‘గత విస్మృతి’తో గందరగోళం
తన గతం ప్రపంచం దృష్టి నుంచి చెరిగిపోవాలని ఈ హక్కు మేరకు వ్యక్తులు కోరవచ్చు. ఆ క్రమంలోనే ఇంటర్నెట్ నుంచి ఫొటోలు, వివరాలు, అందుకు సంబంధించిన లింకులను కూడా తొలగించమని సమాచార వ్యవస్థలను కోరే హక్కు వారికి సంక్రమిస్తుంది.
వ్యక్తులు తమ తమ చేదు గతాన్ని సమాజం దృష్టి నుంచి మరుగుపరచాలని కోరుకోవచ్చున ని చెప్పే హక్కు గురించి ఇప్పుడు కొన్నిదేశాలు మాట్లాడుతున్నాయి. దీనికే ‘గత విస్మృతి హక్కు’ అని పేరు పెట్టారు. ఇందువల్ల ఒక వ్యక్తికి సంబంధించిన గతం, అందులోని చీకటికోణం మూడో కం టికి తెలియదన్నమాట. మనిషి తన గతాన్ని మరచిపోవడం ఎలాగూ సాధ్యం కాదు. కాబట్టి సమాజమే దానిని మరచిపో యేటట్టు చేయాలన్నదే ఈ హక్కు అసలు ఉద్దేశం. జీవితం స్వయం ప్రతిపత్తితో ముందుకు సాగేందుకు ఈ హక్కు అవ సరమని అనుకూలురు చెబుతున్నారు. తన గతం ప్రపంచం దృష్టి నుంచి చెరిగిపోవాలని ఈ హక్కు మేరకు వ్యక్తులు కోర వచ్చు. ఆ క్రమంలోనే ఇంటర్నెట్ నుంచి ఫొటోలు, వివ రాలు, అందుకు సంబంధించిన లింకులను కూడా తొలగిం చమని కోరే హక్కు వారికి సంక్రమిస్తుంది. కానీ ప్రైవసీ హక్కుకూ, గత విస్మృతి హక్కుకు చాలా తేడా ఉంది. యూరోపియన్ యూనియన్ ఆవిర్భవించిన తరువాత కొన్ని దేశాలలో, ప్రధానంగా ఫ్రాన్స్, అర్జెంటీనాలలో ఈ హక్కు గురించి ఎక్కువ చర్చ జరిగి, ప్రోత్సాహం కూడా లభించింది. కానీ దీనిని మానవ హక్కులలో భాగంగా పరిగణించడం గురించీ, ఒక హక్కుగా గుర్తించడం గురించీ కూడా ఈయూ దేశాల మధ్యనే ఏకాభిప్రాయం లేదు.
నిజానికి ఈ హక్కు యాదృచ్ఛికంగా తెర మీదకు వచ్చిం ది. వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని విచ్చల విడిగా సేకరించే విధానాలను నిరోధించే ఉద్దేశంతో యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ డెరైక్టివ్ అనే చట్టాన్ని యూరో పియన్ యూనియన్ రూపొందించినపుడే గత విస్మృతి హక్కు అంశం వెలుగు చూసింది. దీనిని మానవహక్కుల చట్టంతో సమానంగా చూడాలన్న అభిప్రాయం కొన్ని దేశా లలో వ్యక్తమవుతోంది. ఫ్రాన్స్, అర్జెంటీనా కొంతవరకు అమెరికా ఈ హక్కును గౌరవిస్తున్నాయి కూడా. ఫ్రాన్స్ 2010లోనే దీనికి చట్టబద్ధత కల్పించింది.
గత విస్మృతి హక్కు ఎలాంటి వారు కోరారు? ఎందుకు కోరారు? ఒక్క ఉదాహరణ: 2014 మే నెలలో స్పెయిన్‌లో జరిగిన ఉదంతమిది. దీనినే యూరోపియన్ యూనియన్ కోర్టు వర్సెస్ కోసెజా కేసు అంటారు. స్పెయిన్‌కు చెందిన మేరియా కోసెజా తన ఇల్లు వేలానికి సంబంధించి గూగుల్ లో పెట్టిన ఒక క్లిప్పింగ్ లింక్‌ను తొలగించమని ఆదేశించవ లసిందిగా యూరోపియన్ కోర్టును ఆశ్రయించారు. తీసు కున్న రుణం తిరిగి చెల్లించలేకపోవడంతో కోసెజా ఇల్లు వేలం వేసిన సంగతిని తెలియచేసే క్లిప్పింగ్ అది. తరువాత కోసెజా రుణం చెల్లించారు. దీనితో ఆ క్లిప్పింగ్ ఉన్న లింక్‌ను తొలగించాలని కోసెజా కోరుకుని న్యాయపోరాటం చేశారు. యూరోపియన్ కోర్టు ఆ విన్నపాన్ని ఆమోదించి, గూగుల్‌కు ఆదేశాలు ఇచ్చింది.
ఇలా గత విస్మృతి హక్కును వినియోగించదలుచుకున్న వారు ఎవరైనా ఉంటే, అలాంటి వారు కూడా సంప్రదించవ లసిందని గూగుల్ ఒక ప్రకటన కూడా ఇచ్చింది. తరువాత చూడాలి! కేవలం 24 గంటలలోనే 12,000 విన్నపాలు ముం చెత్తాయి. మొదటి నాలుగు రోజులు గడిచేసరికి విన్నపాల సంఖ్య 40,000కు చేరింది. నెల తిరిగేసరికి 70,000 వేల విన్న పాలు గూగుల్ మీద వెల్లువెత్తాయి. వీటిలో ఫ్రాన్స్‌కు చెందినవే ఎక్కువ. దాదాపు 52 శాతం విన్నపాలను గూగుల్ గౌర వించింది. కొన్నింటిని తిరస్కరించ వలసి వచ్చింది. చివరికి ఇందుకోసం గూగుల్ ఓ సలహా మండలిని నియమించింది.
కానీ గత విస్మృతి హక్కు మీద ఏకాభిప్రాయానికి రావ డం ఇప్పట్లో సాధ్యం కాదనే అనుకోవాలి. ఇందుకు ప్రధాన కారణం అందులోనే అస్పష్టత. గత విస్మృతి హక్కుకు పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పిస్తే వాక్ స్వాతంత్య్రానికి చేటు జరుగు తుందన్న అనుమానాలు ఉన్నాయి. సెన్సార్‌షిప్ కారణంగా ఇంటర్నెట్ సేవలలో నాణ్యత లోపిస్తుందనీ, చరిత్ర పునర్‌ని ర్మాణానికి ఆటంకంగా మారుతుందనీ కూడా విమర్శలు ఉన్నాయి.
ఇలాంటి అనుమానాలు అమెరికాకు కూడా ఉన్నా యి. అయినా, ఒకసారి వెలుగుచూసిన వాస్తవిక సమాచారా న్ని అభ్యంతరాల రూపంతో ఉపసంహరించుకోవడమంటే, సెన్సార్‌షిప్‌కు తక్కువేమీ కాదని కొందరు విద్యావేత్తలు చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా, యూరోపియన్ కోర్టు స్పెయిన్‌కు చెందిన కోసెజాకు అనుకూలంగా తీర్పు నిచ్చి, ఇల్లు వేలానికి సంబంధించిన క్లిప్పింగ్ లింక్‌ను తొల గించవలసిందని ఆదేశించింది. కానీ ఒకనాడు చట్టప్రకారం కోసెజా ఇల్లు వేలం వేసిన సంగతి వాస్తవం కాదా? దీనికి యూరోపియన్ కోర్టు సమాధానం చెప్పడం అవసరమని ఇంకొందరు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
- కల్హణ