శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం
తిథి శు.ద్వాదశి రా.8.20 వరకు
నక్షత్రం జ్యేష్ఠ ప.12.01 వరకు, తదుపరి మూల
వర్జ్యం రా.8.01 నుంచి 9.37 వరకు
దుర్ముహూర్తం ఉ.8.14 నుంచి 9.04 వరకు
తదుపరి రా.11.01 నుంచి 11.51 వరకు
అమృతఘడియలు ..లేవు
సూర్యోదయం : 5.40
సూర్యాస్తమయం: 6.31
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
భవిష్యం
మేషం: అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు రావచ్చు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు నెలకొంటాయి.
వృషభం: పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తువుల సేకరణ. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యవహారాలలో అనుకూలత. ఆస్తి లాభం. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి.
కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.
సింహం: శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు రావచ్చు. ఇంటా బయటా సమస్యలు పెరిగే అవకాశం ఉంది. నిర్ణయాలలో మార్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది.
కన్య: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
తుల: కుటుంబంలో చికాకులు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
వృశ్చికం: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అదే అవకాశం ఉంది.
ధనుస్సు: వ్యయప్రయాసలు. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. పనులు వాయిదా. సోదరులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
మకరం: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలయ దర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
కుంభం: ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. వాహన యోగం కలుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మీనం: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. మానసిక అశాంతి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
- సింహంభట్ల సుబ్బారావు