రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రబోధాలన్నీ పరులకోసమే కాని తాను మాత్రం పాటించాలన్న స్పృహ ఆయనకు ఏనాడు లేదనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే నారావారిదంతా పరోపదేశ పాండిత్యమే. పొదుపు గురించి, ప్రజాధన సంరక్షణ, నీతి, నిరాడంబరత్వం గురించి పదేపదే పసలేని ప్రసంగాలు చేస్తాడు గానీ వాటిలో ఏ ఒక్కదాన్నీ పాటించే అవసరం ఆయనకు లేనట్లుగానే కనిపిస్తోంది.
నిజంగా తాను చెప్పే విషయంపట్ల వారికి చిత్త శుద్ధి ఉంటే తన అభిరుచుల కోసం, వాస్తు పై తన నమ్మకాల కోసం సచివాలయంలో మార్పులు, చేర్పుల కోసం, ఆ పేరుతో హంగులు, ఆర్భా టాల కోసం ఇప్పటివరకూ ప్రజాధనం రూ.81 కోట్లు ఖర్చు పెట్టడు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అధునాతన సెల్‌ఫోన్లు బహుమతిగా ఇవ్వవలసిన అవసరం ఏమిటి? వాటిని ఉపయోగించే ప్రాథమిక పరిజ్ఞానం మన ప్రజా ప్రతినిధుల్లో ఎంతమందికి ఉంది? ఇది వృథావ్యయం కాదా? ఇతరులకు ఉపదేశాలు, తనకు మాత్రం స్వప్రయో జనాల నుంచి బాబు బయటపడితే మంచిది.
- ఈదుపల్లి వెంకటేశ్వరరావు, ఏలూరు
పరోపదేశ పాండిత్యం
Published Fri, May 22 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement
Advertisement