హుదూద్ వెనుక వాస్తు హస్తం | Hudood architects behind the hand | Sakshi
Sakshi News home page

హుదూద్ వెనుక వాస్తు హస్తం

Published Fri, Oct 24 2014 11:46 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

హుదూద్ వెనుక వాస్తు హస్తం - Sakshi

హుదూద్ వెనుక వాస్తు హస్తం

హుదూద్ చంద్రబాబుకి నూతన వెలుగుని అమావాస్య పూట తెచ్చిపెట్టింది. ఏదీ ఊహించలేం. పెద్ద ప్రయత్నం ఒక్కోసారి తుస్సుమంటుంది. ఒక్కోసారి చిన్న ప్రయత్నం అద్భుతంగా క్లిక్ అవుతుంది. కలిసొచ్చే కాలంలో మీడియా ఆల్ ఎడిషన్స్‌లో స్పందించినా బొత్స సత్యనారాయణ రంకెలు వేసినా ఎవ్వరూ పట్టించుకోరు.
 
 అక్షర తూణీరం

 
దినపత్రిక రాగానే తారీకు, వారం చూ సు కుని మనసులో పె ట్టుకోవడం అలవా టు. ఇవ్వాల్టిది కాదు, అరవై ఏళ్ల అలవాటు. క్రమంగా వారంతో బాటు వర్జ్యం, యమ గండం, రాహుకాలం కూడా చేర్చారు. పోటీ పెరిగేసరికి సూర్యో దయ, సూర్యాస్తమయ వేళలు ఇవ్వడం మొదలే శారు. ముస్లిం సోదరుల కోసం ప్రార్థన వేళలు సమకూర్చారు. రాను రాను పేపరులో అరచేతి విస్తీర్ణం  ఈ రోజువారీ సమాచారానికి సరిపోయే పరిస్థితి వచ్చింది. సంతోషించాను. ఎందుకంటే, ఇదొక్కటే పూర్తిగా నమ్మదగిన భోగట్టా. ఆ మధ్యన ఒక ప్రముఖ దినపత్రికలో, అట్లాగని అప్రముఖ దినపత్రిక కూడా కాదు. అందులో పై చెప్పిన పంచాంగాంగ వివరణ కింద ‘‘ఇదే తే. వార. నక్షత్ర. వర్జ్య. యమగండాది వేళలు అన్ని ఎడిషన్లకు వర్తి స్తాయి-ఎడిటర్’’ అనే సూచన గమనించి ఉలిక్కి పడ్డాను. ఎడిషన్ల ప్రభావం అనుకున్నాను. ఈ మధ్య ఒక డైలీలో (సాక్షి కాదు) ‘‘ఫలానా వారు ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు అన్ని ఎడిషన్లలోనూ మరణించారు.’’ అన్న వార్త చదివి విస్తుపోయాను. ఎందుకంటే ఈ ఎడిషన్లు మా తరానికి కొత్త. పి.వి. గారు పోయినపుడు ఈ సంగతి తెలంగాణ వరకు సరిపోతుందా, లేక ఆల్ ఎడిషన్స్‌కి అవసరమా అని శౌనకాది మహర్షులు సందిగ్ధంలో పడ్డారని చెప్పుకు న్నారు. రేప్ వార్తలు హాట్‌న్యూస్ కాబట్టి జ్యూరీ సెక్షన్ ఉండదు. అందరూ చదువుతారు- కొందరు ఇష్టంగా, మిగిలిన వారు అయిష్టంగా. హిందీ భాషలో ఏది స్త్రీలింగమో, ఏది పుంలింగమో చెప్పడానికి ఒక సూత్రం లేదు. ఒక నియమం లేదు. నిబంధన లేదు. ఏమాటకామాటే. ఇది ఫలానా అని తేల్చుకోవాలి. చాలా సరళంగా కనిపిస్తూ, వినిపిస్తూ ఉండే హిందీ భాషలో అత్యంత పరుషమైంది ఈ లింగ నిర్ధారణ. నరేంద్రమోదీనైనా అర్థం చేసుకో వచ్చుగాని ఈ పద నిర్ధారణ చేయజాలం అంటారు. అసలు సంగతికి వస్తే, ఏ వార్తని ఏ ఎడిషన్‌లో ఎక్కడ ఎంత స్పేస్‌లో వెయ్యాలన్నదే నేటి బ్రహ్మ విద్య. వ్యాపార ప్రకటనలంటారా, మిల్లీ మీటర్ల కొలతలతో లెక్క తీసుకుంటారు. కాబట్టి పేచీ లేదు. అనధికార ప్రకటనలుంటాయి వాటినే గోప్యంగా ఇన్‌సైడర్లు ‘పెయిడ్ న్యూస్’ అని ముద్దుగా పిలుచు కుంటూ ఉంటారు. వాటిని ఎడిషన్ బట్టి విచక్షణతో వ్యవహరించాలి. తగినంత పాత్రత, విశ్వసనీయత కల్పించకపోతే చెల్లింపు వార్తలు మరోసారి గుమ్మం లోకి రావు.

ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే, దాన్ని అను కూలంగా మార్చుకుని ఆ విధంగా ముందుకు పోవాలి. హుదూద్ బీభత్సం సృష్టించింది. అన్ని ఎడిషన్లలో చంద్రబాబు ‘సంభవామి యుగే యుగే’ అన్న స్థాయిలో కంచుకాగడాలతో రంగప్రవేశం చేశారు. అయితే గతంలో అలిపిరి సంఘటన బాబుకి అనుకున్నంత కలిసిరాలేదు. ఆ నాటి దృశ్యం పునరుత్థానం లాగా రక్తసిక్తమై పైకి లేస్తూ పదే పదే కనిపించినా ఆ రసం ఏ మాత్రం పండలేదు. అదే మరి హుదూద్ చంద్ర బాబుకి నూతన వెలుగుని అమావాస్య పూట తెచ్చిపెట్టింది. ఏదీ ఊహించలేం. పెద్ద ప్రయ త్నం ఒక్కోసారి తుస్సుమంటుంది. ఒక్కోసారి చిన్న ప్రయత్నం అద్భుతంగా క్లిక్ అవుతుంది. కలిసొచ్చే కాలంలో మీడియా ఆల్ ఎడిషన్స్‌లో స్పందించినా బొత్స సత్యనారాయణ రంకెలు వేసినా ఎవ్వరూ పట్టించుకోరు. పైగా అపోజి షన్ అజ్ఞానం పొజిషన్‌లో ఉన్నోడికి కొండంత అండ! వచ్చిన వాడు చూసి వెళ్లొచ్చు గదా, ‘‘కేంద్ర సాయం ఎంత అడగాలో తెలియలేదు. ఇది చంద్రబాబు అనుభవ రాహిత్యానికి నిదర్శనం. హుదూద్ నష్టం డెబ్భై వేల కోట్ల పైనే ఉంటుందని మా ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే కేవలం రెండువేల కోట్లు అడిగారు. కేంద్రం వెయ్యి కోట్లు ఇచ్చింది. అదే లక్ష కోట్లు అడిగితే సగం ఇచ్చేవారు’’ అన్నట్టుగా మాట్లాడారు మెగాస్టార్. అందుకే పెద్ద లు అంటారు- జ్ఞానాన్ని ప్రదర్శించడం కంటే అజ్ఞా నాన్ని కప్పెట్టుకోవడం ముఖ్యమని. ఒక సంగతి, పైగా ఇది అన్ని ఎడిషన్‌లలోను వేయదగినది అని చెప్పకుండా ఉండలేను. హుదూద్ కోస్తాపై విరు చుకు పడడం వెనుక వాస్తు హస్తం ఉందట. చీలిక తరువాత కొలతలు మారాయి. దిశలు మారాయి. దాంతో దశలు మారాయి. బరువు తగ్గింది. తేడా లొచ్చే సరికి, ఎటో వెళ్లాల్సిన హుదూద్ పిలిచినట్టు ఈ విశాఖ రేవుకి వచ్చిందట. ‘‘అయితే ఈ మారిన వాస్తుని సరిచేసే మార్గం లేదా’’ అని బావురుమ న్నాను. ‘‘ఉంది ... లేకేమి. ఉంది. దాన్ని కాలమే సరిచేస్తుంది’’ అంటూ స్వామీజీ యోగంలోకి వెళ్లిపోయారు.

 (వ్యాసకర్త ప్రముఖ రచయిత)     శ్రీరమణ
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement