శ్రీమన్మథనామ సంవత్సరం,ద క్షిణాయనం, గ్రీష్మ ఋతువు
శ్రీమన్మథనామ సంవత్సరం,ద క్షిణాయనం, గ్రీష్మ ఋతువు
నిజ ఆషాఢ మాసం, తిథి బ.తదియ ఉ.10.29 వరకు
తదుపరి చవితి, నక్షత్రం శతభిషం ఉ.7.11 వరకు
తదుపరి పూర్వాభాద్ర తె.5.30 వరకు (తెల్లవారితే మంగళవారం), వర్జ్యం ప.1.07నుంచి 2.37 వరకు
దుర్ముహూర్తం ప.12.32 నుంచి 1.21 వరకు
తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు
అమృతఘడియలు రా.10.03 నుంచి 11.34 వరకు
సూర్యోదయం:5.42 సూర్యాస్తమయం: 6.29
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
భవిష్యం
మేషం: ఆసక్తికరమైన సమాచారం. విందువినో దాలు. కార్యజయం. ఆప్తుల సలహాలు స్వీకరి స్తారు. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. దైవచింతన.
వృషభం: ఉద్యోగయత్నాలలో అనుకూలత. పనులు సాఫీగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మిథునం: పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని ఖర్చులు. ఇంటాబయటా బాధ్యతలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దూరప్రయాణాలు.
కర్కాటకం: శ్రమా ధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమి త్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
సింహం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తివృద్ధి. కీలక నిర్ణయాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కన్య: దూరపు బంధువులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. వస్తులాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఊహించ పదోన్నతులు.
తుల: వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు. శ్రమపడ్డా ఫలితంఉండదు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనుల్లో పురోగతి. వాహన, గృహయోగాలు. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మకరం: బంధువులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. పనులు మధ్యలో విరమిస్తారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కుంభం: సోదరులు,సోదరీలతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మీనం: బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు కలసిరావు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దైవదర్శనాలు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.
- సింహంభట్ల సుబ్బారావు