమే కీలకం. ఉండే ఖర్చులన్నీ ఈ వారంలోనే. పాలవాడి నుంచి పచారీ కొట్టు దాకా బిల్లులు చెల్లించాల్సింది ఈ మొదటి వారంలోనే. సాధారణంగా నెలారంభంలో మధ్యతరగతి జీవికి అయ్యే ఖర్చులు... పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అతనికున్న చెల్లింపు వెసులుబాట్లు ఏంటో చూద్దాం.

 అద్దె: సొంతిళ్లు లేని వారికి ఇదో సమస్య కానుంది. ఇంటి యజమాని తన అద్దె ఆదాయాన్ని లెక్కల్లో చూపడానికి ఇష్టపడకపోతే (ఉద్యోగిగా జీతం తీసుకుంటున్నా, ఇతరత్రా వ్యాపారాల ద్వారా సంపాదిస్తూ అప్పటికే అదాయపు పన్ను చెల్లిస్తున్నా.. ఇంటిపై వచ్చే అద్దెను చాలామంది లెక్కల్లో చూపరు) అద్దెకుండే వారికిచిక్కే. ఎందుకంటే యజమాని చెక్కు వద్దంటాడు. అద్దెను నగదు రూపంలో... అదీ కొత్త నోట్లతో చెల్లించాలి. రూ.5 వేల నుంచి రూ.10 వేల దాకా నగదు అవసరం ఉంటుంది.

 మెరుుంటెనెన్‌‌స: నెలవారీ ఖర్చుల నిమిత్తం చాలావరకు అపార్ట్‌మెంట్లో నగదు రూపంలోనే మెరుుంటెనెన్స్ వసూలు చేస్తారు. ఇది వెరుు్య నుంచి రెండున్నర వేల రూపాయల వరకు ఉంటుంది.

 కిరాణా దుకాణం: నెలకు సరిపడా బియ్యం, పప్పులు, ఇతర వస్తువులు కొనాలి. సూపర్‌మార్కెట్లలో కార్డులు తీసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ పేదలకు ఇబ్బందే. అలాగే చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో కార్డుల సదుపాయం ఉండదు కాబట్టి నగదు పెట్టి కొనాల్సిందే.

 పాలు, పేపర్ బిల్లు: పాలు, పేపర్ బిల్లుకు నగదు ఇవ్వాల్సిందే. ఇందుకు రూ.2 వేల వరకు కావాలి.
 కూరగాయలు: నగదు పెట్టే కొనాలి. వారాంతాల్లో నాన్‌వెజ్ అరుునా క్యాష్‌తోనే కొనాలి.
 కేబుల్ బిల్లు: నగదు రూపంలోనే చెల్లించాలి. డిష్ టీవీలు ఉంటే ఆన్‌లైన్‌లో మొబైల్ బ్యాంకింగ్ లేదా కార్డు ద్వారా రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
 గ్యాస్ బిల్లు: ప్రస్తుతానికి పాతనోట్లు తీసుకుంటున్నా... ప్రభుత్వం గడువు పెంచకపోతే వచ్చేనెల నుంచి ఇది కూడా కొత్తనోట్లతో లేదా రూ.100 నోట్లతో చెల్లించాల్సిందే.
 స్కూలు ఫీజులు: పాఠశాలలు, కాలేజీల్లో వారుుదాల రూపంలో ఫీజులు కట్టే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు వీటి వారుుదాలను కొత్తనోట్లతో నగదు రూపంలోనే స్కూలు కౌంటర్లో చెల్లించాలి. బ్యాంకుల్లో చెల్లించే వెసులుబాటు ఉన్న స్కూళ్లలో తల్లిదండ్రులకు కొంత ఉపశమనం.
 
 స్కూల్ వ్యాన్ బిల్లు: నగదు రూపంలోనే ఇవ్వాలి.
 ప్రైవేటు ట్యూషన్ ఫీజు: నగదు రూపంలోనే ఇవ్వాలి.
 కరెంటు బిల్లు: ఆన్‌లైన్‌లో చెల్లించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అరుుతే ఊరికి బిల్ కలెక్టర్ వచ్చినపుడు నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది.
 ఇంటర్నెట్, మొబైల్ బిల్లులు: ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చు. నగదు రూపంలో కట్టేవారికి ఇదో అదనపు భారం. గ్రామీణులకు దీనికి క్యాష్ అవసరం.
 పని మనిషి: చేసే పనిని బట్టి రూ.1,500 నుంచి రూ.3 వేల వరకు నగదు ఇవ్వాల్సి ఉంటుంది.
 ఇస్త్రీ: సగటున ఐదారు వందలు. నగదు ఇవ్వాలి.
 ఈఎంఐ: టూ వీలర్ లేదా ఫోర్ వీలర్, గృహరుణం తీసుకున్న వారికి కిస్తులు (ఈఎంఐలు) చెల్లించాల్సి ఉంటుంది. అరుుతే ఈసీఎస్, చెక్కుల రూపంలో ఇది జరిగిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు.
 ప్రైవేటు చీటీలు: రిజిస్టర్ చిట్‌ఫండ్‌లు అరుుతే చెక్కు లు, ఆన్‌లైన్ పేమెంట్లు స్వీకరిస్తారుు. అరుుతే చాలామంది మిత్రులు, బంధువులు, పరిచయస్తుల దగ్గర ప్రైవేటు చీటీలు వేయడం అలవాటైపోరుుంది. ఇది చట్టబద్ధమైనది కాదు కాబట్టి నగదులోనే ఇవ్వాలని నిర్వాహకులు కోరుతారు. వేసే చీటీని బట్టి కిస్తు మొ త్తం ఉంటుంది. దీనికీ నగదు సర్దాల్సి వస్తుంది.
 
 ఆఫీసుల్లో మైక్రో ఏటీఎం
 జనం నగదు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొన్ని పెట్రోల్ బంకుల్లో మైక్రో ఏటీఎంల ద్వారా కొత్తనోట్లను విత్‌డ్రా చేసుకొనే అవకాశం కల్పించారు. అలాగే ఒకటో తేదీ నుంచి ఆఫీసుల్లోనే మైక్రో ఏటీఎం ద్వారా నగదును అందజేయవచ్చు. ఉద్యోగి వేతన ఖాతాను అనుసంధానించిన డెబిట్ కార్డు ద్వారా విత్‌డ్రా పరిమితిని పెంచి మైక్రో ఏటీఎంతో రూ.15 వేల నగదును ఉద్యోగి చేతికి అతని కార్యాలయంలోనే అందించొచ్చు.
 
► ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు బ్యాంకుల్లో భారీ క్యూలో నిలబడటం కష్టమే. క్యూలలో ఇప్పటికే పలువురు అస్వస్థతకు గురై చనిపోయారు. కాబట్టి వీరికోసం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడం, నీడ, తాగునీటి వసతి లాంటివి కల్పిస్తే కాస్త ఉపశమనం ఇచ్చినట్లవుతుంది. ఖాతాలు లేనివారికి నేరుగా గ్రామపంచాయతీల్లో నగదు అందజేస్తున్నట్లే నవంబరు పింఛన్‌ను అందరికీ నగదు రూపంలో అందజేసే అవకాశాలను పరిశీలించడం మరో మార్గం.
 
వారంలో పెళ్లి..  డబ్బుల కోసం కంటతడి
  ‘‘సార్.. నా కుమారుడి పెళ్లి.. ఎలాగైనా చేసి డబ్బులియ్యండి..’’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నిమ్మవానిపల్లెకు చెందిన నిమ్మల శ్రీనివాస్ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన కుమారుడు వెంకటేశ్ పెళ్లి డిసెంబర్ 1న జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అరుుతే పెళ్లి ఖర్చుల కోసం సమకూర్చుకున్న డబ్బు బ్యాంకులో ఉంది. దీంతో ముస్తాబాద్‌లోని ఎస్‌బీఐకి వెళ్లి.. డబ్బులివ్వాలని కోరగా రూ.24 వేల కంటే ఎక్కువ ఇవ్వలేమని సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో ఏం చేయాలో తెలియక శ్రీనివాస్ కంటతడి పెట్టారు.
 
సేవింగ్స్ ఖాతా డిపాజిట్‌కే పాత నోట్ల వెసులుబాటు
  సాక్షి, హైదరాబాద్: పోస్టాఫీసుల్లో కేవలం సేవింగ్‌‌స బ్యాంక్ ఖాతాలోనే రద్దైన రూ.500, రూ.1,000 నోట్ల డిపాజిట్లకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తపాలా శాఖ వర్గాలు తెలిపారుు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పాత నోట్ల డిపాజిట్లను అంగీకరించకూ డదని మంగళవారం స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా సేవింగ్ బ్యాంక్ ఖాతాకు మినహారుుస్తూ సవరణ ఆదేశాలు జారీ చేసింది. పోస్టాఫీసుల్లో చిన్న మొత్తాల పథకాల పరిధిలోకి వచ్చే సేవింగ్‌‌స బ్యాంక్, రికరింగ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి అకౌంట్ (ఎస్‌ఎస్‌ఏ), మంత్లీ ఇన్‌కం స్కీం (ఎంఐఎస్), సీనియర్ సిటిజన్ అకౌంట్ తదితర ఖాతాల్లో డిపాజిట్లకు పాతనోట్లను అనుమతిస్తూ వచ్చారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయంతో కేవలం సేవింగ్‌‌స బ్యాంక్ అకౌంట్ డిపాజిట్‌కు మాత్రమే పాత నోట్లను అనుమతించనున్నారు.  
 
 పర్యవసానాలు...
► మొదటి వారంలో నగదు తిప్పలు ఉంటారుు కాబట్టి ఉద్యోగుల హాజరు శాతంపై ప్రభావం ఉంటుంది.
► ఏటీఎంలో తీసుకునే డబ్బు ఏమూలకు సరిపోదు. బ్యాంకుల్లో చెక్కు ద్వారా డబ్బు ‘డ్రా’ చేయడానికి క్యూలో నిలబడితే ఆ రోజుకు ఆఫీసుకు ఎగనామమే అవుతుంది. పైగా బ్యాంకుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లకు కూడా తీవ్ర ఇబ్బందే. వయోభారం కారణంగా వారు బ్యాంకు క్యూలలో గంటలకొద్దీ నిలబడలేరు.
 
 ఇలా చేస్తే కాస్త ఊరట..
► కేంద్ర ప్రభుత్వ, రక్షణ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని గ్రూపు ‘సి’ ఉద్యోగులకు రూ.10 వేలు వేతన అడ్వాన్సును నగదు రూపంలో ఇస్తున్నారు.
► రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు కూడా తమ ఉద్యోగులకు నవంబరు నెల వేతనాన్ని ఓ రూ.15 వేల వరకు కొత్తనోట్లను ఇస్తే.. వేతనజీవి బండి సాఫీగా సాగుతుంది. లేకపోతే చుక్కలు కనిపిస్తారుు.
► తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు నవంబర్ జీతం (డిసెంబరు ఒకటిన ఇచ్చేది) మొత్తాన్ని నగదు రూపంలో (కనీసం రూ.10 వేలు) ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
► కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఇలాంటి వెసులుబాటును కల్పిస్తే.. తక్షణావసరాలకు చేతిలో డబ్బు ఉంటుంది. జనం అవసరాలు కొంతమేరకు తీరుతారుు.
 
 జనం ముందున్న మార్గాలివీ
 ఏటీఎం: రూ.2 వేలు. (రోజుకు రూ.2 వేల చొప్పున ఖర్చులకు సరిపడా తీయాలంటే ఏడెనిమిది రోజులు క్యూలో నిలబడాలి. ఇది అసాధ్యం. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఖాళీగా ఉంటే క్యూలో నిలబెట్టొచ్చు)
 చెక్కు ద్వారా విత్‌డ్రా: వారానికి 24,000. (ఆర్బీఐ ఎక్కువ డబ్బు ఇవ్వట్లేదని, తమ దగ్గరున్న నగదును అందరికీ సర్దాల్సి ఉంటుందని, కాబట్టి తక్కువ మొత్తమే ఇవ్వగలమని బ్యాంకులు చెబుతున్నారుు)
 డెబిట్/క్రెడిట్ కార్డులు: పట్టణ ప్రాంతాల్లో చెల్లింపులకు వాడుకోవచ్చు. ప్రధానంగా కరెంట్, నెట్, కిరాణా బిల్లులు తదితరాలకు వాడొచ్చు కానీ అద్దె, పనిమనిషి వేతనం లాంటి ఇతరత్రా అవసరాలకు కుదరదు. చిన్న పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో వీటిద్వారా లావాదేవీలకు ఆస్కారం తక్కువ.
 వ్యాలెట్ యాప్స్: బిల్లుల చెల్లింపు, డిష్ టీవీ, మొబైల్ రీచార్జ్‌లు తదితరాలకు వాడుకోవచ్చు. మొబైల్‌లో నెట్ యాక్సెస్ ఉండి.. వీటిని వాడగలిగేవారికి ఓకే. అరుుతే గ్రామీణులకు వీటిపై అవగాహన లేదు. వాడలేరు.
 - సాక్షి నాలెడ్‌‌జ సెంటర్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement