పింఛనుదారులపైన పిడుగు
విశ్లేషణ: ఉద్యోగి మరణించినప్పుడు గానీ, రాజీనామా చేసినప్పుడు గానీ అతనికి, అతని కుటుంబానికి ఏ రకంగా లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని ఈ బిల్లులో స్పష్టపరచలేదు. 25-30 ఏళ్ల తరువాత ఈ ఫండ్ మేనేజర్‌పై ప్రభుత్వ అజమాయిషీ ఎంతవరకు ఉంటుంది? ఏజెన్సీ, సంబంధిత మార్కెట్ దివాళా తీసినా, మూతపడినా ఆ సంస్థలో జమ అయిన ఫండ్‌కు ఎవరు బాధ్యత వహిస్తారో ఈ బిల్లులో పొందుపరచలేదు.
సంస్కరణలు, ప్రపంచీకరణ ల అసలు స్వరూపం రోజు రోజు కూ స్ఫుటంగా కనిపిస్తోంది. అమర్త్యసేన్ వంటివారు సంస్క రణలకు మానవీయ కోణం ఉం డాలని ఎంత చెప్పినా ప్రభుత్వా లకు పట్టడం లేదు. సంస్కర ణలు, వీటి పునాదిగా జరుగుతున్న ప్రభుత్వ నిర్ణయాలు అమానవీయంగానే ఉంటున్నాయి. ఆఖరికి ఉద్యోగులు దీర్ఘకాలంగా పోరాడి సాధించుకున్న పింఛను పథకం కూడా ఇక మార్కెట్ పరం కానుంది. ఉద్యోగుల పింఛను పథకానికి సంబంధించిన 80 బిలియన్ డాలర్లు బాండ్ మార్కెట్‌కు ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించ నుంది. ఈ నిధిని కార్పొరేట్ బాండ్లలో మదుపు చేయడా నికి నిబంధనలు సరళం కానున్నాయి. కొత్త నిబంధనలు వెబ్‌లో మాత్రమే, రహస్యంగా కనిపిస్తాయి.
ఇదంతా అమలులోకి రావడానికి ఇక మిగిలి ఉన్న లాంఛనం- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆమోదమే. భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేటురంగాలకు చెందిన ఎనిమిదిన్నర కోట్ల మంది పింఛను నిధి భవిష్య నిధి సంస్థ నిర్వహణలో ఉం ది. దీనిని ఇతర రంగాలలో మదుపు పెట్టడం నిబంధ నలకు విరుద్ధం. కానీ కొత్త నిబంధనల ప్రకారం మొత్తం పింఛను నిధిలో ఐదు శాతం వరకు ట్రెజరీ బిల్లులతో సహా మనీ మార్కెట్‌లో మదుపు చేయవచ్చు. ఈ నిధులను ఇప్పుడు 55 శాతం వరకు కూడా ప్రభుత్వ రంగ ఆర్థిక వ్యవస్థలలో మదుపు చేయవచ్చు.
పారిశ్రామికవేత్తల కోసమే!
విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు ఆసరాగా నిలిచే పింఛను నిధి నిల్వలను పెట్టుబడుల రూపంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాల కోసం మళ్లించడానికి దీర్ఘకాలంగా మూల బడి ఉన్న పింఛను నిధి, నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) బిల్లు 2011ను 4 సెప్టెంబర్ 2013న లోక్ సభ ఆమోదించింది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల ఒత్తిడి మేరకు పెన్షన్ భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగుల ప్రయోజనాలను గాలికొదిలేసి ప్రైవేట్ పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమో దించిందనే దేశంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గా లు నమ్మవలసివస్తున్నది. ఈ బిల్లు ఆమోదానికి వ్యతిరే కంగా ఢిల్లీలో 12 డిసెంబర్ 2013న అభిల భారత ప్రభు త్వ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే మహా ప్రదర్శనలో అన్ని రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఉద్యో గులు పాల్గొననున్నారు.
ఎన్డీయే, యూపీఏల పాత్ర
మొట్టమొదటిసారిగా ఈ పీఎఫ్‌ఆర్‌డీఏ బిల్లును 2003లో ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 6వ సీపీసీ (సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్, పాలసీ) ఈ బిల్లును పరిశీలించడానికి 2006లో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ తన నివేదికలో నూతన ఫింఛను విధానం అమలు చేయడం వలన పూర్వం నుంచి అమలులో ఉన్న ఉద్యోగుల పింఛను విధానం సందిగ్ధంలో పడింది. కనుక మరో కొత్త విధానాన్ని అమలు చేసేటప్పుడు జాగ్రత్తలు ఎంతైనా అవసరమని స్పష్టం చేసింది. 2011లో యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లుకే కొన్ని సవరణలు చేసి పార్లమెంటు లో ప్రవేశపెట్టింది. దీని ద్వారా పింఛనుదారుల సొమ్ము లో కొంత భాగాన్ని మార్కెట్లలో మదుపుచేయడానికి వీలు కల్పించాలని కోరింది.
ముఖ్యాంశాలు
సైనిక బలగాలు మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు లలో 2004 జనవరి 1 నుంచి చేరిన ఉద్యోగులను ఈ బిల్లు పరిధిలోకి తెస్తారు. స్వచ్ఛంద ప్రవేశ ప్రాతిపదికన 2009 నుంచి పౌరులందరికీ వర్తిస్తుంది. ఈ చట్టం పరిధిలోని ఉద్యోగులు సాధారణ భవిష్యనిధిలో జమ చేసుకునేం దుకు వీలులేదు. ఈ పెన్షన్ ఫండ్‌పై అజమాయిషీ చట్ట పరమైన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఉంటుంది. ప్రతి ఉద్యోగి బేసిక్‌పే, డీఏ కలిపిన మొత్తంలో 10 శాతం ప్రతినెలా ఈ పింఛన్ ఫండ్‌లో జమ చేయాలి. ఇందులో జయ అయిన మొత్తాన్ని ఎట్టి పరిస్థితు ల్లోనూ పదవీ విరమణ దాకా ఉపసంహరించరాదు. ఈ బిల్లులో వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బును తీసుకునేందుకు ప్రభుత్వానికి ఆమోదం లభించింది. ఈ బిల్లులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని మంత్రి మండలి 26 శాతంగా నిర్ణయించింది. దీనికి తోడు ప్రభుత్వం పెన్షన్ బాధ్యతలను తప్పించుకోవడానికి ఉద్యోగులు దాచుకున్న సొమ్మును పరిమితికి లోబడి ప్రభుత్వమే స్టాక్ మార్కెట్‌కు తరలించడం, పెన్షన్ నిర్వహణ సంస్థలోకి బీమా రంగం లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి తగిన చట్టబద్ధతను ప్రభుత్వం పొందింది.
అన్నీ అస్పష్టతలే
చందాదారులకు కనీస ఆదాయాన్ని ఇచ్చే విధంగా రూపొందించామన్న ఈ పెన్షన్ విధానంలో దాదాపు 30 నుంచి 35 సంవత్సరాలు ఒక ఉద్యోగి ప్రభుత్వ సర్వీసులో పనిచేసి ఈ నిధికి డబ్బు జమ చేసిన తరువాత పదవీ విర మణ చేస్తే ప్రతి రూపాయికి ఎంత పెన్షన్ వస్తుంది? కనీ సం వడ్డీ ప్రకటిస్తుందా? అన్న విషయాల్లో స్పష్టత లేదు. ఉద్యోగి మధ్యలో మరణించినప్పుడు గానీ, రాజీనామా చేసినప్పుడు గానీ అతనికి, అతని కుటుంబానికి ఏ రకం గా లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని ఈ బిల్లులో స్పష్టపర చలేదు. 25-30 ఏళ్ల తరువాత ఈ ఫండ్ మేనేజర్‌పై ప్రభు త్వ అజమాయిషీ ఎంతవరకు ఉంటుంది? ఏజెన్సీ, సం బంధిత మార్కెట్ దివాళా తీసినా, మూత పడినా ఆ సంస్థలో జమ అయిన ఫండ్‌కు ఎవరు బాధ్యత వహిస్తారో ఈ బిల్లులో పొందుపరచలేదు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వోద్యో గులకు మాత్రమే ఈ బిల్లును వర్తింపజేసి, సైనికోద్యోగు లకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో వివరించలేదు. ఈ బిల్లులో పీఎఫ్‌ఆర్‌డీఏ సంస్థకు చట్టబద్ధత లభించడం ఒక్కటేనా, ఇతరత్రా మార్పులేమైనా ప్రతిపాదించారా? అన్నది సగటు ఉద్యోగికి అర్థం కావడం లేదు.
ఒడిదుడుకులలో పింఛన్
ఈ బిల్లు అమలైతే పెన్షన్‌లో పెంపుదల ఉండకపోవచ్చు. 2004 నుంచి అమలు చేస్తున్న సీపీఎస్ విధానంలో ఉద్యో గుల జీతాల నుంచి పెన్షన్ ఫండ్‌లోకి జమ అయ్యే మొత్తా నికి హామీ లేదు. ఉద్యోగి దాచుకున్న మొత్తమంతా పదవీ విరమణ వరకు అక్కడే చిక్కుకుపోయి ఉంటుంది. పాత పెన్షన్ విధానం వర్తించే వారికీ గ్రాట్యూటీ చెల్లింపు అను మానమే. మెచ్యూరిటీ సమయంలో 40 శాతం మొత్తాన్ని తదుపరి నెలవారిగా పింఛను అందుకోవడానికి పీఎఫ్‌ఆర్ డీఏ వద్దనే ఉండాలనడం సరికాదు. ఉద్యోగం వలన పొం దే స్థిర ఆదాయం నిలిచిపోయిన విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే భృతి ఇక మార్కెట్ ఒడిదుడు కులకు లోనుకానుంది. వేతనజీవులకు జీతాల నుంచి దాచుకున్న సొమ్ముపై అధికారం ఉండదు. ప్రభుత్వానికే అధికారం లభిస్తుంది. సాధారణ భవిష్యనిధి (జీపీఎఫ్) లో ఇచ్చే విధంగా మధ్యలో అప్పు ఇచ్చే సౌకర్యం, నిధిలో పార్ట్ ఫైనల్ పేమెంట్‌లు కల్పించకపోవడం, వేతన సవర ణలు ప్రకటించినప్పుడల్లా పింఛనుదారులకు కూడా ఇస్తు న్న భృతి పెంచకపోవడం. ఆర్థిక సంస్కరణలు, పెట్టుబ డుల ఉపసంహరణ వంటి వాటితో యూపీఏ ఉద్యోగ వర్గాల నుంచి కొత్త సమస్యను కొని తెచ్చిపెట్టుకుంది.
కార్మిక శంఖారావం
మొత్తంగా ఈ వైఖరిని నిరసిస్తూనే జాతీయ స్థాయి కార్మిక సంఘాలు పార్లమెంటు ముందు నిరసన ప్రదర్శన నిర్వ హించాలని భావిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఆపాలనీ, కార్మిక చట్టాలను పటిష్టం చేయాలనీ, కనీస వేతనాలు పెంచాలనీ కూడా ఈ ప్రదర్శనలో కార్మిక సంఘాలు గట్టిగా కోరనున్నాయి. ప్రధానిని కలిసి పది సూత్రాలను ప్రతిపాదించాలని కూడా కార్మిక నేతలు ఆశిస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరే షన్‌లో వాటాల ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణ యించిన నేపథ్యంలో కార్మిక సంఘాలు ఈ నిరసనకు దిగుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల కోట్లు పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా సేకరిం చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఎన్‌టీయుసీ, ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. ఇంకా ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండి యా కార్మిక సంఘం కూడా పాల్గొంటున్నది.
రాష్ట్రపతికి వినతి
నిజానికి ఈ మేనెలలోనే పది అంశాలతో కూడిన ఒక విన తిపత్రాన్ని కార్మిక సంఘాలు ప్రధానమంత్రికి సమర్పిం చాయి. ఇందులో పెట్టుబడుల ఉపసంహరణ తక్షణం నిలిపివేయాలని , కనీస వేతనాలు వెంటనే పెంచాలని కోరారు. మొత్తంగా ఉద్యోగులకు, కార్మికులకు పింఛను సౌకర్యం వర్తింపచేయాలని కూడా కార్మిక సంఘాలు కోరు తున్నాయి.ఈ అంశాలను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నాయకత్వంలోని మంత్రుల బృందానికి ప్రధాని అందచే శారు. మంత్రివర్గ బృందం మాత్రం వీటి గురించి ఆలోచిం చడానికి ఇంకా సమయం కావాలని కోరింది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని, పెన్షన్ నిధుల ప్రైవేటీకరణ ఆ పాలని, ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించరాదని, రాష్ర్టపతి అనుమతి ఇవ్వరాదని, ప్రస్తుత పాతపెన్షన్ విధా నాన్నే కొనసాగించాలని సంఘాలు కోరుతున్నాయి.
- హరి అశోక్ కుమార్
గౌరవ అధ్యక్షులు రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం