నేడు తాపీ ధర్మారావు జయంతి
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును, మరెన్నో సాహిత్య అవార్డులను సంపాందించుకున్న తాపీ ధర్మారావు గారి జయంతి వేడుకలు నేడు. ‘తాతాజీ’గా ముద్దుగా పిలుచుకునే ఈయన అందరికీ సుపరిచితులే.
గౌరవ పురస్కాలు : శృంగేరీ పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు, చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు. మరెన్నో సాహిత్య అవార్డులు.
ఇతర విషయాలు : ‘తాతాజీ’ గా అందరికీ సుపరిచితులు. ఈయన గిడుగు రామమూర్తి పంతులు గారి శిష్యులు. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా వంటి పత్రికలలో పనిచేశారు. కళాశాల, సర్వే డిపార్ట్‌మెంట్‌లలో పలు ఉద్యోగాలు చేశారు. ఈయన తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో వెలువడింది. తరువాత అనేక రచనలు చేశారు. మాలపిల్ల (1938) సినిమా రచనతో సినీరంగ ప్రవేశం జరిగింది. 1943లో జరిగిన మొదటి అభ్యుదయ రచయితల సమావేశానికి అధ్యక్షత వహించారు. రచయితగా, భాషాపండితుడిగా, హేతువాదిగా, సంఘసంస్కర్తగా ప్రసిద్ధులు. ‘పాతపాళీ’, ‘కొత్తపాళీ’, ‘దేవాలయంపై బూతుబొమ్మలెందుకు?’ మొదలైన గ్రంథాలను రచించిన హేతువాది. చేమకూర వెంకటకవి ‘విజయ విలాసాని’కి హృదయోల్లాస వ్యాఖ్యను రచించారు
మరణం : 08-05-1973
పూర్తిపేరు : తాపీ ధర్మారావు నాయుడు
జననం : 19-09-1887
జన్మస్థలం : ఒరిస్సాలోని బరంపురం
తల్లిదండ్రులు : నరసమ్మ, డాక్టర్ అప్పన్న
చదువు : బి.ఏ. (పచ్చయ్యప్ప కాలే జ్ , చెన్నై)
తోబుట్టువులు : అన్నయ్య (నరసింగరావు), తమ్ముడు (తులసీరావు), చెల్లెళ్లు (వెంకటనరసమ్మ, తిరుపతమ్మ)
వివాహం : 1902
భార్య : అన్నపూర్ణమ్మ
పిల్లలు : కుమార్తెలు (లక్షుమమ్మ, బంగారమ్మ), తర్వాత కవలలు పుట్టి చనిపోయారు. కుమారులు (మోహనరావు, కీ॥అహోబలరావు, చాణక్య)
పాటలు రాసిన తొలిచిత్రం : రైతుబిడ్డ (1939)
ఆఖరిచిత్రం : భీష్మ (1962)
పాటలు : సుమారు 250